Monday, June 2, 2025

 *ఆర్య అష్టాంగ మార్గం*
*బుద్ధ భగవానుడు మానవుని సంపూర్ణ శాంతి ,సౌఖ్యాలను పొందడానికి వేసిన మార్గమే అష్టాంగ మార్గం.*

💐 *శీలం:-*

*1.సమ్యక్ వాక్కు :- ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడాలి.మాటలు మృదువుగా అర్థవంతంగా స్నేహ సామరస్యాన్ని కలిగించేదిగా ఉండాలి.అబద్ధాలకు,చాడీలకు,కఠిన వాక్కులకు,పనికిమాలిన మాటలకు దూరంగా ఉండాలి.*

*2.సమ్యక్ కర్మలు:-ఏ ప్రాణిని హింసించకూడదు,దొంగతనం,వ్యభిచారం చేయకూడదు. మత్తుపదార్థాలను సేవించకూడదు.ఇతరుల పట్ల నిజాయితీగా, గౌరవంగా, దయాపూర్వకంగా ప్రవర్తించడమే సముచిత కర్మ.*

*3.సమ్యక్ జీవనోపాధి:- తప్పుడు మార్గాలలో కాకుండా మంచి మార్గాల ద్వారానే జీవనోపాధి కల్పించుకుని బతకాలి.*

💐 *సమాధి (ఏకాగ్రత):-*

*4.సమ్యక్ వ్యాయామం:- చెడు ఆలోచనలు తలెత్తకుండా చూసుకోవాలి. మంచి ఆలోచనలు వృద్ధి చేసుకోవడం సముచిత మానసిక పరిశ్రమ.*

*5.సమ్యక్ సతి:- ప్రస్తుతం క్షణం పట్ల అప్రమత్తంగా ఉండుట. శరీరంలో జరిగే సంవేదనల పట్ల మనసులోని లక్షణాల పట్ల ,రాగద్వేషాలకు అతీతంగా కఏవలం ద్రష్టా భావంతో ఎరుక కలిగి ఉండాలి.*

*6.సమ్యక్ సమాధి(సమ్యక్ ఏకాగ్రత):- ప్రస్తుతం క్షణం పట్ల ఎరుక ,ఆ ఎరుకను సాధ్యమైనంత ఎక్కువ సేపు కొనసాగిస్తే చిత్తం ఏకాగ్రత చెంది ప్రశాంతంగా ఉంటుంది.*

💐 *ప్రజ్ఞ:-*

*7.సమ్యక్ సంకల్పం(స్వచ్ఛమైన ఆలోచనలు, చింతనలు):- దురాశ ,కోపం ,హింసా ప్రవృత్తిని కలిగించే ఆలోచనలను దూరం చేసుకోవాలి. భవబంధాలను పరిత్యజించే ఆలోచనలు వృద్ధి చేసుకోవాలి.*

*8.సమ్యక్ దృష్టి(సరైన దృష్టి):- ఉన్నది ఉన్నట్లు గా చూడటం అలవరుచు కోవాలి. మనసు గురించి పరమార్థ సత్యాలను తెలుసుకోవాలి.దుక్ఖం ఉంది.దుక్ఖానికి కారణం ఉంది.దుక్ఖాన్ని నిరోధించవచ్చు.దుక్ఖ నిరోధానికి మార్గ ఉంది.ఆ మార్గమే ఆర్య అష్టాంగ మార్గం.ఈ ఆర్య సత్యాలను అనుభూతిలోకి తెచ్చుకోవాలి.*

*✍🏽అరియ నాగసేన బోధి*
*బౌద్ధ ధమ్మ ప్రచార కర్త*

*భవతు సబ్బ మంగళమ్*

No comments:

Post a Comment