మదాలస
రాణి మదాలస తన పుత్రులకు చిన్నతనంలోనే బ్రహ్మజ్ఞానం నేర్పింది. పిల్లలకు జోల పాటలతోనే జీవిత పరమార్ధం బోధించిన మాతృమూర్తి మదాలస. అందులోని ఒక పాట ఇది. మార్కండేయ పురాణం నుండి గ్రహింపబడింది. ఇందులో సారం ఏమిటంటే
(అయితే వీటి గురించి మన పాఠ్య పుస్తకాలలో వుండదు..
కాని విదేశీయులు మాత్రం ఎంతో రమ్యంగా పాడుతూ వీటి సారం తెలుసుకుంటున్నారు..
అందులో భాగంగానే ఈ వీడియోను పోస్ట్ చేయటం జరుగుతుంది.
మన తెలుగు వారిలో ఎవరూ ఇంతవరకు వీటిగురించిన గానం చేసినట్లు లేదు)
ఓ పుత్రా..
నువ్వు పవిత్రుడవు, స్వచ్ఛమైనవాడవు..
నీకు ఈ భౌతిక శరీరం అన్నది శాస్వతం కాదు.
దీనికి నువ్వు అంటి లేవు.
సంసార బంధములు ఏవి కూడా శాస్వతములు కావు.
ఇవన్నీ మాయాకల్పితములే నాయనా…
ఓ పుత్రా..
ఎందుకు ఏడుస్తున్నావు
నువ్వు ఎంతో స్వచ్ఛమైనవాడివి
నువ్వు సాధించిన ఘనతలన్నీ నీవి కావు
నీ చేత చేయింపడిన కార్యములకు కర్త వేరొకరు వున్నాడు
ఓ పుత్రా..
ఈ శరీరానికి నువ్వు గాని
నిన్ను ఈ శరీరంగాని అంటిలేవు
నువ్వు ఎందకు ఏడుస్తున్నావు నాన్నా..
ఇదిగో ఈ సృష్టికి కారకుడయినవాడు ఎన్నడూ ఏడ్వడు…
అతడు ప్రశాంత చిత్తుడు
నీకున్న ప్రత్యేకతలు, లక్షణాలు అన్నీ కూడా ఇంద్రియగోచరములే… కాని ఇంద్రియ గోచరము కానిది ఒకటి వున్నది.
ఓ పుత్రా..
మనిషి ఉత్తమ గతులు పొందడానికి కేవలం ఆహారం, నీరు సరిపోవు.. ఇతర శక్తి యుక్తులను కూడా అలవర్చుకోవాలి..
అవి నిన్ను తగ్గించేవి కావు.. నిన్ను పెంచేవి అయివుండాలి.
ఓ పుత్రా..
ఇదిగో ఈ శరీరం కాదు శాస్వతం..
ఇది నిన్ను అంటిపెట్టుకుని వుందనే భ్రమలో
దానికోసం కృంగిపోకు
ఓ సుపుత్రా..
తండ్రి, తల్లి, కొడకు, భార్య, నేను ఇవన్నీ వేరు వేరు కాదు..
అంతా ఒకటే వేరుగా గోచరిస్తుంది.
జ్ఞానికి సుఖము, దుఃఖముల యందు సమస్థితి వుండి వాటిమయందు ప్రతిస్పందన కలగనివ్వడు.
ఇలా సాగిపోతుంది ఆ తల్లి లాలన పాట లోని అంతరార్ధం..
ఇక మన పూర్వ చరిత్రలో ఇటువంటి అద్భుత విశేషాలు గురించి వ్యాఖ్యానం దిగువున చదువుతూ కొనసాగించండి.
సవివరంగా వివరించడం జరిగింది.
మదాలస చరిత్ర
"విశ్వావసుడు"అను గంధర్వరాజు కూతురు"మదాలస". ఆమె మిక్కిలి సౌందర్యవతి."పాతాళకేతుడు"అనే రాక్షసుడు ఆమెను ఎత్తుకుపోయి ఒక గుహలో దాస్తాడు.మదాలస అది భరించలేక ప్రాణత్యాగానికి ప్రయత్నిస్తుంది.అంతలో సురభి దేవత చెపుతుంది...రాక్షసుడు నీకు భర్త కాడు,ఆ రాక్షసుని చంపటానికి వచ్చిన రాకుమారుడు నీకు భర్త అవుతాడని. ఆమాటలకు సంతోషించి ధైర్యం తెచ్చుకొని గుహలో కాలం
గడుపుతూవుంది.కొంత కాలానికి"పాతాళకేతుని" చంపటానికి "కువలయాశ్వుడు" (రుతధ్వజుడు)అను రాజు రాక్షసుని వెంటాడుతూ వస్తాడు.రాక్షసుడు వరాహ రూపంలో గుహలోకి ప్రవేసిస్తాడు.రాజుకూడా తరుముతూ ఆ గుహలోకి వస్తాడు.అక్కడ "మదాలస"ను,ఆమె చెలికత్తె "కుండల"ను చూసి విస్మయం చెందుతాడు."మదాలస""కువలయాశ్వుడు" ప్రేమించుకుంటారు.రాక్షసుని చంపి "మదాలస"ను వివాహం చెసుకొని విజయనగర రాజ్యం తీసుకొని వెళ్ళి సుఖ జీవనం చేస్తారు.
కొంతకాలానికి "కువలయాశ్వుడు" మారువేషంలో దేశసంచారం చేస్తున్న సమయంలో రాక్షసుని ఆత్మ మునిరూపంలో వచ్చి రాజు చనిపోయాడని,రాజు కంఠమాలను "మదాలస"కు ఇస్తాడు.కంఠమాలను గుర్తించి ముని మాటలు నమ్మి "మదాలస"ప్రాణం విడుస్తుంది.కొన్ని రోజులకు రాజు మందిరానికి వచ్చి "మదాలస"మరణించిందని తెలిసి విరాగిలా మారిపోతాడు.రాజు దుఃఖం పోగొట్టుటకై "యశ్వతరుడు"అనే పేరుగల నాగేంద్రుడు తపస్సు చేసి "మదాలస"ను పొంది "కువలయాశ్వ"రాజుకు ఆమెను అప్పగిస్తాడు. రాజు "మదాలసతో సహా చక్కని రాజ్యపాలన చేస్తాడు. వీరికి "విక్రాంతుడు","సుబాహువు","శతుమర్ధనుడు","అలర్కుడు"అనే నలుగురు కుమారులు జన్మించారు."మదాలస"కుమారులకు ధర్మములను, బ్రహ్మజ్ఞానమును బోధించి మంచి మార్గములో వారిని పెంచింది.

No comments:
Post a Comment