*ఇప్పటి జనరేషన్ చేస్తున్న 15తప్పులు...*
*వీటిలో కొన్ని పొరపాట్లు నేను*
*---------------------------------* *చేస్తున్నాను అందుకే స్వయంగా*
*-----------------------------------*
1. మన టైం మొత్తం సోషల్ సైట్స్ లో
కొత్త కొత్త ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోడంలో గడుపుతున్నాం....
కానీ ఒక జీవిత కాలం నిలిచిపోయే
ఫ్రెండ్ ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాం...
2. మనం మన ఫీలింగ్స్ తెలపడానికి మాటలు మానేసి బొమ్మలు వాడుతున్నాము...
3. మనం మన ఫ్రెండ్ కి ఫేస్ బుక్ లో బర్త్ డే విషెస్ చెప్తున్నాం...
అదే విషయం వాళ్లకి ఫోన్ చేసి చెప్పడం ఎపుడో మానేసాం...
4. మన చుట్టూ ఉన్న అందాలను మన వెనక పెట్టి సేల్ఫీలు దిగితున్నాం...
కానీ,
ఆ అందాలను ఆస్వాదించడం మరిచిపోయాం...
5. మనం తిండి ఆర్డర్ చేసి దాని
ఫోటో తీసి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేయటంలో ఎంత బిజీ అంటే,
తిండి టేస్ట్ ని ఆస్వాదించడం మానేసాం.
6. టైంపాస్ కావడానికి మొబైల్ ని పట్టుకుంటాం
కానీ,
ఎవరితో మాట్లాడం,
అందులో ఉన్న యాప్స్ మాత్రమే నచ్చుతున్నాయి...
మాట్లాడే మనుషుల కన్నా...
7. ఒకపుడు ఫ్రెండ్స్ అందరూ కలిస్తే మాట్లాడుకునే వారు,
ఇపుడు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ...
అంతదానికి కలవడం ఎందుకు???
ఎవడింట్లో వాడు ఉంటె సరిపోతుంది కదా..!
8. ఇంట్లో ఉండటం అంటే,
డౌన్ లోడ్ చేసుకున్న సినిమాలు,
టీవీ చూడటం కాదు...
ఇంట్లో ఉన్న వాళ్లతో మాట్లాడటం అని మర్చిపోయాం...
9. ఈ జనరేషన్ కి ఎంటర్టైన్మెంట్ అంటే సాధారణ మనుషులు సెలెబ్రిటీల చేతులో తిట్లు తినటం...
10. మనకు నచ్చిన అందమైన ప్రదేశాలను మొబైల్, కంప్యూటర్ లలో వాల్ పేపర్ లా పెట్టుకుంటాం
కానీ, అక్కడికి వెళ్ళాలని మాత్రం అనుకోము...
11. అసలు లాజిక్ లేని, స్టోరీ లేని సినిమాలను బ్లాక్ బస్టర్ చేస్తాం,
మంచి సినిమాలను చూడను కూడా చూడం...
12. మనకి వందల్లో హీరోలు ఉన్నారు, కానీ నిజ జీవితం హీరోలు ఒకలో ఇద్దరో..
13. మనకు మన హీరో గురించి తెలిసినదాంట్లో ఒక వంతు కూడా మన దేశం గురించి కానీ,
మన గొప్ప నాయకుల గురించి కానీ తెలియదు.
అంతెందుకు...
తల్లితండ్రులకన్నా వారి గురించే ఎక్కువ తెలుసు.....
14. ఈ కాలంలో న్యాయం కోసం పోరాటం అంటే...
కేవలం ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టటం....
మనకు నచ్చినట్టు రాయటం,
తోచింది పెట్టి మర్చిపోవటం...
15. విజయాలను, ఆనందాలను, సంతోషాలని డాబుతో పోల్చటం....
జీవితం ఇంకా ఉంది,
నేర్చుకోవాలిసింది చాలా ఉంది. ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి ఎనో ఉన్నాయి...
కానీ ఇవన్ని కనిపియాలంటే ముందు మనం మన ఫోన్ లో నుంచి
తల పైకి ఎత్తి చూడాలి.
Sekarana
No comments:
Post a Comment