Saturday, June 21, 2025

 *నిజమైన ధ్యానం.....*

*ధ్యానమంటే పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని చేతులు బిగించి కూర్చోవడమా? కాదు, కాదు. మనస్సును భగవంతునిపై నిలిపి ఉంచడమే నిజమైన ధ్యానం.* 

*జీవిత మంతా ధ్యానంతో కూడినదే. ధ్యానం లేకపోతే పుస్తకాలు చదువలేము, ఉత్తరాలు వ్రాయలేము, బజారులో నడువలేము. భోజనం కూడా చేయలేము. మనస్సు ఇమిడ్చి చేసే ప్రతి పని ధ్యానమే.* 

*అయితే, ధ్యానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పదార్థ ధ్యానం, రెండవది పరార్థ ధ్యానం. పరిపరివిధాలుగా పరుగెత్తే మనస్సును భగవంతునిపై మరల్చడమే నిజమైన ధ్యానము.* 

*బీగం చెవిని బీగంలో పెట్టి ఎడమవైపు త్రిప్పితే బీగం పడుతుంది; కుడివైపుకి త్రిప్పితే తెరుచుకుంటుంది. హృదయమే బీగం, మనస్సే బీగం చెవి.* 

*ప్రపంచంవైపు త్రిప్పితే బంధన. భగవంతునివైపు త్రిప్పితే బంధవిమోచనం, మోక్షం. ఈ సూక్ష్మాన్ని గుర్తించకుండా గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటే లాభమేమిటి?*

*ఇలాంటి ధ్యానం చేసే బదులు సరుల్వయందున్న దైవాన్ని ప్రేమించడం ఉత్తమం. 'అందరినీ ప్రేమించు, సేవించు' - ఇదే నిజమైన ధ్యానము*

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🧘‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘‍♀️🍁

No comments:

Post a Comment