(300) (16.06.2025)
ఓ శ్రీమతి నీవు గుమ్మం వరకు వచ్చినావు
ఆపై అక్కడి నుంచి నీవు వెనుదిరిగినావు
ఈ రోజుతో మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది
ఆపై పిలిచే పిలుపు కూడా ఆగిపోయింది //
నిన్నటి వరకు నన్ను నా తోడు అని చెప్పుకున్నావు
ఈ రోజు నుంచి నాకు తోడు ఎవరని అడుగుతున్నావు
నాడు మూడు ముళ్ళతో నీకు తోడుగా వచ్చినాను
నేడు ఆ మూడు ముళ్ళనే నీకు దూరం చేసినాను //
ఇక నుంచి నీకు తోడు నీ కడుపున పుట్టిన బిడ్డలు
నాటి మూడు ముళ్ళకు నేడు వారే సాక్ష్యాలు
నేటి నుంచి వాళ్ళల్లోనే వెతుక్కోవాలి ఆనందము
ఊపిరి ఉన్నంత వరకు నెట్టుకురావాలి నీ జీవితము //
నిన్నటి వరకు పేరు పెట్టి పిలిస్తే పలికినావు
నేటి నుంచి నీతో ఉన్న బంధాన్ని బట్టి పిలిస్తే జవాబు ఇస్తావు
ఒక్క రోజులోనే పిలుపులో ఎంతో మార్పు వచ్చింది
ఆ మార్పు నీలో ఊపిరి ఉన్నంత వరకు కనిపిస్తుంది //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment