🍂 మనిషికి గౌరవాన్ని ఇచ్చే అయిదు 'వ' కారాలు🍂
మనిషికి గౌరవాన్ని, ప్రతిష్ఠను కలిగించే అయిదు వ కారాలు ఏమిటో ఈ శ్లోకం వివరిస్తుంది.
వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ|
వకారై పంచభిర్లుప్తో నరో నాప్నోతి గౌరవమ్||
వస్త్రం, వపువు (శరీరం), వాక్కు, విద్య, వినయం ఇవే ఆ అయిదు వకారాలు. ఇవి లేకపోతే ఎవరూ గౌరవాన్ని పొందలేరు.
మొదట మనం కట్టుకునే బట్ట శుభ్రంగా, మనకే గాక ఎదుటివాడి కంటికి కూడా ఇంపైనదిగా ఉండాలి. మనుషుల్ని భయపెట్టేవి, జుగుప్స కలిగించేవి, దేహాన్ని కప్పలేనివి, చెడు చూపులు పడటానికి వీలు కల్పించేవి అయిన వస్త్రాలు ధరించకూడదు. మనం కట్టుకునే వస్త్రమే మనకు విలువ తెచ్చిపెట్టేదిగా ఉండాలి.
మన దేహాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కేవలం మేకప్ తోనే గాకుండా, సహజంగా కూడా మన ముఖం కాంతివంతంగా శోభాయమానంగా ఉండాలి. మనం నడిచే నడక ఎబ్బెట్టుగా ఉండరాదు.
మన మాట హితమైనది, ప్రియమైనది,మధురమైనది కావాలి. వివేకాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చే విద్యనే నేర్వాలి. విద్య వినయాన్ని, పెద్దలపట్ల, సాటివారి పట్ల గౌరవ మర్యాదలను కలిగించేదిగా ఉండాలి.
మనిషికి వినయమే భూషణం. సౌశీల్యమే మనిషికి సౌందర్యాన్నిస్తుంది. ఇన్ని గుణాలు కలిగి, గౌరవం పొందినవాడు, ఏ చిన్న చెడ్డ పని చేసినా కీర్తి, పరువు పోగొట్టుకొని మరణంకంటె అధిక దుఃఖాన్ని అనుభవిస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా హెచ్చరిస్తున్నాడు.
సంభావితస్యచాకీర్తిః మరణాదతి రిచ్యతే...
గౌరవం తెచ్చుకోవడమే కాదు నిలుపుకోవడం కూడా ముఖ్యమే.
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍃🍂
Source - Whatsapp Message

No comments:
Post a Comment