Saturday, June 21, 2025

 *సత్యం నీ ఇంటి పేరు అయితే ధర్మం నీ ఒంటి తీరు అవుతుంది.*

*శాంతం నీ నోట్లో  ఊరుతుంది, ప్రశాంతం నీ కంట్లో కనిపిస్తుంది.*

*నీవు, నీ సంకల్పం అందరికీ మంచి చేసేది అయితే.*

*నీవు కోరింది లభించక పోవచ్చేమో కానీ నీకు అవసరమైంది మాత్రం నీ చేతికే అందుతుంది.*

*నీవేవరో నీకు అర్థం అయితే, భగవంతుడు ఎవరో నీకు అర్థమవుతుంది.*

*సమయాన్ని ఒక్క నిముషం కాదు ఒక్క క్షణం కూడా వృదా చేయకు.*

*ఆహారాన్ని ఒక్క ముద్దకాదు ఒక్క మెతుకు కూడా వృదా చేయకు, (పడేయకు)*

*శాకాహారం నీ ఆశయం అయితే, ఆరోగ్యం నీకు పరవశం అవుతుంది.*

*నీకిష్టమైంది ఓంకార ధ్యానమైతే, నీకు కష్టమైంది దూరం అవుతుంది.*

*మౌనం నీకు అలవాటు అయితే, మోక్షం నీకు ఆకర్షితం అవుతుంది.*

*ఓంకారం చేద్దాం.! అందరూ ఆరోగ్యంగా ఉందాం.!*

*ఓంకారం చేసే సమయంలో మీ మనసులో సంకల్పం చేయండి, భగవంతుడు శివ పరమాత్మ నుంచి శివశక్తి ప్రకాశం, పరమాత్మ పవర్* *నాలో ప్రవేశిస్తుంది అని మనసులో సంకల్పం చేస్తూ ఉండాలి.*

*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🙏🧘‍♂️🙏 🔔🕉️🔔 🙏🧘‍♀️🙏

No comments:

Post a Comment