ఈ క్రింది ప్రశ్నలు చాలా మందికి కలగడం చాలా సహజం. వారి సందేహ నివృత్తి కోసం "నేను" చేసిన ప్రయత్నం:-
✳ ఆత్మ అనగా నేమి?
శక్తి (Energy), చైతన్యము(Consciousnes), జ్ఞానం(Knowledge) -- ఈ మూడింటి యొక్క కలయిక రూపమే ఆత్మ (Self) అంటే.
✳ జీవాత్మ అనగా నేమి?
భౌతిక దేహంలో ప్రవేశించిన ఆత్మ నే 'జీవాత్మ' అంటారు.
✳ పూర్ణాత్మ :-
పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే 'పూర్ణాత్మ' అంటే. పరమ పూర్ణత అనగా చేపట్టిన ప్రతి పనిలో పూర్ణంగా జీవిస్తూ, జన్మ ప్రణాళికను సంపూర్ణంగా నిర్వహిస్తూ, దుఃఖరాహిత్యంగా సదా వెలుగుతున్న స్థితి.
✳ అంశాత్మ:-
పరిపూర్ణతను సిద్ధించుకొని తాను స్వయంగా జనన-మరణ చక్రంలోంచి విడివడిన పూర్ణాత్మ, తనలోంచి 'నూతన ఆత్మలను' సృష్టించును. ఆ ఆత్మలనే 'అంశాత్మ'లంటారు. ఈ అంశాత్మలు తిరిగి జనన-మరణ చక్రంలో ప్రవేశిస్తాయి.
✳ పరమాత్మ :-
విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తినే 'పరమాత్మ' అంటారు.(Controller of the whole Cosmos.)
✳ సృష్టి కర్త:-
నూతన లోకాలను గాని, నూతన అంశాత్మలను గాని సృష్టించగల సమర్ధుడే సృష్టి కర్త.
✳ దేవుడు:-
ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మన లాంటి మనుషులు మాత్రమే. (పూర్ణాత్మ)
పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే దేవుడంటే.
✳ సంభావ్యతా ఆత్మలు :-
ప్రతి అంశాత్మలోంచి వెలువడిన వివిధ గాఢ కోరికలు తాముగా జీవాన్ని సంతరించుకొని వివిధ సమాంతరలోకాలలో తమ తమ స్వంత జీవితాలను జీవిస్తూ ఉంటాయి. అవే మన సంభావ్యత ఆత్మలు.(Probable selves)
"నేను"
➡ చదువుకుంటే
➡ చదువుకోకపోతే
➡ ఉద్యోగం వస్తే
➡ ఉద్యోగం రాకపోతే
పైన ఉన్న నేను అసలు 'నేను' (నేను= ఆత్మ).
కింద ఉన్న గీతలు నా కోరికలు., ఒక్కో కోరిక తీరుతూ ఉంటే ఆ యొక్క 'జ్ఞానం' కలుగుతూ ఉంటుంది.
👉 ఈ సంబంధం వల్ల మనం ఈ లోకం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాం.
వివరణ :- చదువుకుంటే నేను ఎలా ఉంటాను? ఉద్యోగం వస్తే ఎలా ఉంటాను? అని జన్మలు తీసుకోవడం. (ఇవి
సమాంతర లోకాలలో జరుగును)
✳ సమాంతర ఆత్మలు :-
ఒకే పూర్ణాత్మలోంచి ఉద్భవించిన వివిధ అంశాత్మలే సమాంతర ఆత్మలు. (Parallel selves or Alternative selves)
"నేను"
➡ ఎన్నో జన్మల నేను.
➡ గత జన్మల నేను.
➡ ప్రస్తుత నేను.
➡ నా కంటే తక్కువ వయస్సు ఉన్న నేను.
పైన ఉన్న నేను అసలు నేను, ఈ నేను అనేది కారణ లోకంలో ఉన్న ఒకానొక పూర్ణాత్మ.
కింద గీతలు అనేవి సమాంతర ఆత్మలు.
👉 ఈ సంబంధం వల్ల "మనం ఎల్లప్పుడూ అనంతంగానే జీవిస్తున్నాం " అని తెలుసుకొంటాము.
వివరణ :- నేను అనేది ఆత్మ. ఈ ఆత్మ అనేది ఎన్నో జన్మలు తీసుకుంటుంది.
ఉదా: రాజుగా ఒక జన్మ, అదే ఆత్మ సాధారణ స్త్రీగా మరో జన్మ తీసుకుంటే., రెండు జన్మలలోనూ ఒకే ఆత్మ కావున ఆ రెండు సమాంతర ఆత్మలవుతాయి.
✳ సృష్టి మనం కూడా చేయవచ్చా?
తప్పకుండా. ఒక ఉన్నత స్థాయికి చేరిన తర్వాత మనం కూడా ఒక సృష్టికర్త అవ్వవచ్చు.
✳ మనం ఇక్కడకు ఎందుకు వచ్చాము?
👉 సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి
👉 మన ఇతర జన్మల గురించి తెలుసుకోవడానికి
👉 మన చుట్టూ ఉండే మనుషుల నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి.
మనం ఇక్కడకు వచ్చింది 'సున్న' మార్కులతో వచ్చి 'వంద' మార్కులతో పై తరగతికి వెళ్లడానికి.
✳ మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి?
ఈ భౌతిక శరీరంతో తెలుసుకోబడే భౌతిక విశ్వం (Universe) ఒకానొక లోకం మాత్రమే. ఇలాంటి లోకాలు పూర్ణ సృష్టిలో (Cosmos) కోటానుకోట్లు ఉన్నాయి. ప్రతి లోకము ఒకానొక పౌనఃపున్యత (Frequency) తో కూడిన ప్రకంపనస్థితిలో ఉంటుంది.
✳ సమాంతర లోకాలు :-
భూలోకం లాగానే ఉండి దానికి అత్యంత సమీపంలో కొద్ది పౌనఃపున్యాల తేడాతోనే
ఉండే లోకాలే సమాంతర లోకాలు.
సమాంతర ఆత్మలు కానీ,సంభావ్యత ఆత్మలు కానీ వీటిల్లోనే జీవిస్తూ వుంటాయి.
✳ ఆ లోకాలలో కూడా జీవం ఉంటుందా?
ఉంటుంది., కానీ మనలా ఉండదు. మన మానవ కంటితో చూడలేము. ఎందుకంటే అక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రతి లోకాన్ని సృష్టికర్త, ఆయనకు నచ్చిన విధంగా సృష్టిస్తారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు.

No comments:
Post a Comment