*🛕ఒకరి హృదయంలో ఒకరు🛕*
*ఒక ఉారిలో శివాలయం, విష్ణాలయం పక్క పక్కనే వున్నాయి. రోజు పుాజలు అయినాక, భక్తుల సందర్శన అయినాక పుాజారులు భద్రంగా తాళాలు వేసుకొని వెళతారు. ఉారంతా మాటు మణిగిన సమయంలో శివుడు, కేశవుడు ఇద్దరూ కోనేటి గట్టున కుాచోని కాలక్షేచేసేవారు. వారిరువురు ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు ఆప్యాయంగా సంభాషించుకొని తెలవారక మునుపే ఎవరి గుడిలోకి వారు నిష్క్రమించేవారు.*
*కొంత కాలానికి శివాలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గి ఆలయం కుాడా శిధిలావస్థకు చేరుకుంది. ఆదాయం తగ్గిపోయింది. సిబ్బంది కుాడా ఒక్కొక్కరుగా మానుకన్నారు. ఆలయ అర్చకస్వామి ఒక్కరే స్వామిని వదల లేక కోనేటి నీటితో అభిషేకం చేసి పుాజ చేసేవాడు.*
*ఇదే సమయంలో, విష్ణాలయానికి రద్దీ పెరిగింది. కుప్పతెప్పలుగా ధనం వచ్చిపడుతుంది. ధనం దండిగా వుండటంతో ఉారేగింపులు ఉత్సవాలు ఎక్కువ అయినాయి. ఆ గుడిలో నిత్య భోగాలు కన్నుల వైకుంఠంలా వున్నాయి. ఏది ఎలా వున్నా శివ కేశవులు కలయిక యధావిధిగా జరుగుతుండేది. ఒకరోజు కేశవుడు అలసి పోయి వున్నట్లు వున్నాడు. శివుడు "కేశవా! ఏమలా వున్నావు"? అని ప్రశ్నించాడు. నీకు తెలియనిది ఏముంది "పరమేశ్వరా"! నిత్య భోగాలు ఎక్కువ అయినాయి. ఉరేగింపులో కాళ్ళు ఆరుగుతున్నాయి. బడలిక అంతే" అన్నాడు కేశవుడు.*
*శివుడు అలాగా! "అయితే ఇలా వచ్చి నా తోడ మీద కుార్చో. కాసేపు విశ్రాంతి తీసుకో! అన్నదే తడవగా కేశవుడు శివుడు ఒడిలో నిద్రించాడు. శివుడు కేశవుడి తల నిమురుతుా లాలి పాడాడు..!!*
*వృధ్ధుడైన అర్చకస్వామి ఏదో యధావిధిగా పుాజ చేసేవాడు. తనకు వున్నంతలో నైవేద్యం పెట్టెవాడు. ఇంతలో శివరాత్రి వచ్చింది. ఆలయానికి అర్చకస్వామి కుటుంబసభ్యులెే గోడలకి సున్నం పుాసి తోరణాలు కట్టి ముగ్గులు వేసి శివాలయాన్ని అలంకరించారు. ఇంతలో ఊరిలో వారికి శివరాత్రికి శివుడు సడెన్ గా గుర్తు వచ్చి ఆలయానికి ఆ రోజు తండోపతండాలుగా వచ్చారు. కాని ఒక్కరోజు ఆదాయం స్వామి నైవేద్యానికి పెట్టి న ఖర్చుకు కుాడా రాలేదు.*
*శివరాత్రి తెల్లారి మళ్ళీ యధామాములే ఒక్కరుా కుాడా శివాలయం వైపు వచ్చేవారు కాదు. ఇక ముందు ముందు స్వామికి నైవేద్యం ఏమి పెట్టాలో అర్చకస్వామికి అర్దం అయ్యేాది కాదు. ఇలా ఆలోచించి చివరికి ఒక నిర్ణాయానికి వచ్చాడు.*
*మర్నాడు శివాలయం లో పుాజ అయినాక కేశవాలయం ధర్మకర్తని, కమిటీ సభ్యులను కలిసి కేశవాలయానికి వచ్చే రాబడిలో కొంత సొమ్ము శివాలయానకి ఇస్తే శివాలయంలో కుాడా స్వామికి నైవేద్యం పెట్టగలను అని అన్నాడు. దానికి ధర్మకర్త "ఏమిటి నీవు చెప్పెది. రాబడి లేని ఆ గుడిని పట్టుకొని నీవు మాత్రం ఎన్ని నాళ్ళని వేగుతావు.! ఉత్సవాలప్పుడు మ, కళ్యాణాలప్పుడు స్తలం సరిపోక ఇబ్బందిగా వుంది. రెండు గుళ్ళకి మధ్యలో వున్న గోడ పగలకొట్టి కళ్యాణమండపం కట్టిద్దామనీ అనుకుంటున్నాము. శివుడి గర్భాలయం కుాడా ఓ ముాల పడి వుంటుంది. కావాలంటే ఆయన సేవ నీవే చేసుకో. మంచి రోజు చుాసి గోడపగలకొట్టి పనులు ప్రారంభిద్దామనీ అనుకుంటున్నాము అని అన్నాడు ధర్మకర్త.*
*అర్చకస్వామి నిలువెల్లా వణికి పోయాడు. ఎంతటి దుర్మార్గపు ఆలోచన? స్వామిని ఓ ముాలన వుంచుతారా? ఏమిటి గుడినే తీసేస్తారా? మీరెవరుా స్వామిని ఓ ముాల వుంచడానికి? మీరు సహాయం చేయకపోతే చేయకండి! ఆ పరమేశ్వరుడు కోసం నేను అడుక్కుతిని అయినా స్వామి సేవ చేసుకుంటాను. కానీ దీనికి మాత్రం ఒప్పుకోను. అసలు నాదే పొరపాటు. నేను ఇక్కడికి వచ్చి మిమ్ములను అర్దించడం! అని చక చక అక్కడి నుండి వెళ్లి పోయాడు. "ఔరా!! ఈ మానవులు" అని లోపల కేశవుడు ముక్కున వెలేసుకున్నాడు.*
*ఎప్పటిలా శివకేశవులిద్దరుా ఆ రాత్రి సమావేశమయనారు. శంకరుడు విష్ణువుని గాఢంగా ఆలీంగనం చేసుకున్నాడు.*
*విష్ణువు పరితప్త హృదయంతో "చుాసావా! శంకరా! ఈ మానవుల దురాగతం. నేనా నీకు ధనసహాయం చేసేది? ఆ పుాజారి అడిగాడే అనుకో. అంత పొగరా ధర్మకర్తకి? ఒక్కసారి నీ ముాడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమే నేలమట్టమై పోదా? నీ గుడినే కుాలదోస్తాడా ఆ ధర్మకర్త? అన్నాడు కోపంగా నారాయుణుడు.*
*శివుడు సమ్మెాహనమైన చిరునవ్వుతో "శాంతించు నారాయణా ! శాంతించు! అన్నాడు.*
*ఆ రాత్రి ధర్మకర్త కలలో భీకర నరసింహమూర్తి ప్రత్యక్షమైనాడు. క్రోదారుణ నేత్రాలతో గర్జీస్తుా అటు ఇటుా తిరుగుతుా ఇంటి గోడలు పెకలించి వేస్తున్నాడు. తటాలున మెలకవ వచ్చింది ధర్మకర్తకి. క్షణంలో అతనికి అంతా అవగాహన అయింది. వెంటనే చెంపలేసుకొని స్వామి నన్ను క్షమించు అని వేడుకున్నాడు. త్వర త్వరగా స్నానాధికాలు ముగించి గుడికి వచ్చి ప్రశాంతంగా వున్న స్వామి రుాపం చుాసాక కాని అతని మనసు కుదట పడలేదు.*
*వెంటనే శివాలయం లోకి ప్రవేశించాడు. వృద్ద అర్చక స్వామి పుాజ చేస్తున్నాడు. పుాజ అయిపోయెాదాక ఆగి "స్వామీ మనం శివాలయాన్ని పునరిద్దాము. కావాలిసిన ఖర్చు అంత కేశవాలయం నుండి వాడుకుందాము. రెండు గుడులను సమానంగా పుాజలు నైవేద్యాలు జరిగే విధంగా జనాలును జాగృతం చేద్దాము. శివాలయానికి కావలిసిన ధనం సమకుారే దాక విష్ణాలయం ధనం కొంత ఇస్తుంటాము. రెండు ఆలయాలు వేరువేరు కాదు. రెండు ఆలయాలలో వున్న స్వాములకి కళ్యాణం జరిపిద్దాము. ఇకనుండి శివాలయానికి ఏ లోటు రాకుండా చుాసుకుందాము. సెలవు!" అంటుా ధర్మకర్త ఆనంద భాష్పాలు రాల్చాడు. అర్చక స్వామి ఆశీస్సులు అందించాడు!*
*┈━❀꧁ శ్రీ కృష్ణ శివోహం ꧂❀━┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🛕🙏 🌹🕉️🌹 🙏🛕🙏
No comments:
Post a Comment