Saturday, June 21, 2025

 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌏కథతో

 ♥️ *కథ*-*133* ♥️

మన హృదయానికి దగ్గరగా ఉన్నవారు మనల్ని ఎలా గుర్తించాలి, మనం వారికి దూరంగా ఉన్నప్పుడు, వారు మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి?

*ఒక* *బహుమానం* 

ఏడేళ్ల ఆరాధ్య రెండో తరగతికి వచ్చింది. ఆమె ఎప్పుడూ తన తరగతిలో అగ్రస్థానంలోనే ఉంటుంది. ఇటీవలనే, జీతం రాగానే తండ్రి కొత్త స్కూల్ డ్రెస్ , బూట్లు కొనడానికి ఆమెను బజారుకు తీసుకెళ్లాడు.

పాత బూట్లని కొంచెం బాగుచేయించుకుంటే, ఈ ఏడాది కూడా వాడుకోవచ్చు అని కొత్త బూట్లు కొనుక్కోవడానికి నిరాకరించింది ఆరాధ్య. తనకు బూట్లు కొనేబదులు, తాతయ్యకు కంటిచూపు  బలహీనంగా ఉన్నందున ఆయనకు కొత్త కళ్లద్దాలు కొనమని తండ్రిని కోరింది.

బహుశా ఆరాధ్యకి తన తాతయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి, తన బూట్ల కంటే ఆయనకు కళ్ళద్దాలే ముఖ్యమనుకుంటోందని తండ్రి అనుకున్నాడు.


సరే, తండ్రి ఏమి అనకుండా, యూనిఫామ్ కోసం షాపుకి తీసుకెళ్లాడు. దుకాణదారుడు ఆమెకు సరిపోయే సైజులో ఒక తెల్లటి చొక్కా తీశాడు. ఆమె వేసుకున్నప్పుడు, చొక్కా సరిగ్గా సరిపోయింది, కానీ ఇంకా కొంచెం పొడవాటి చొక్కా చూపించమని ఆరాధ్య అడిగింది.

తండ్రి, " అమ్మా ,ఆరాధ్య, ఈ చొక్కా నీకు సరిగ్గా సరిపోయిందిగా, నీకు ఇంకా పొడవు చొక్కా ఎందుకు?", అని అడిగాడు.

ఆరాధ్య, "నాన్నా, నేను ఎలాగూ చొక్కాను నా స్కర్ట్  లోపలే పెట్టి వేసుకోవాలి, కాబట్టి కొంచెం పొడవుగా ఉన్నా, దాని వల్ల ఎటువంటి తేడా ఉండదు. పైగా, నేను ఈ చొక్కాను తరువాతి క్లాస్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. నా మునుపటి చొక్కా కూడా బాగానే ఉంది, కానీ అది నాకు పొట్టయిపోవడం వల్ల, నేను దానిని ఉపయోగించలేకపోతున్నాను", అని చెప్పింది.

ఆమె తండ్రి మౌనంగా ఉండిపోయాడు...

ఇంటికి తిరిగి వస్తుండగా కూతుర్ని అడిగాడు," ఆరాధ్యా, నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు?"

ఆరాధ్య ఇలా చెప్పింది, "అమ్మకి కొత్త చీర కొనకుండానో, లేదా నీకోసం కొత్త బూట్లు తెచ్చుకోకుండా, నా పుస్తకాలకు, బట్టలకి డబ్బు మొత్తం ఖర్చుపెట్టడం నేను తరచుగా గమనిస్తూఉంటాను. నువ్వు చాలా నిజాయితీపరుడివి అని మన కాలనీలోని వాళ్ళందరూ చెప్పుకుంటూఉంటారు. ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నా, ప్రదీప్ తండ్రిని మాత్రం అందరూ దొంగ, నిజాయితీ లేనివాడు, లంచం తీసుకునేవాడు అని ఇలా చాలా అంటూంటారు.

అందరూ నిన్ను పొగిడితే నాకు చాలా ఇష్టం నాన్న. అమ్మ, తాతగారు  కూడా నిన్ను చాలా అభినందిస్తూ ఉంటారు. కొత్త బట్టలు లేదా కొత్త బూట్లు ధరించడం అంత ముఖ్యమైనది కాదు నాన్నా, కానీ ఎవరూ కూడా మిమ్మల్ని నిజాయితీ లేనివారు లేదా లంచం తీసుకునేవారు అని సంబోధించకూడదు. నేను మీకు బలం కావాలని కోరుకుంటున్నాను, నాన్న.. నీ బలహీనతను అవ్వకూడదు."

ఆమె తండ్రికి నోటమాట రాలేదు..

ఈరోజు, మొట్టమొదటిసారిగా, అతని నిజాయితీకి తగిన ప్రతిఫలం లభించింది. ఈరోజు అతని కళ్లలో ఆనందం, గర్వం, గౌరవం తాలూకు నీళ్లు తిరిగాయి.

మీ కుటుంబం, మీ పిల్లల దృష్టిలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకోవటం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అందమైన బహుమతి. మన పిల్లలు మనల్ని ఆదర్శవంతమైన వ్యక్తులుగా భావించి, మనల్ని ప్రేమించి గౌరవిస్తే ..... 
 కష్టానికి, అంకితభావానికి ఇంతకంటే పెద్ద ప్రతిఫలం మరొకటి ఉండదు.

గౌరవం, ప్రతిష్ట సంపద నుండి కాదు, సద్గుణాల నుండి వస్తాయి.
               ♾️
హృదయం ఎల్లప్పుడూ మనకు నిజమే చెబుతుంది, సరిగ్గా మార్గనిర్దేశం చేస్తుంది. దురాశ, అహం జోక్యం చేసుకొని, తప్పుదారి పట్టిస్తాయి. మీ హృదయంలోని మంచితనం మీ చర్యలలో ప్రతిబింబించనివ్వండి. 🌼
*దాజీ*


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
x

No comments:

Post a Comment