Sunday, March 2, 2025

 Vedantha panchadasi:
వ్రతాభావాదాఽధ్యాస స్తదా భూయో వివిచ్యతామ్ ౹
రససేవీ దినే భుంక్తే భూయో భూయో యథా తథా 
౹౹249౹౹
శమయత్యౌష ధేనాయం దశమః స్వం వ్రణం యథా౹
భోగేన శమయిత్వైతత్ర్పారబ్ధం ముచ్యతే తథా 
౹౹250౹౹

అధ్యాస కలిగిన మరల మరల వివేచించుకొన వలెను.వ్యాధి నివారణకై పాదరసము తినిన వ్యక్తి దానివలన కలిగిన ఆకలి తీరుటకు పదే పదే భుజించును కదా.

వ్యాఖ్య:- జీవన్ముక్తి వ్రతంలాంటిది కాదా ? అంటే -
జీవన్ముక్తి దశ అనేది వ్రతం కాదు.
వ్రతము కాకపోవుటచే అప్పుడప్పుడు ప్రమాదము కలిగినా దిగులులేదు.
అధ్యాసం(భ్రాంతి)
కలిగినప్పుడల్లా మరల మరల వివేచించుకొనుట అభ్యాసం చేయాలి.

రసం,గంధకం లాంటి రసౌషధాలు సేవించిన వాడు ఆకలి వేసినప్పుడల్లా మాటి మాటికి భోజనం చేసినట్లుగా ముముక్షువు కూడా 
"దేహాదులు ఆత్మ కాదు" అని మాటి  మాటికి వివేచన చేయాలి.
అధ్యాస మరల కలుగుట జీవన్ముక్తి ఆనందమునకు భంగము కలిగించును గాని తత్త్వజ్ఞానమునందు లోపము కలిగింపదు.
జ్ఞానం వలన ప్రారబ్ధ నివృత్తి కలుగకపోతే ఇంకా దేనివలన కలుగుతుంది ? అంటే -

ప్రారబ్ధము అనుభవించుటచతో నశించును.దశముడు ఔషధములచే తన గాయములను మాన్పుకొనినట్లు,
జ్జాని ప్రారబ్ధకర్మమనే దానిని అనుభవించి దానిని క్షయింపజేసి ముక్తి నొందును.

"జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా" -
భగవద్గీత 4-37 

జ్ఞానాగ్ని కర్మములన్నింటిని భస్మీ పటలము చేయగలదని భగద్గీతాచార్యుడగు 
శ్రీకృష్ణ పరమాత్మ 
చెప్పి యున్నాడు కదా ! అంటే -

తత్త్వజ్ఞానము గల్గిన వెంటనే అజ్ఞానము యొక్క ఆవరణాంశము("స్వరూపమును తెలియకుండుట"
అను అంశము) వైదొలగుతుంది.ఈ ఆవరణాంశము నివృత్తి యగుటచే ఈ అంశమును ఆశ్రయించి ఉండే సంచిత కర్మ నశించి పోవుచున్నది.

జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి నశించి యుండుటచేతను,మరియు 
"నేను అసంగబ్రహ్మ రూపుడను"అను జ్ఞానము దృఢంగా యుండుట చేతను తామరాకుమీది జలము వలె తత్త్వజ్ఞానికి ఆగామికర్మము స్పృశింప నేరదు.

ఇక ప్రారబ్ధకర్మ పూర్వమొకానొక జన్మములోగానీ అనేక జన్మలలో గానీ చేయబడి అజ్ఞానము యొక్క విక్షేపశక్తిని 
(అనాత్మయయిన "దేహేంద్రియాదులే నేను"అనెడి బుద్ధిని కలిగించునది) ఆశ్రయించి ప్రస్తుత దేహానికి ప్రారంభమై యున్నది.
ఆత్మజ్ఞానము కలుగుట కంటె ముందుగానే ప్రారంబింపబడిన కర్మ(ప్రారబ్ధకర్మ) - విడువబడిన బాణము తన లక్ష్యమును భేదించియే తీరునటుల, సుఖదుఃఖరూప ఫలము బ్రహ్మజ్ఞానమువలన నశించదు. అనగా విడువబడిన బాణము ఉపసంహరింప సాధ్యముగానియటుల ప్రారబ్ధకర్మ దాట ఎవ్వరికీ సాద్యముగాదు.

ఇట్లు జ్ఞానాగ్నిచే సంచిత ఆగామికర్మలు దగ్ధమయినను ప్రారబ్ధము మాత్రము అనుభవించుట చేతనే నశించును.

"ఆత్మానంచేత్ ...."బృ.4-4-12.
అనే శ్రుతివాక్యంలో జీవునియొక్క అపరోక్షజ్ఞానం,శోక నివృత్తి అనే రెండు అవస్థలు అయ్యాక ,
ఇక జీవునియొక్క "తృప్తి"
అనే సప్తమావస్థను గూర్చి చూద్దాం -

కిమిచ్ఛన్నితి వాక్యోక్తః శోకమోక్ష 
ఉదీరితిః ౹
అభ్యాసస్య హ్యవస్థైషా .షష్ఠీ తృప్తిస్తు సప్తమీ 
౹౹251౹౹
సాఙ్కశా విషయై స్తృప్తిరియం తృప్తిర్నిరఙ్కూశా ౹
కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతి 
౹౹252౹౹
ఐహి కాముష్కిక వ్రాతసిద్ధ్యే ముక్తేశ్చ సిద్ధయే ౹
బహు కృత్యం పురాఽస్యాభూత్తత్సర్వమధునా కృతమ్ 
౹౹253౹౹
తదే తత్కృతకృత్యత్వం ప్రతియోగిపురః సరమ్ ౹
అనుసందధదేవాయమేవం తృప్యతి నిత్యశః 
౹౹254౹౹

మొదటి శ్లోకంలోని "కిమిచ్ఛన్"
(దేనిని కోరి)అనేపదము దుఃఖము నుండి దుఃఖనాశమును సూచించును.విషయభోగము వలన తృప్తి పరిమితము. బ్రహ్మానుభవము వలన ఈ తృప్తి అపరిమితము.

వ్యాఖ్య:- 126 -251 శ్లో౹౹ నందు శోకమోక్షదశ వర్ణింపబడినది.
252 నుండి 298 వరకు నిరంకుశతృప్తి వర్ణింపబడును.

"కిమిచ్ఛన్కస్య కామాయ" 
బృ.4.4.12, అనేది శోకమోక్షదశను వ్యాఖ్యానిస్తోంది.ఇది జీవుని యొక్క(చిదాభాస యొక్క) ఆరవ అవస్థ "తృప్తి"అనేది జీవుని యొక్క ఏడవదశ. "అజ్ఞాన మావృత్తి తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః అపరోక్షగతిః శోకమోక్ష స్తృప్తి నిరంకుశా"అని ఈ ప్రకరణం 
33 వ శ్లోకంలో జీవుని ఏడు అవస్థలు చెప్పబడ్డాయి. ఇంతవరకు ఆరు అవస్థల్ని వర్ణించుకున్నాం.ఇక ఏడవ అవస్థయైన తృప్తిని గురించి చెప్పుకుందాం.

అపరోక్షజ్ఞానము వలన కలిగే తృప్తి, నిరతిశయానందదాయకం అని అంటున్నారు.
శబ్దాది విషయజ్యమైన తృప్తి సాంకుశం - ప్రతిబంధము కలది.అంటే నిరతిశయానందప్రదమైనది కాదు.ఒక విషయం వలన కలిగిన తృప్తి మరొక విషయానుభవం వలన కుంఠితమైపోతుంది.కాబట్టి అటువంటి తృప్తి 
సాపేక్షము - సాతిశయము అన్నమాట.

కాని అపరోక్షజ్ఞానము వలన కలిగే తృప్తి అపరమితమైనది.అది విషయాల వలన కలిగేది కాదు.
పొందవలసిన దానిని పొంది నందువల్ల ఇక పొందవలసినదేదీ లేనందువల్ల అటువంటి తృప్తి నిరతిశయమైన తృప్తి అన్నమాట.

విషయభోగము వలన తృప్తి పరిమితము.బ్రహ్మానుభవము వలన ఈ తృప్తి అపరమితము.చేయవలసినదంతా చేయబడింది. పొంద వలసినదంతా పొందబడినది అనే తృప్తిజెందును.

ఐహిక,ఆముష్కిక సుఖప్రాప్తికోసం,దుఃఖ నివృత్తికోసం,మోక్ష సిద్ధి కోసం అజ్ఞాన దశయందు ఉన్నవాడు ఏ కృషి చేయాలో ఆ విధమైన కృషినంతటినీ చేసి నేను కృతకృత్యుడైనాను,ఇక చేయవలసిన దేదీలేదు అనేది కృత కృత్యావస్థ.

బ్రహ్మజ్ఞానమునకు పూర్వము ఇహలోకమునందు పరలోకమునందు లభింపవలసిన ఆనందముల కొరకు మోక్షము కొరకు కృషి వాణిజ్యాదులు,యోగము,
ఉపాసునాదులు,శ్రవణాదులు అనేకములైన కర్మలు చేయబడినవి.
తత్త్వజ్ఞానోదయముచే ఇపుడు ఇహపరసుఖములందు ఇచ్ఛ లేకపోవుట చేతను బ్రహ్మానందము ప్రాప్తమగుటచేతను ఇక కర్తవ్యమేమీ మిగులదు.అంతా చేయబడినట్లే.
అవధూత.ఉప.9

బ్రహ్మభావ రూపమైన కృతార్థతను పొందిన జ్ఞాని,
ఈ కృతార్థతకు 
విరుద్ధమైన -వ్యతిరేకదశలో
(ప్రతియోగియైన) కూడా తన కృతార్థతను సమీక్షించుకొనుచు-పరిశీలించుకొంటూ పరమమైన 
తృప్తితో సదా తృప్తుడై ఉంటాడు.

ఇక ఆ విధమైన కృతార్థతను పరిశీలించుకోవటాన్ని -
అనుసంధానమును విపులీకరించుకుందాం -              

No comments:

Post a Comment