Monday, September 8, 2025

 🔔 *పరిజ్ఞానం* 🔔

*ధర్భల మహిమ.*

*గ్రహణ కాలంలో దర్భలు  ఎందుకు వాడాలి.*

తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

*ఒక విధమైన  గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు*

శ్రీ రాముని  స్పర్శ చేత  పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.

*ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ.   జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది.*

గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి  ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును.

*ధర్భలని సంస్కృతం లో 'అగ్ని గర్భం' అంటారు.*

*కుంభాభిషేకాలలోను యాగశాలలో ని కలశాలలోను‌ ,బంగారు, వెండి తీగలతో పాటుగా* 
ధర్భలను కూడా  తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.
🙏🙏🙏🙏

No comments:

Post a Comment