Monday, March 24, 2025

 *💎 నేటి ఆణిముత్యం 💎*


తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

*భావం:*

పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది.

*ప్రతిపదార్థం:*

విషము అంటే గరళం. ఫణికిని అంటే పడగ ఉండే పాముకు. తలన్ అంటే పడగలో ఉండే కోరలలో. ఉండున్ అంటే ఉంటుంది. వృశ్చికమునకున్ అంటే తేలుకు. వెలయన్ + కాన్ అంటే స్పష్టమయ్యేటట్లుగా. తోకన్ అంటే తోకలో మాత్రమే. ఉండున్ అంటే ఉంటుంది. ఖలునకున్ అంటే చెడ్డవానికి. తల తోక యనక అంటే అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా. నిలువు + ఎల్లన్ అంటే శరీరమంతటా విషం ఉంటుంది. కదా అంటే కదయ్యా!

పాముకి కోరలు తీసేస్తే ఇంక దాని శరీరంలో ఎక్కడా విషం ఉండదు. అదేవిధంగా తేలుకి తోక తీసేస్తే దాని శరీరంలోనూ ఇంకెక్కడా విషం ఉండదు. కాని మనిషికి మాత్రం అలా కాదు. అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా దుష్టుని శరీరమంతా విషం వ్యాపించి ఉంటుంది అని దుర్గుణాలు ఉన్న మనుషుల గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment