అమెరికా ఎందుకు భారత్‌పై కోపంగా ఉంది?
అమెరికా నుండి కొన్ని షరతులు ఉన్నాయి, ఆ షరతులు భారత్ నిరాకరించింది. ట్రంప్ పదే పదే ఒత్తిడి తెస్తున్నారు కానీ ఆ షరతులను భారత్ ఎందుకు అంగీకరించడం లేదు?
భారత్ - అమెరికా వాణిజ్య లక్ష్యం:
2030 నాటికి $500 బిలియన్లకు చేరుకోవాలనే కల.
బాగుంది కదూ? కానీ..ఆ కల వెనుక ఒక షరతు ఉంది.
అన్ని పంటలలో జన్యుపరంగా మార్పు చేసిన (GM) విత్తనాలు అమ్ముకునేలా అనుమతి ఇవ్వమని అమెరికా కోరింది. భారత్ నిరాకరించింది. ఎందుకంటే ఇది కేవలం వాణిజ్యం కాదు.
ఇది దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయం.
#GM (#Genetically_Modified) విత్తనాలు అంటే ఏమిటి?
పరిశోధనశాలలో విత్తనాల DNA మార్చి తయారు చేసిన విత్తనాలు. (ఉదా: Bt Cotton). అధిక రోగ నిరోధక శక్తి కలిగి, ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలుగా వీటిని అమ్ముతారు. ఇవి కేవలం విత్తనాలు కాదు. ఈ విత్తనాల నుండి మళ్ళీ విత్తనాలు పుట్టవు, రైతు పంట నుంచి విత్తనాలు తీసుకున్నా, అవి మొలకెత్తవు, అందుకే వీటిని "one-time use only seeds" (ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునే విత్తనాలు) అని కూడా అంటారు. ఒకసారి ఇవి నాటితే తర్వాత ఎల్లప్పుడూ కంపెనీలకి విత్తనాల కోసం డబ్బులు కడుతూ ఉండాలి.రైతులు ప్రతి పంటకి కొత్త విత్తనాలు కొనాలని చట్టం చేసి ఉంటుంది. అందువల్ల ఆ విత్తనాల కంపెనీలకే మార్కెట్ మీద, రైతుల మీద, వ్యవసాయం మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది. మీ పంటలు ఇకపై మీవి కావు. విత్తనాలకు యజమాని ఒక సంస్థ అవుతుంది.
ఎవరా యజమాని?
Monsanto (మాన్సాంటో); ఇప్పుడు దాని పేరు Bayer. 1960లలో, ఈ సంస్థ ప్రపంచానికి గోధుమలను సరఫరా చేసేది.
ఇప్పుడు అది ఏమి ఇస్తోంది?
వ్యాధులను తెచ్చిపెట్టే వ్యవస్థగా మారింది.
ఈ రోజు అమెరికాలో:
* 95% GM మొక్కజొన్న
* 95% GM సోయా
* 90% GM కనోలా
* 90% GM పత్తి
ఇవన్నీ “రౌండప్ రెడీ” పంటలు. కలుపు మొక్కలు చనిపోతాయి, కానీ పంటలు మాత్రం బతుకుతాయి - ఎందుకంటే అవి రసాయనికంగా నిరోధక శక్తిని కలిగి ఉంటాయి.
మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి?
* బేబీ ఫుడ్‌లో
*భోజనంలో
*భూమిలో
1990 నుండి అమెరికాలో:
* ఊబకాయం రేటు రెట్టింపు అయ్యింది
* టీనేజర్లలో డయాబెటిస్ విపరీతంగా పెరిగింది
* పీసీఓఎస్
* సంతానలేమి
* డిప్రెషన్
* క్యాన్సర్
* గుండె జబ్బులు
* కాలేయ జబ్బులు
ఇవన్నీ “యాదృచ్ఛికంగా” జరిగాయా? లేదు.
మరి వీటన్నిటికీ “వైద్యం”?
* మందులు:
o స్టాటిన్స్
o మెట్‌ఫార్మిన్
o యాంటిడిప్రెసెంట్స్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఐలు)
o ఓజెంపిక్
ఇది వైద్యం కాదు - ఇది ఒక సబ్‌స్క్రిప్షన్. మీరు ఆ మందుల కంపెనీలకి చందాదారులు అవుతారు. ఎల్లప్పుడూ మందులపై ఆధారపడి మీరు బతుకుతారు.
బిగ్ ఫుడ్ కంపెనీలు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి.
బిగ్ ఫార్మా కంపెనీలు మిమ్మల్ని బతికిస్తాయి.
బిగ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటికీ మిమ్మల్ని డబ్బు కట్టేలా చేస్తాయి.
ఈ మూడింటిలో ప్రధాన వాటాదారులు ఎవరు?
* వాన్‌గార్డ్
* బ్లాక్‌రాక్
* స్టేట్ స్ట్రీట్
వీరు ఒకే రకమైన వాటిలో పెట్టుబడి పెడతారు.
* ఆహారం
* మందులు
కానీ ఎవరూ ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు?
ఎందుకంటే ఇది “వాణిజ్యం” కాదు. ఇది మన దేశంలో ఉన్న రైతులని బానిసలుగా చేసే చర్య..మన వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బ తీసే అనాగరిక చర్య ..మన దేశీ విత్తనాలని సమూనంగా నాశనం చేసే ప్రణాళిక..ప్రకృతి విరుద్ధమైన చర్య..
ఒకవేళ భారత్ సంతకం చేస్తే ఏం కోల్పోతుంది?
* మన రైతులను
* మన విత్తనాలను
* మన నేల ఆత్మగౌరవాన్ని
* ఇంకా మన భవిష్యత్తును
ఇదంతా ఒక వాణిజ్య ఒప్పందం కోసమా? దీని వెనుక ఎవరు ఉన్నారు?
వ్యవసాయ రంగంలో:
* బేయర్ (మాన్సాంటో)
* ఏడీఎం
* కార్గిల్
ఆహార రంగంలో:
* నెస్లే
* పెప్సికో
* క్రాఫ్ట్
ఫార్మా కంపెనీలు:
* ఫైజర్
* జాన్సన్ & జాన్సన్
* మెర్క్
ఇన్సూరెన్స్ రంగంలో:
* యునైటెడ్‌హెల్త్
మరి వీటన్నిటి వెనుక ఎవరున్నారు?
అదే ఖరీదైన పెట్టుబడిదారులు , డాలర్ల కోసం భయంకరమైన ప్రణాళిక
🏢 Major GM Seed Companies & Owners
1️⃣ Monsanto (USA) → 2018 లో Bayer (Germany) సొంతం చేసుకుంది. (నికర ఆదాయం ₹90,000–1,20,000 కోట్లు)
2️⃣ Syngenta (Switzerland) → ఇప్పుడు ChemChina (China Govt.) చేతిలో ఉంది. (నికర ఆదాయం ₹36,000–60,000 కోట్లు)
3️⃣ Corteva Agriscience (USA) → DuPont & Dow Agro merger నుంచి వచ్చింది. (నికర ఆదాయం ₹54,000–80,000 కోట్లు)
మొట్ట మొదట BT పత్తి విత్తనాలు అమెరికాలో తయారయ్యాయి.
Bt Cotton → “Bacillus thuringiensis” (Bt) అనే బాక్టీరియా నుండి toxin gene తీసుకుని తయారు చేసిన Genetically Modified Cotton.
1996లో మొదట USA లో GM విత్తనాలతో పత్తి పంట పండించారు. 2002లో మన దేశంలోకి ఈ పత్తి విత్తనాలు అనుమతించబడ్డాయి. ఇప్పటికీ మన దేశంలో 95% ఈ విత్తనాలనే వాడుతున్నారు.
🌾 GM పత్తి విత్తనాలు & రైతుల ఆత్మహత్యలు
1️⃣ విదర్భ (మహారాష్ట్ర, 2005–06) – సుమారు 700 రైతుల ఆత్మహత్యలు Bt పత్తి విఫలమై అప్పుల కారణంగా జరిగాయి.
2️⃣ 1999–2014 మధ్య – దేశవ్యాప్తంగా మొత్తం రైతుల ఆత్మహత్యల్లో, సుమారు 22,763 (12.9%) పత్తి రైతులు.
3️⃣ 1995–2013 మధ్య – భారత్‌లో మొత్తం రైతుల ఆత్మహత్యలు సుమారు 2.96 లక్షలు.
4️⃣ మహారాష్ట్ర (1995–2014) – ఒక్క రాష్ట్రంలోనే 60,000 పైగా రైతుల ఆత్మహత్యలు. అందులో 2003–2012లో 33,752 ఆత్మహత్యలు Bt పత్తి విస్తరణ సమయంలోనే జరిగాయి.
5️⃣ 2022లో – వ్యవసాయ రంగంలో 11,290 ఆత్మహత్యలు; అందులో 5,207 పత్తి రైతులు.
6️⃣ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం – Bt పత్తి నేరుగా ఆత్మహత్యలకు కారణం కాదు, కానీ అధిక విత్తన ధరలు, అప్పులు, వర్షాధారిత పంటలు విఫలమవడం ప్రధాన కారణాలు.
GM seeds → India లో ఇప్పటివరకు commercial గా అనుమతించబడింది ఒక్కటే → Bt Cotton. మిగతా పంటలలో (బియ్యం, గోధుమలు, పప్పులు, కూరగాయలు) → ఇంకా GM విత్తనాలు అనుమతించలేదు.
అందుకే మన దేశపు ఈ చర్య అమెరికా వ్యతిరేకం కాదు.
ఇది:
* నేలకు అనుకూలం
* సత్యానికి అనుకూలం
* భవిష్యత్తుకు అనుకూలం
దీనివల్ల “భారత్ బలంగా ఉంది” అని ఎవరైనా అనుకుంటే, అలానే అనుకోనివ్వండి. ఎందుకంటే మనం వారి షరతులపై సంతకం చేస్తే,మనం కేవలం ఒక ఒప్పందాన్ని మాత్రమే కోల్పోము…మన కాళ్ళ కింద ఉన్న భూమిని, మన స్వతంత్రాన్ని కూడా కోల్పోతాము.
GM విత్తనాలు రద్దు చేయమనే మన పర్యావరణవేత్త #వందనా_శివ ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ గారు, విజయ్ రాం గారు సహజ సిద్ధమైన వ్యవసాయం చేయమని, దేశీ విత్తనాలని కాపాడుకోవాలని ఎంతో మంది రైతులని ప్రోత్సహిస్తున్నారు.
మన దేశీ విత్తనాలని అత్యంత భద్రంగా దాచుకుని, ముందు తరాలకి బాధ్యతగా అందించాల్సిన తరుణం ఆసన్నమైంది.
#SaveDesiSeeds
No comments:
Post a Comment