Monday, June 2, 2025

 మొన్న ఆదివారం కదా అని మా ఆవిడ మటన్ తీస్కొని రమ్మంది? సర్లే అంటూ బయలుదేరిన నాకు బయటికి రాగానే బార్ కనిపించింది, ఎలాగూ మటన్ కొట్టు మస్తాన్ వచ్చే వరకు గంట అవుతుంది లే అనుకొని బార్ కెళ్ళి  రెండు బీర్లు తాగి  బయటికి రాగానే నా చిన్న నాటి ప్రియురాలు సాగరిక కనిపించింది....  
హాయ్ అనీ పలకరింపులు, చిన్న నాటి తీపి గుర్తులు, తనూ చేసిన పంటి కాటు అన్ని తనకు గుర్తు చేస్తూ రొమాంటిక్ గా  ముందుకు నడిచాo, ఇంతలోనే ఇద్దరికి ఇష్టమైన శోభన్ బాబు అభిమన్యుడు సినిమా నడుస్తున్న థియేటర్ వచ్చింది... 

తను థియేటర్ వైపు చూసి, నాకు కన్ను గీటింది... ఇద్దరం కలిసి సినిమా కెళ్ళాo... 16ఏళ్ల క్రితం "ఆడువారి మాటలకు అర్థాలు వేరులే" సినిమా చూసాక, మళ్ళీ ఇద్దరం కలిసి చూసిన సినిమా ఇదే... సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేటప్పటికి, టైమ్ రెండు అవుతుంది, మా ఆవిడ తెమ్మని చెప్పిన మటన్ విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది.

వెంటనే సాగరిక ను ఆటో ఎక్కించి పంపాను. మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి పోయి నిలబడగానే, మా ఆవిడ నా కోసం వెతుక్కుంటు ఎదురుగా వస్తోంది, బెదురు గా చూస్తూ,  వెంటనే నేను పక్కన వున్నా మెకానిక్ షెడ్ లో వున్నా ఆయిల్ ని బట్టలకు పూసుకొని కొంచెం మొహానికి కూడా రుద్దుకున్న,  మా ఆవిడ నా ముందుకు వచ్చి నిలబడింది.

నేను అయోమయంగా చూస్తూ నిలబడ్డ, మస్తాన్ మటన్ సంచి నా చేతికి ఇచ్చాడు...వెంటనే మా ఆవిడ నా చేతిని లాక్కుని ఫాస్ట్ గా ఇంటికి తీసుకొని వచ్చి డోర్ వేసింది... కొంపతీసి నా గర్ల్ ఫ్రెండ్ తో  సినిమా కు పోయిన విషయం తెలిసి పోయిందా అని కంగారు పడ్డాను...  వెంటనే నా చేతులు చూపించమంది, సరే అంటూ చూపించాను. నా ఆయిల్ చేతులను ముద్దాడి, వెంటనే నా కాళ్ళమీద పడి ఏడుస్తూ, ఫ్యామిలీ కోసం చేస్తున్న జాబ్ సరిపోదని, ప్రతి సండే ఇలా మెకానిక్ వర్క్ చేస్తున్నారా అంటూ గొల్లుమని ఏడిచింది...

గమనిక :- గర్ల్ ఫ్రెండ్ ని మైంటైన్ చేయగానే గొప్పోడివి కాదు, పెళ్ళాం నుండి తప్పించు కునేందుకు ఆయిల్ పూసుకోవడo లాంటి గొప్ప ఐడియా లు కనుక్కోవాలి...🙄🤪😝🥴😄😁

   - సేకరణ

No comments:

Post a Comment