వేశ్యలను గురించి పచ్చి నిజాలు చెప్పిన వేమన పద్యాలు ||vemana padyalu with bhavam
https://m.youtube.com/watch?v=M4vag6Xrr74
నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం స్త్రీ పురుష అక్రమ సంబంధాలు స్త్రీలు పురుషుల్ని ఎలా లొంగదీసుకుంటారు పురుషుడి సమయాన్ని ధనాన్ని స్త్రీలు ఎలా కొల్లగొడతారు పరస్త్రీకి అలవాటు పడిన మగాడి బుద్ధి ఎలా ఉంటుంది మగడు మన్మధుడు అయినప్పటికీ పరపురుషుడి మోజులో ఉన్న స్త్రీ ఎలా ఉంటుంది వారకాంతలు వారి గుణాలు ఎలాంటివి అలాగే పురుషుడి లక్షణాలు ఎలాంటివి వీటన్నింటిని ఎంతో పరిశీలనాత్మకంగా నిజాయితీగా చెప్పిన పద్యాలు ఇవి ఈ పద్యాలు వినడం ద్వారా మనలో కొంతలో కొంత చలనం స్పృహ కలుగుతుందని ఆశిస్తూ నేటి సమాజానికి ఉపయోగపడే అత్యంత విలువైన పద్యాలు సేకరించి మీతో పంచుకుంటున్నాను ఈ పద్యాలు వేమన గారు 16 17 శతాబ్దాల కాలంలో రాసినప్పటికీ అవి నేటికి నేటి సమాజానికి కూడా అన్వయించుకునేలా ఉన్నాయి అంటే మనిషిలో ఆనాటికి ఈనాటికి ఏ మార్పు రాలేదు అలాగే ఉన్నాడు అని అర్థం పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి మగడు మదనుడైన మబ్బు కాపురమైన సహజమేలమాను జారకాంత పిండి తిన్న చిన్న కుక్క వీతి కాసించదా విశ్వదాభిరామ వినురవేమ మగడు మదనుడైన మబ్బు కాపురమైన సహజమేలమాను జారకాంత పిండి తిన్న కుక్క పీతికాసించద విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ జారకాంత అనే జాతీయాన్ని వాడారు పరాయి పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకునే స్త్రీ అని అర్థం పరాయి వాడికి అలవాటు పడిన స్త్రీ అని అర్థం మగడు మదనుడైన అంటే భర్త మదనుడు లాంటి గొప్ప అందగాడు అయినప్పటికీ మబ్బు కాపురమైన అంటే ఎందుకు పనికిరాని మబ్బు పట్టిన వ్యర్థమైన కాపురం అయినప్పటికీ సహజమేలమాను జారకాంత జారకాంత అంటే చెప్పుకున్నాం కదా పరాయి పురుషుడి మోజులో ఉన్నటువంటి స్త్రీ సహజమేలమాను అంటే తన సహజ గుణం ఏంటిది పరాయి పురుషున్ని ఆకర్షించడం పరాయి పురుషుడు తో తిరగడం మొగడు ఎంత మంచివాడైనా మంచివాడు కాకున్నా ఎంత అందగాడైనా అందగాడు కాకున్నా పరాయి పురుషులతో వెళ్ళడం అలాగే వెళ్తుంది ఎట్లా అంటే పిండి తిన్న కుక్క పీతి కాసించదా పిండి మంచి పిండి పదార్థాలు మనము కుక్కకు పెట్టి తినిపిస్తాం కదా అట్లాగే అది కేవలం పిండి పదార్థమే తింటుందా తినదు కుక్క సహజ గుణం ఏంటి నానా రకాల వ్యర్థ పదార్థం పీతి అనే మాటకు అర్థం ఏంటంటే వ్యర్థము విసర్జించినటువంటి వంటి పదార్థము అలాంటి వాటిని కుక్క తినకుండా ఊరుకుంటుందా చెప్పండి అని ఎంతో అద్భుతంగా ఈ పద్యం ద్వారా జారకాంత యొక్క లక్షణాన్ని వేమన గారు వర్ణించారు జారకాంత పరాయి పురుషుడి మోజులో ఉన్నటువంటి స్త్రీ యొక్క లక్షణాన్ని అద్భుతంగా వర్ణించారు ఈ పద్యంలో ఇలాంటి అద్భుతమైన పద్యం మరొకటి తీసుకుందాం కునుకు చనులు చూపి గొబ్బున కరిగించి చేతి కాసులెల్ల జల్ల చేయు ఎలక చేసి కొందురల వారకాంతలు విశ్వదాభిరామ వినురవేమ కునుకు చనులు చూపి గొబ్బున కరిగించి చేతి కాసులెల్ల చెల్లజేయు ఎలక చేసి కొందురల వారకాంతలు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ గొబ్బున కరిగించి అనే జాతీయాన్ని వాడారు గొబ్బున కరిగించి అంటే టక్కుమని కరిగించి చప్పున కరిగించి వెంటనే కరిగించి అని అర్థం ఐస్ చేసింది అంటాం చూడండి మనం ఇప్పుడు వాడుక భాషలో ఐస్ చేయడం ఐస్ చేయడం అంటే ఏంటి వెంటనే కరిగించడం ఐస్ ఇట్లా చేతిలో పట్టుకుంటే చేతి వేడివికి వెంటనే కరిగిపోతుంది అలాగా ఉలుకు చనులు చూపి అంటే సొగసైన అందమైన చనులు అంటే వక్షోజాలని చూపించి గొబ్బున కరిగించింది టక్ అని కరిగిస్తారట మగవారిని చేతి కాసులెల్ల చెల్లజేయు చెల్లజేయు అంటే వడగొట్టడం ఖర్చు చేయడం చేతి కాసులెల్ల కాసులు అంటే ఏంటి డబ్బు చేతి కాసులు అంటే చేతిలో ఉన్నటువంటి డబ్బుల్ని చెల్ల చేస్తారు ఖర్చు చేయిస్తారు ఎలక చేసి కొందురల వారకాంతలు ఇక్కడ ఎలక చేసి కొందురు అనే మాటకి ఈ సందర్భానికి తగిన అర్థం ఏంటంటే డబ్బులు చెల్ల చేసి అంటే కాజేసి వారి ఇల్లు నింపుకుంటారు అలక చేసుకుంటారు అంటే పొట్ట నింపుకుంటారు మూట కట్టుకుంటారు అని అర్థం అందమైనటువంటి వక్షచాలను చూపి గొబ్బున కరిగించి మగవారిని టక్కుమని కరిగించి చేతి కాసులెల్ల చెలజేయు చేతిలో ఉన్నటువంటి డబ్బుల్ని కాజేస్తారు చెల్ల చేస్తారు ఎలక చేసి కొందురు ఒక పక్షి గూడును కట్టుకున్నట్టుగా మన చేతి డబ్బుల్ని వారు దొంగిలించి వారు మూట కట్టుకుంటారు వారు డబ్బును సంపాదిస్తారు వారకాంతలు అంటే ఎవరు ఇక్కడ వేశ్యలు వేశ్యల యొక్క లక్షణాన్ని ఈ పద్యంలో వేమన గారు ఎంతో అందంగా తెలియపరిచారు వారకాంతలు వేశ్యలు వారి యొక్క అంగ సౌష్టవాన్ని చూపించి మగవారిని లొంగ తీసుకొని లోబరుచుకొని వారి చేతిలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కాజేసి వారి ఇల్లు నింపుకుంటారు అని ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యాన్ని స్వీకరిద్దాం వారకాంతలెల్ల వలపించి వత్తురు ప్రొద్దులెల్ల దొంగ పుచ్చు కొరకు మాట కరము చేసి మగలెల్ల వత్తురు విశ్వదాభిరామ వినురవేమ వారకాంతలెల్ల వలపించి వత్తురు ప్రొద్దులెల్ల దొంగ పుచ్చు కొరకు మాటకరము చేసి మగలెల్ల వత్తురు విశ్వదాభిరామ వినురవేమ వారకాంతులు అంటే పై పద్యంలో మనం విన్నాం కదా వారకాంతులు అంటే వేశ్యలు పడుపు వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు వలపించి వత్తులు వలపించి రావడం కోరి వస్తారు పొద్దునెల్ల దొంగ పుచ్చు కొరకు అంటే రోజును మొత్తం వెలదీయడానికి మాట కరము చేసి మగలిల్ల వత్తురు మాట కరము అనే జాతీయాన్ని ఇక్కడ వాడారు దీని అర్థం ఏంటంటే మాట నిలబెట్టుకోవడం అని ఈ పదబంధం సాధారణంగా ఒక వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నప్పుడు ఉపయోగిస్తారు కరము అంటే చేయి చేయి కలిపి మాట ఇవ్వడం మాట కరము చేయడం వాగ్దానం చేయడం అంటే ప్రామిస్ చేయడం అన్నట్టు వారకాంతలు మగవారి యొక్క రోజును హరించడానికి వారి సమయాన్ని దొంగిలించడానికి వలపించి వస్తారు కోరి వస్తారు మగవారి దగ్గరికి వారి మాయలో పడి మగాడు కూడా మాట ఇచ్చి వస్తాడు ప్రామిస్ చేసి మరి వస్తాడు ఇలాంటి మరో అందమైన పద్యాన్ని స్వీకరిద్దాం పడయ నేనేర్చులంజ బంగారమాసించు మాటలకు వలచుట మహిమ గాదే కొరక నేర్చినదియు గోకితే చెప్పున విశ్వదాభిరామ వినురవేమ పడయనే నేర్చు బంగారమాసించు మాటలకు వలచుట మహిమ గాదే కొరక నేర్చినదియు గోకితే చెప్పున విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ పడయ నేనేర్చు అనే మాటను వాడారు ఏదైనా పనిని బాగా అలవాటు చేసుకోవడం నైపుణ్యాన్ని సాధించడం అని అర్థం ఇది తెలుగులో జాతీయం పడయ నేర్చు బంగారం ఆశించు అంటే పడుపు వృత్తి చేసేటటువంటి స్త్రీలు డబ్బులకి పడక సుఖాన్ని అందించేటటువంటి స్త్రీలు వాళ్ళు పడయ నేనేర్చి అంటే నైపుణ్యాన్ని సాధించి ఉంటారు ఎట్లా అంటే బంగారాన్ని ఆశించి ఎవరి దగ్గర నుంచి విటుల నుంచి విటులు అంటే ఎవరు మగవారి దగ్గర నుంచి బంగారాన్ని ఎట్లా అయితే కాజేయాలి వీళ్ళ దగ్గర నుంచి అనే నైపుణ్యము లంజలకు ఉంటుంది మాటలకు వలచుట మహిమ గాదే వారి మాటల మాయలో పడిపోవడము మహిమే కదా కొరక నేర్చినదియు గోకితే చెప్పున ఇంకా కొరకడం నేర్చుకున్న ఆవిడకి గోకితే ఏమైనా చెబుతుందా చెప్పండి చెప్పదు కదా ఆవిడ కొరకడం నేర్చుకుంది అంటే ఇతని దగ్గర నుంచి శాంతం నాకేసి శాంతం లాక్కోవడం అనే నైపుణ్యాన్ని ఆవిడ కలిగి ఉంది ఇట్లా వారకాంతలు వేశ్యలు డబ్బులకు పడక సుఖాన్ని అందించేటటువంటి పరాయి స్త్రీలు మగాడి దగ్గర ఉన్నటువంటి డబ్బుని బంగారాన్ని లాక్కొని వారిని సర్వనాశనం చేస్తారు అనే భావాన్ని ఈ పద్యం ద్వారా వేమన గారు వ్యక్తపరిచారు ఇలాంటి మరో అద్భుతమైన పద్యాన్ని స్వీకరిద్దాం కడుపు నిండ తవుడు గంపలో పెట్టక చన్ను ముట్టనీక తన్ను పశువులు వారకాంతలెల్ల వలతురాయురక విశ్వదాభిరామ వినురవేమ కడుపు నిండ తవుడు గంపలో పెట్టక చన్ను ముట్టనేక తన్ను పశువులు వాలకాంతలెల్ల వలతురాయురక విశ్వదాభిరామ వినురవేమ తవుడు అంటే పశువులకి దానగా పెట్టేటటువంటి పదార్థం దాన్ని గంపలో కడుపు నిండా తినేలాగా పశువుల ముందట పెడితే తప్ప తన్ను ముట్టనీయక పశువుల యొక్క పొదుగును అవి ముట్టనివ్వవు తన్ను పశువులు తినే పదార్థాన్ని వాటికి ఇష్టమైనటువంటి తవుడును ఒక గంపలో తన తినేలాగా పెట్టకపోతే పశువుల పొదుగును ముట్టనీయవు తంతాయి పశువులే ఏదైనా తినడానికి పెట్టకపోతే పాలిండ్లను ముట్టనీయవు మరి ఈ స్త్రీలు వారకాంతలు అంటే వేశ్యలు వారిని ఊరికే ముట్టనిస్తారా చెప్పండి ఎంత అందంగా రాశారు ఎంత అద్భుతమైనటువంటి వర్ణన తప్పకుండా మనం ఒప్పుకొని తీరాలి ఎంతో అందమైనటువంటి వర్ణన కడుపు నిండా తినేలాగా తవుడు పెడితే తప్ప పాలు పితకనియవు పశువులు కాళ్ళతో తంతాయి అలాంటిది ఏమీ ఇవ్వకుండా నిన్ను ఎట్లా ముట్టుకొనిస్తుంది వారకాంత ఆవిడ చేసే పనే డబ్బులకు ఆశపడి ధనానికి ఆశపడి వారకాంత అంటేనే వేశ్యలు పడుపు వృత్తిని డబ్బులకు ఆశపడి చేసేవారు ఇలాంటి బ్రహ్మాండమైన మరో పద్యాన్ని స్వీకరిద్దాం చక్కర కలుపుకు తింటే ముక్కిన తవుడైన లెస్స మోహము గలచో నక్కరవు దాసియైనను మక్కువతో దివ్య భామ మణియగు వేమ ఇది కంద పద్యం వేమన గారి సహజమైనటువంటి తేటగీతి పద్యం కాదు ఇది కొంచెం కఠినమైనటువంటి కంద పద్యం చక్కర కలుపుకు తింటే ముక్కిన తవుడైన లెస్స మోహము గలచో నక్కరవు దాసియైనను మక్కువతో దివ్య భామ మనియగు వేమ చక్కెర కలుపుకొని తింటే ముక్కిపోయిన తవుడు మనం పశువులకు పెడతాం చూడండి వడ్ల గింజల్ని ఆడించినప్పుడు ఆ బియ్యపు గింజల పైన ఉన్నటువంటి పొట్టు ఒకవైపు బియ్యపు గింజలు ఒకవైపు పడ్డ తర్వాత కొంచెం పిండి పదార్థం అప్పుడు వస్తుంది దాన్ని తవుడు అంటాం చక్కెర కలుపుకు తింటే ముక్కిపోయినటువంటి తవుడు ముక్కబట్టినటువంటి తవుడు కూడా ఎంతో కమ్మగా వస్తుంది మోహము గలచో నక్కరవు దాసియైనను మక్కువతో దివ్య భామామనియగు ప్రేమ అంటారు అంటే మోహిస్తే ఆలపిస్తే ఆవిడ ఇష్టమైతే డబ్బులకి పని చేసేటటువంటి పనివారైనప్పటికీ దివ్య భామామణి లాగా కనిపిస్తుంది ఆవిడ పైన మోహం కలిగితే ఆవిడ ఎలాంటిదైనప్పటికీ ఎంతో దివ్య భామామణి లాగా కనిపిస్తుంది ఎట్లా అంటే ముక్కిపోయిన తవుడైనా చక్కెర కలుపుకొని తింటే కమ్మగా వస్తుంది కదా అట్లా ఎంతో అందమైనటువంటి పద్యం ఈ పద్యం వేమన గారు రాసిందా రాయలేదా అనే సంశయాన్ని మనం పక్కన పెడితే పద్యం మాత్రం మహా అద్భుతంగా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి పద్యాలను సేకరించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యస్మి శుభం భుయాత్ వినాగ్రాజ్ షో కి స్వాగతం సుస్వాగతం
No comments:
Post a Comment