Monday, March 29, 2021

కాలం...

మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేదాక, అతడి జీవితంలో అవిభాజ్యమై ఉండేది కాలం. పుట్టినప్పుడు ఉన్నకాలం పెరుగుతున్నప్పుడు మారిపోతుంది. పెరిగినంత కాలం ఉండే కాలం తరిగిపోతున్నప్పుడు మాయమైపోతుంది. లిప్తలిప్తకు జారిపోయే కాలం పాదరసంలాంటిది. పట్టుకుంటే దొరకదు అది నిరంతరం కరిగిపోతూనే ఉంటుంది. అనంతమైన కాలవాహినిలో మానవుడి బాల్య, యౌవన, వార్ధక్యాలు చిన్నబిందువులవలె కనిపిస్తాయి. నూరేళ్ల జీవితం వేగంగా .గడిచిపోతుంది

కాలం పక్షపాతి కాదు. ఒకరి మీద అవ్యాజమైన ప్రేమను చూపదు. మరొకరిమీద అకారణమైన ద్వేషాన్ని కనబరచదు. రాజు, పేద, పండితుడు, పామరుడు ఎవరైనా ఒకటే. ఎవరి మీదైనా సమదృష్ట. బాల్య, కౌమార, యౌవన వృద్ధాప్యాలను అందరికీ వర్తింపజేస్తుంది. అలాగే మరణాన్నీ! మరిన్ని ప్రాణులకు ఊపిరిపోస్తుంది. రాగద్వేషాలకతీతంగా ఉంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటుంది. ఎవరికైనా అవే గంటలు, అవే నిమిషాలు. సరైన యోచనతో విభాగించుకుని మనకు, ఇతరులకు ఎంతెంత వినియోగించుకోవాలో నిర్ణయించుకోవాలి.
మనుషులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దినచర్యను చక్కగా అవలంబించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ వేళ ఏ పనిచేయాలో, ఆ వేళ ఆ పని చేయడమే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమని గుర్తించాలి. కాలం కలిసి వచ్చినప్పుడు స్పందించకపోతే, మనిషికోసం కాలం ఆగదు. నీటి ప్రవాహం సాగిపోయిన తరవాత ఆ నీటిని పట్టుకోవడం సాధ్యమా? కానే కాదు. కాలం మనిషికి ఎన్నో సదమాశాలను ప్రసాదిస్తోంది. వాటిని అందుకోకుండా జాప్యం చేస్తే భవిష్యత్తు శూన్యమే అవుతుంది. నిన్నటి పని మొన్ననే చేసి ఉండటం, నేటి పనిని నిన్ననే పూర్తిచేయడం, రేపటి పనిని నేడే పూరించడం కార్యసాధకుడి లక్షణం.
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment