నొప్పి కలిగినప్పుడల్లా painkillers లాంటివి వాడటం అంత శ్రేయస్కరం కాదు. మనకు ఆయుర్వేదం లో చాలా చెప్పబడ్డాయి. నొప్పి కొద్దిపాటి తేడాలతో వివిధ రూపాలుగా చూపిస్తుంది.
1. వేదన 2. శూల 3. దాహం
4. శోధ 5. అంగమర్ధం .
💁♀️నొప్పి వలన బాధ కాకుండా ఉపయోగాలు కూడా ఉంటాయి. మనకి శరీరంలో ఉన్న స్థితి తెలుస్తుంది, నొప్పి మన శరీరంలో రుగ్మతలను తెలియచేస్తుంది.
👉🏻చాలా మంది నొప్పి తెలియని క్యాన్సర్ , లాంటి వ్యాధులు ప్రమాద స్థాయికి వొచ్చేవరకు గుర్తించలేకపోతున్నాము .
*నొప్పి గురించి మరికొన్ని ఆసక్తి విషయాలు*
నొప్పిని గ్రహించడంలో , వ్యక్తీకరించడంలో వ్యక్తి నుండి వ్యక్తికి వ్యత్యాసం ఉంటుంది.
*లక్షణాలు* :
నొప్పి వివిధ రూపాలలో , వివిధ లక్షణాలతో ఉంటుంది. ఆ లక్షణాలు వివరంగా చెప్పినపుడే సరైన వ్యాధి నిర్ధారణ అవుతుంది.
🤥 నొప్పి అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. వివిధ ప్రాంతాల్లో నరాల సంఖ్య బట్టి నొప్పి స్థాయి ఉంటుంది.
🤜🏻కొన్ని రకాల నొప్పులు వేరే ప్రాంతం వరకు పాకుతుంది. నడుము భాగంలో వెన్నుముక డిస్కులు స్లిప్ అయితే , సయాటికా నరం పై ప్రభావం పడి అది వెళ్ళే ప్రాంతం అంటే తొడలు , కాలి పిక్కలు , కాలి పాదం వరకు ఉంటుంది.
👉🏻 కొన్ని ఆగి ఆగి వొచ్చే నొప్పులు , ఉదాహరణకు పేగుల్లో కలిగే అసౌకర్యం, విషాహారం వలన కలిగే నొప్పులు విస్తుంటాయి.
🙎♀️కొన్ని రకాల నొప్పులు ప్రేరకంగా ఉండి ఇంకో దగ్గర నొప్పికి కారణం అవుతాయి. ఇలా రక రకాల నొప్పులు చాలా ఉన్నాయి.
*నొప్పి - ఆయుర్వేదం*
🌿 నొప్పి నివారణకు ఆయుర్వేద మూలికలు
1. షల్లకి (బోస్వెల్లియా సెరాటా)
•చర్య: శోథ నిరోధక, అనాల్జేసిక్
•చికిత్సలు: ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్,
కీళ్ల నొప్పి.
2. గుగ్గుల్ (కమ్మిఫోరా ముకుల్)
•చర్య: నిర్విషీకరణ, శోథ నిరోధక, లిపిడ్ తగ్గించడం
•చికిత్సలు: ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, ఊబకాయం సంబంధిత నొప్పి.
3. అశ్వగంధ (విథానియా సోమ్నిఫెరా)
•చర్య: నరాల టానిక్, అడాప్టోజెన్, ఒత్తిడి నిరోధక
•చికిత్సలు: కండరాల నొప్పి, ఫైబ్రోమైయాల్జియా, న్యూరల్జియా, అలసట.
4. నిర్గుండి (వైటెక్స్ నెగుండో)
•చర్య: అనాల్జేసిక్, శోథ నిరోధక, వాత సమతుల్యత
•చికిత్సలు: సయాటికా, బెణుకులు, వెన్నునొప్పి, మెడ గట్టిదనం.
5. రాస్నా (ప్లూచియా లాన్సోలాటా)
•చర్య: వాత-శాంతింపజేయడం, శోథ నిరోధకం
•చికిత్సలు: వెన్నునొప్పి, గర్భాశయ స్పాండిలోసిస్, ఘనీభవించిన భుజం.
6. ఎరాండా (రికినస్ కమ్యూనిస్)
•చర్య: వాత-శాంతింపజేయడం, తేలికపాటి భేదిమందు, అనాల్జేసిక్
•చికిత్సలు: సయాటికా, నడుము నొప్పి, మోకాలి కీళ్ల దృఢత్వం.
7. గుడుచి (టినోస్పోరా కార్డిఫోలియా)
•చర్య: ఇమ్యునోమోడ్యులేటర్, శోథ నిరోధకం
•చికిత్సలు: దీర్ఘకాలిక మంట, కీళ్ల నొప్పి, ఆటో ఇమ్యూన్ నొప్పి.
ఇలా దీర్ఘ కాలిక నొప్పులు, పదేపదే నొప్పులకు ఆయుర్వేదం లో చక్కని ఫలితాలు సాధించడం ఉంటుంది. ఆయుర్వేదం లో ప్రకృతి సిద్ధంగా దొరికే సహజమైన pain killers ను ఉపయోగించుకుందాము. స్వంతంగా కాకుండా వైద్యుని పర్యవేక్షణలో ఔషధ సేవనం చేయడం ముఖ్యం. ధన్యవాదాలు 🙏🏻. Dr. Alekhhya.
No comments:
Post a Comment