🙏🔥🔥🔥🙏" "*ఇన్లాండ్ ఉత్తరం* - *ఒక మధురమైన జ్ఞాపకం*"
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
👍"మా చిన్నప్పుడు – “ "*ఇన్లాండ్ లెటర్* అనే పదాన్ని సరిగ్గా పలకలేక “ఇంగ్లాండ్ లెటర్” అని అనడం. మాకు పరిపాటి. ఆనాటి పిల్లలు అందరిలా నేనూ అలాగే అనేవాడిని,!. సరిగ్గా "పదాల అర్థం" తెలియని వయస్సు. అప్పుడు మాకు ఆ తప్పు గుర్తుచేసి, ఉచ్చారణ సరిదిద్ది “ఇన్లాండ్” అని పలకాలని బోధించిన మా మాస్టారు వెంకటాద్రి గారి ఉపదేశం నాకు ఇంకా గుర్తుంది. చిన్నపాటి సవరణే అయినా, అది మాకు భాష మీద శ్రద్ధ పెంచే తొలి మెట్టు అనే చెప్పాలి.
👌"పోస్టు కార్డు " కన్నా కాస్త ఎక్కువ రాయాలనిపించినప్పుడల్లా! అందరూ ఎంచుకునే ఉత్తరం – "ఇన్లాండ్ లెటర్" ఇది రాయటం చాలా అరుదు. ఆ నీలి రంగు కాగితం మీద "చక్కటి దస్తూరి" తో రాసిన మాటలు – అది కేవలం ఉత్తరం కాదు, మనసులో మాటల్ని భద్రంగా మోసుకొచ్చే ఒక "మాటల పల్లకి"
పోస్ట్ మాన్ 'రాములు"
కొడుకు ఎదురుచూసే రోజులు. అవి,
"ఇన్లాండ్ లెటర్" ఇంటికి వస్తే, అక్షరం చెదరకుండా, ఎంతో శ్రద్ధగా చింపి తెరవడం ఒక కళే! అందులో రాసిన ప్రతి అక్షరం, ప్రతి పదం చదవడం ఒక అనుభూతి. ఎవరి నుండి వచ్చిందో తెలుసుకునే కుతూహలం, రాసినవారి "భావోద్వేగాలు" ఆనాటి స్మృతులు, అప్పుడు చదివే క్షణాలు, రాయటం, కొంచెం కష్టమే! మరి. ఆఖరికి అవన్నీ అప్పుడు స్మృతులే! నేడు అయ్యాయి.
🎫ఈ “ఇన్లాండ్ లెటర్”లు నశించిన ఈ ఆధునిక కాలంలో, వాటి స్థానం "వాట్సాప్ మెసేజులు", చూస్తూనే ఉన్నాము . "ఈ'మెయిళ్లు," నోటిఫికేషన్లు, ఆక్రమించాయి. కానీ వాటిలో ఆ మనసుని తాకే భావం లేదు అనిపిస్తుంది నాకు. మనుషుల మధ్య మనసుల మధ్య అనుబంధానికి సాక్ష్యంగా నిలిచిన ఆనాటి ఉత్తరాలు, ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.
ఎందుకంటే " మా గురువు గుంతకల్ లో, రామకృష్ణ గారు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే" 15 పైసలు, కార్డు రాస్తే! తప్పక చదువుతారు, జేరుతుంది చూస్తారు.
అని చెప్పేవారు.
🎤" డాక్టర్. పినమనేని కోటేశ్వరరావు గారు తరచూ! తన ప్రయాణ కదలికలు, కార్డు ద్వారా అని తెలిపేవారు. పద్మశ్రీ. ఆచంట వెంకటరత్నం నాయుడు, పౌరాణిక పాత్రలో, నటించే ఆయన డ్రామా ట్రూప్ గాని, ఒంటరిగా కాని
వచ్చిన ఏ ఊర్లో నేను ఉన్న , వారు కార్డు మీదనే సమాచారము రాసి పంపేవారు. అదే అలవాటు, ఈ ఫోనులు వచ్చేవరకు, నేను అనుసరించాను.
ఆనాటి ఉత్తరాలు.
మాత్రమే కాదు. నేను మా తాత గారికి వచ్చిన ఉత్తరాలు, నేటికీ వాటిని భద్రపరిచి దాచుకున్నాను. వాటి ద్వారా, మేము పుట్టిన తేదీలు, సమయాలు, స్పష్టంగా రాసి పంపిన, విషయం తెలిసేది. జాతకాలకు
నేడు పనికొచ్చాయి.
🙏" ఆనాడు ఉత్తరాలలో రాసే విధానము, వారి సంస్కారము, ఉభయకుశలోపరి,
చి.సౌ. అని,( చిరంజీవి సౌభాగ్యవతి:) గం.భా.స( గంగా భాగీరథి సమానురాలైన) క్షేమ సమాచారాలు, తో కూడి, ప్రత్యేకంగా ఒక పేరా ఉండేది. ఇప్పటికీ అలాంటి వాటి గురించి,
చాగంటి, గరికపాటి లాంటి పండితుల ద్వారా నేటికీ వింటున్నాము.
అదే కదా! నేను ఈ రోజు చెప్ప వచ్చేది.
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
No comments:
Post a Comment