☀️ ఒకే ఒక్క దారి(అష్టాంగ మార్గం) ☀️
🪷 *పట్టు పట్టరాదు - పట్టి విడువరాదు* 🪷
🦚 *సమ్యక్ సంకల్పం* 🦚
✳️ *(సరైన పూనిక)* ✳️
🔅🔅 *పార్ట్ - 01* 🔅🔅
*_పిల్లల చేష్టలు:_*
* అష్టాంగమార్గంలోని మొదటి భాగంలో రెండో అంశం సమ్యక్ సంకల్పం లేదా సమ్యక్ నిర్ణయం. అంటే ... సరైన నిర్ణయం. “నిరతాం మతేరంతం నయతి ఇతి నిర్ణయం” అంటారు. లేదా “నిశ్చినోతి ఇతి నిశ్చయం" అంటారు. అంటే బుద్ధిని ఒక దరికి చేర్చేది, బుద్ధి చెదరకుండా చేసేది" అని అర్థం. మనం ఏ పనినైతే పెట్టుకున్నామో, దాని నుండి మన బుద్ధిని మరల్చకుండా చూసేదే నిశ్చయం. మనం చేసే పనిని అప్పటికప్పుడు అనుకోకుండా యాదృశ్చికంగా చేయకుండా, బాగా అలోచించి, ఎలా చేయాలో ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకుని ఆ పని చేయడానికి మనం పట్టే పూనికే సంకల్పం. నిశ్చయం, ఉద్దేశ్యం, పూనిక, తలపెట్టడం, ఇవ్వన్నీ సంకల్పానికి పర్యాయపదాలే.
* ఒక పని మొదలుపెట్టి మధ్యలో మరో పనిని చుట్టబెట్టాలనుకుని భావించి, చివరికి ఇంకో పనిలో వేలు పెట్టడమే నిశ్చయబుద్ధి లేకపోవడం. ఇలా చేసే వాళ్లని చిన్నపిల్లలతో పోలుస్తారు. “ఏమిటీ పిల్లచేష్టలు" అంటూ మందలిస్తారు. చిన్నపిల్లలకి విషయ ప్రాధాన్యత తెలియదు. ఎందుకంటే వారికి "ఆ విషయంతో” సంబంధమే ఉండదు. మనం ఒక పని చెపితే, వారు ఇంకో పని చేస్తారు.
* ఇటీవల వచ్చిన జురాసిక్ పార్క్-॥ సినిమాలో ఇలాంటి సంఘటన ఉంది.
* ఒక పిల్లవాడి తండ్రి రాకాసి బల్లి వల్ల నీటి ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఇంటికి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ని ఆ పిల్లవాడు తీస్తాడు. "నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. నీవు త్వరగా ఫోన్ తీసుకుపోయి మీ అమ్మకు ఇవ్వు" అంటాడు. ఆ పిల్లాడు ఫోన్ తీసుకుని అమ్మ ఉన్న గదిలోకి పరుగులు తీస్తూ వస్తుంటాడు. వాడు హాలోకి రాగానే ... టి.వి. లో చిన్నపిల్లల కామిక్ చిత్రం కనిపిస్తుంది.
* వాడి దృష్టి టి.వి. మీదికి పోతుంది. ఫోన్ విషయం మరచిపోయి టి.వి. చూస్తూ ఉంటాడు. అవతలి నుండి తండ్రి "హలో... హలో...” అంటూ అరుస్తూనే ఉంటాడు. "పిల్లవాడు" అనేవాడు కచ్చితంగా అలాగే చేయాలి. కాని, పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తేనే “పిల్ల చేష్ట" అంటాం. పిల్లలు చేస్తే అనలేము.
* ఎందుకంటే ... మనిషికి ఎదిగిన కొద్దీ వివేచన కలుగుతుంది. కలగాలి. అలా కలిగితేనే మనిషి,
* మనం తలపెట్టిన ఏ పని అయినా నిర్విఘ్నంగా సాగదు. ఎందుకంటే... ఈ ప్రపంచంలో మనం ఒక్కరిమే లేము. ప్రతి పనీ మన ఒక్కరితోనే ఉండదు. కాబట్టి విఘ్నాలు సహజం. విఘ్నాలు కూడా అనేక రకాలు. ప్రకృతివల్ల రావొచ్చు. మనుషుల వల్ల రావొచ్చు. మనవల్లే మనకూ విఘ్నాలు కలగొచ్చు. ప్రకృతి వల్ల వచ్చే విఘ్నాలు సహజాలు.
* కానీ, మన వల్ల మనకూ, మన వల్ల ఇతరులకూ, ఇతరుల వల్ల మనకూ వచ్చే 'అవరోధాలు (విఘ్నాలు) అన్నీ మన ఆలోచనల వల్ల కలిగేవే! మనం ఇతరులతో ప్రవర్తించే తీరువల్లగానీ, ఇతరులు దురాశల వల్లగానీ, ఇతరులకు కలిగిన అపోహల వల్లగానీ విఘ్నాలు కలుగుతాయి.
* మనం గతంలో చెప్పుకున్నట్లు, అష్టాంగమార్గంలోని మొదటి విషయం "సమ్యక్ దృష్టి (సరైన దృక్పథం) ఉంటే అవరోధాలు అంతగా రావు. వచ్చినా మన గమనాన్ని ఆపనూలేవు.
* మనం ఏ పనినైనా సాధించడానికి అది చిన్నదైనా, పెద్దదైనా సరే ఈ అవరోధాలు ఉంటూనే ఉంటాయి. చిన్న పనులకు చిన్నచిన్న అవరోధాలు వస్తే. పెద్ద పనులకు పెద్ద పెద్ద అవరోధాలు వస్తాయి.
☸️ *నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్సా* ☸️
📚 *పుస్తకం - ఒకే ఒక్క దారి(అష్టాంగ మార్గం) 📚*
📝 *రచయిత - బొర్రా గోవర్ధన్ గారు 📝*
✍ *సేకరణ - వైశాఖి చక్రవర్తి* ✍
📅 *తేదీ - 28 - 05 - 2025* 📅
No comments:
Post a Comment