Saturday, March 6, 2021

సంతోషంగా ఉండడం

సంతోషంగా ఉండడం
-------☀మోహన్ -------

జీవితం అంటే కష్ట నష్టాలు,
సుఖ దుఃఖాలు,
మంచి చెడులు,
ఆనంద విషాదాల సమ్మేళనమనే విషయం అర్థం చేసుకోవాలి.

కష్టాలు ఎదురైనప్పుడు
వాటిని అధిగమించాలి.

దానికి ఎవరినో కారకులను
చేసి నిందించకూడదు.

ఆనందం అనేది నిర్వచనానికి
అందని అనుభవం.

అదొక మానసిక స్థితి.

దీన్ని నిర్మించుకునేందుకు కుటుంబ వాతావరణం,
అలవాట్లు,
విద్య, అనుభవాలు సోపానాలవుతాయి.

ఆనందానికి, సంపదకు సంబంధం లేదు.

ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదు.

ఎవరికి వారే సృష్టించుకోవాలి.

తమ స్థాయి తెలుసుకుని జీవించేవారికి ఆనందం కొదవ ఉండదు.

తమ కోసం తాము బతకాలి.

ఇతరులను మెప్పించేందుకు కాదని గుర్తుంచుకోవాలి.

ఒకరికి మరొకరికి పోలిక ఉండదు.

ఇతరులను చూసి అనుకరించడం మంచిది కాదు.

ఇది కుటుంబంలో పెను సమస్యలను సృష్టిస్తుంది.

సంతోషం కల్గినా,
విచారం వచ్చినా,

భావోద్రేకాలు అదుపులో ఉంచుకోవాలి.

లేకపోతే కొత్త నష్టాలు వచ్చి మీ సంతోషాన్ని పాడుచేస్తాయి.

మనం చేయగలిగిన పనులు, మార్చగలిగిన పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచించి కృషి చేయాలి.

సంబంధం లేని విషయాలను పట్టించుకోకూడదు.

ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని స్పందించకూడదు.

మనమే కాకుండా మన చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉండేటట్లు చేయగల్గాలి.

ఎవరినీ బాధించేలా మాట్లాడకూడదు.

తప్పు జరుగుతుంటే సున్నితంగా మీ ప్రతిఘటన తెలియజేయాలి.

జీవితం అనేది ఒక బహుమతి.

దాన్ని అనుభవించాలి.

ఆనందించాలి.

చలాకీగా గడపాలి.

లక్ష్యాలు సాధించాలి.

ఆహ్లాదకరంగా పనిచేయాలి గానీ,.. బాధపడుతూ శ్రమించకూడదు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment