Monday, September 8, 2025

 *@ అమ్మా నాన్నలకో
    సినిమా పాఠం @51
    తేది:07/09/2025
""""""""""""""""""""""""""""""""

అంబుకు ఎనిమిదేళ్లు మధ్యతరగతి కుటుంబమే అయినా
పిల్లాడిని ఏ లోటూ లేకుండా పెంచాలని అమ్మానాన్నలు పెద్ద
ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తారు అక్కడైతే సమాజంలో
పలుకుబడి ఉన్న వారి పిల్లలు అంబుకు స్నేహితులు
అవుతారని, చదువు బాగా వస్తుందని ఆశపడతారు బోలెడంత
ఫీజు కట్టి ఆన్ లైన్ క్లాసులూ చెప్పిస్తారు మంచి లొకాలిటీలో
ప్లాట్ తీసుకుంటారు పిల్లాడు ఇష్టపడ్డాడని ఖరీదైన బొమ్మలు
కొని పెడతారు మరి వీటన్నిటికీ కావాల్సినంత సంపాదనా
ఉండాలిగా, అందుకని ఇద్దరూ పొద్దున్నుంచి రాత్రి వరకు
ఉద్యోగం, వ్యాపారం అంటూ తెగ కష్టపడతారు అంతా అంబు
ఆనందం కోసం, భవిష్యత్తు కోసమే..!
అమ్మానాన్నలిద్దరూ కాసుల వేటలో
రోజంతా బయటే ఉంటే మరి అంబు పరిస్థితి ఏంటి?
ఇంట్లో ఒంటరిగా ఉంటాడు వేరే ఊళ్లో ఎగ్జిబిషన్ లో స్టాల్ పెట్టిన అమ్మకి ఫోన్ చేసి ఎప్పుడొస్తావు...? '
అని అంబు అడిగినప్పుడల్లా తల్లి మనసు తల్లడిల్లిపోయేది కొడుక్కి తను కావాలని తెలుసు కానీ, తనదేమో ఇంటికి రాలేని పరిస్థితి కాస్త ఓపిక పడితే నాలుగు డబ్బులొస్తే
అప్పు తీరుతుందన్న ఆశ కొడుకును బుజ్జగించడానికి పిజ్జా ఆర్డర్ పెడుతుంది మనుషులకు ముఖం వాచిపోయిన
అంబు డెలివరీ బాయ్ ని అన్నా...నాతో కలిసి పిజ్జా
తింటావా?' అని అడుగుతాడు ఓ అప్పులవాణ్ని
తప్పించుకోడానికి తండ్రి అంబును తీసుకుని సొంతూరికి
వెళ్తాడు ఈ లోపల అంబు చేసే సాహసాలతో అది కాస్తా
రోడ్ ట్రిప్ గా మారుతుంది దారిలో తండ్రీకొడుకులు తమ
స్నేహితుల కుటుంబాలతో గడుపుతారు చెరువులో
ఈతకొడుతూ, కొండలూ గుట్టలూ ఎక్కుతూ అంబు చాలా
ఎంజాయ్ చేస్తాడు కొత్త స్నేహితులను
సంపాదించుకుంటాడు వాళ్లందరినీ చూస్తే అంబుకు తనకేంకావాలో, తనేం కోల్పోతున్నాడో అర్థమైంది 'అమ్మానాన్నా
మీరిద్దరూ నాతోనే ఉండాలి ఫ్రెండ్స్ కావాలి
ప్రకృతి
కావాలి, మనం ఆ సిటీకి వెళ్లొద్దు అని మారాం చేస్తాడు
మరి వాళ్లు ఒప్పుకొన్నారా? తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన
తమిళ సినిమా 'పరంతు పో'(ఎగిరి పో) కథ ఇది
అంబు అమ్మానాన్నల పాత్రల్లో మనలో చాలామందిమి
ఉంటాం పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఏకైక
లక్ష్యంతో వాళ్ల వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాం పసివయసు
పిల్లలకు భవిష్యత్తుతో నిమిత్తం లేదు వాళ్లకి అప్పుడు
కావాల్సింది తల్లిదండ్రుల సాహచర్యం స్నేహం, ప్రేమ
వాటిని పుష్కలంగా అందించాలి దగ్గరుండి జీవననైపుణ్యాలు
నేర్పించాలి కాస్త పెద్దవాళై చదువుల్లో పడ్డాక వాళ్లకే మనతో
గడిపే తీరిక ఉండదు అప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పి
బాల్యంలోకి వెళ్లలేం కాబట్టి కనీసం పదేళ్లు నిండేవరకూ
అయినా అమ్మానాన్నలు పిల్లలకు అందుబాటులో ఉండాల్సిన
అవసరాన్ని నొక్కి చెబుతుందీ సినిమా పిల్లలతో సమయం
గడపడాన్నీ బిడ్డలకోసం సంపాదించడాన్నీ బ్యాలన్స్
చేసుకోమంటుంది అంతేకాదు, పెద్దల వ్యసనాలనూ పిల్లలు
గమనిస్తుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది...
మరి మీరేం అంటారు...?*

No comments:

Post a Comment