[6/3, 15:50] +91 90404 36395: *e Reading Summer Camp Activities- Day-34*
*3-5 తరగతుల విద్యార్థులకు*
*తెలుగు నీతి కథ: *బంగారు గుడ్ల కోడి
*ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్టపడినా పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసిపోతూ ఉండేవాడు.*
*ఒకరోజు అలాగే పొలం నుంచి అలిసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ వుండగా దారిలో సూర్యాస్తమం అవుతోందని, ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్ర పోవటానికి అనుమతిని కోరాడు.*
*శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు. చేతులు, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఇన్న ఓకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేసాడు. తన దుప్పటి, తలగడ కూడా మంచం మీద వేసాడు.*
*తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం గింజల తోనే అన్నం వండి, బాటసారికి వడ్డించి, తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేసాడు.*
*కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు.*
*“ఈ కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఇక పైన నీకు ఈ పేదరికం ఉండదు.” అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు.*
*ఆరోజు నుంచి శివకాశి దశ మారింది. రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని, దానితో జీవితం కొనసాగాడు. వంటి మీద ఉన్న పాత, చిరిగి పోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు.*
*పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు. పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పూట పంచ పక్ష పరవాన్నాలు తినేవాడు. పొలం పనులు బొత్తిగా మానేసాడు.*
*పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది. ఆలోచనా మారుతుంది. పని తక్కువ, డబ్బు ఎక్కువ ఉండే సరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి. ఒక్క సారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి యెంత డబ్బూ సరిపోదు. ఇంకా, ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుందే.*
*ఇదే శివకాశి కి కూడా అయ్యింది. ఒకప్పుడు ఏమి లేకపోయినా సంతోషంగా వున్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు. కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదిన్చేయాలనే కాంక్ష మొదలైంది. గతం మర్చిపోయాడు.*
*రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటే సారి కోడిలోంచి గుడ్లున్ని తీసేస్తే, ఒకటే సారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది.*
*ఉండపట్ట లేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేసాడు. పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశి కి ఒక షాక్ తగిలింది. కోడి పొట్టలో ఏమి లేదు. లోపల మామూలు కోడిలానే వుంది.*
*మొదటికే మోసం వచ్చింది.*
*అయ్యో! ఎందుకు దురాశ పడ్డాను! అని శివకాశి అప్పుడు బాధ పడ్డాడు. కాని ఏమి లాభం? రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు.*
*👉English:*
*Farmer and Golden Duck*
*👉Maths:*
*Subtractions Working Sums*
*👉Drawing:*
*Draw Beautiful Sunrise*
[6/3, 15:50] +91 90404 36395: *e Reading Summer Camp Activities- Day-34*
*6-9 తరగతుల విద్యార్థులకు*
తెలుగు నీతి కథ: *అద్దం లో మనిషి*
*చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు.*
*వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.*
*ఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతనే అందమే అతని అహంకారం.*
*ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడూ యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి అతను సిద్ధపడ్డాడు.*
*ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గిరకు వెళ్లి ఉపాయమడిగాదు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. “రోజు ఈ అద్దం చూసుకో.*
*నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు ఎప్పుడు ఇలాగే ఉండిపోతావు” అన్నాడు.*
*“కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది.” అని హెచ్చరించాడు.*
*అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.*
*ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాంకారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధపడ్డా అతను చేసే పనులు, అతని నడవడిక మార్చుకోలేదు.*
*కొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తే భరించలేనంత అసహ్యంగా తయారయ్యింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది. అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.*
*ఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది.*
*తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది.*
*ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ యజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.
ఊరవతల ఉన్న తాంత్రికుడికి తప్ప.*
*👉English:*
*Lion and the Bulls*
*👉Maths:*
*Brain Teasers*
*👉Activity: Puzzle*
No comments:
Post a Comment