Tuesday, January 28, 2020

మనసులో ఎంత బాధ వున్నా బయటికి తెలియనివ్వకూడదు

"🤔 మనసులో ఎంత బాధ వున్నా బయటికి తెలియనివ్వకూడదు..
ఏమీ కానట్లు ఏదీ జరగనట్లుండాలి ఆప్పుడే మనిషి బలవంతుడవుతాడు..
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టమో..
సహనాన్ని అలవరచుకోవడం కూడా అంతే కష్టము..! కానీ.. బ్రతుకుబాటలో విజయం సాధించాలంటే పొరాటం తప్పదు. కాలచక్రంలో వచ్చే పెనుమార్పులను జీర్ణించుకునే మనస్తత్త్వాన్ని అలవరచుకోవాలి
అతి సంతోషం అనర్దం.
అతి దుఃఖం అనర్ధదాయకం..
ఈ రోజు ఎలా గడుస్తుందో అన్న ఆలోచన మనిషిని నిలువునా కృంగదీస్తుంది..
సరైన ఆలోచన జీవన పధాన్నే మార్చివేస్తుంది..
మనసంతా దిగులుతో నిండినా..అశావహ దృక్పధాన్ని అవలంబించాలి...
నిరాశ, నిస్పృహలు గుండె లోతుల్లోకి దరిచేరనివ్వకూడదు. ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి..
ధైర్యాన్నెప్పుడూ కోల్పోకూడదు.
జీవితం మీద విశ్వాసం కోల్పోతున్నప్పుడు గుండెను సవరదీసి ధైర్యం చిక్కబట్టుకోవాలి
నిరాశ, నిస్పృహలతో జీవితంతో పోరాటం చేస్తున్నవారికి ఇదే నా స్ఫూర్తి ..

ఒంటరి జీవితంతో ఎంతకాలం పోరాడుతావు..?!
అలుపెరుగని పయనంలో తెలియని మజిలీలు ఎన్నో ! ఊహకందని అనుభవాల సారమే జీవితం.. 👍

No comments:

Post a Comment