Monday, January 1, 2024

****మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺 🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹 🌺 Chapter -- 21 🌺 🌹 టెలీపతి 🌹

 🔺 మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 21 🌺
🌹 టెలీపతి 🌹

◆ మీ శిరస్సులో “ హలో ” ( ఆరా లేక దివ్య ప్రకాశం ) కనిపించే ప్రదేశం దగ్గర్లోనే ' టెలీపతీ'కి సంబంధించిన తరంగాల్ని గ్రహించగలిగే ప్రదేశం ఉంటుంది.

◆ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఎన్నో " స్పందనలు  అనుభవంలోకి వస్తాయి . ఈ స్పందనలు ' అన్నీ ఇతరుల మస్తిష్కాల్లోంచి విడుదలై ప్రసారమవుతున్న రేడియో తరంగాల వంటి తరంగాల వంటివేనని మీరు అర్ధం చేసుకోవాలి . ఈ తరంగాల్ని మన టెలిపతిక్ గ్రాహకాలు గ్రహించగలుగుతాయి . వాటికోసం ఎదురు చూస్తున్న మెదడు సంకేతాలను అవి అందించగలగుతాయి. చాలామందికి ముందుగా జరుగబోయే విషయాల గురించిన జ్ఞానం ఉంటుంది . ఏదో జరుగబోయేట్టూ , అందుకు తగిన విధంగా తాము ఏ చర్య తీసుకోవాలో కూడా  చాలామందికి చాలా సమయాల్లో ముందుగానే తెలుస్తూ ఉంటుంది . ఈ  జ్ఞానాన్ని గురించి అంతగా తెలియని వాళ్ళు దీన్ని ఓ “ అనుభూతి ” గానే అనుకున్నా , నిజానికి ఇది మన అచేతన మస్తిష్కం , మరి ఇంకొకళ్ళ అచేతన మస్తిష్కం మధ్య జరిగే మానసిక రేడియో ప్రసారాల ఫలితమేననీ - అచేతనంగా చేసే “ టెలీపతీ " యేననీ మనం గ్రహించాలి.

◆ సహజ అవబోధన " ( intuition ) కూడా ఇలాంటిదే . స్త్రీలకు పురుషులకన్నా ఎక్కువ సహజ అవబోధన ఉంటుంది . తమ అతివాగుడును అదుపుచేసుకోగలిగితే పురుషుల కన్నా స్త్రీలకే ఈ “ సహజ అవబోధన " ఎక్కువగా సిద్ధిస్తుంది . ' టెలీపతీ శక్తి సాధారణ మానవుడికన్నా స్త్రీకే ఎక్కువగా ఉంటుంది . స్త్రీల మెదళ్ళు పురుషుల మెదళ్ళ కన్నా చిన్నవిగా ఉంటాయని చెప్తూంటారు . కానీ , ఇవేవీ నిజమైన అభ్యంతరాలు ప్రతిబంధకాలూ కావు . మెదడు పరిమాణాల గురించీ , తెలివి గురించీ రెండింటి మధ్య సంబంధం గురించీ పనికిరాని చెత్త విషయాలు వ్రాయబడ్డాయి . ఆమాటలన్నీ సత్యాలయితే , మానవులకంటే ఏనుగులకే ఎక్కువ తెలివితేటలు ఉండాలి ! ఓ స్త్రీ మెదడు లోపలికి వచ్చే తరంగాలతో సులభంగా అనుసంధానం చెంది ప్రతిస్పందిస్తుంది . రేడియో పరిజ్ఞానంతో ఈ మాటని చెప్పాలంటే , పురుషుడి మెదడుకంటే బాగా - " ట్యూన్" చెయ్యడానికి వీలయిన రేడియోనే ఈ స్త్రీ మెదడు .ఓ స్త్రీ మెదడు చాలా సులభంగా ' ట్యూన్ ' అవుతుంది .

◆ కవలపిల్లలు ఎంతో దూరంలో విడివిడిగా ఉన్నా , ఇద్దరి మధ్యా మానసికంగా ఓ బలమైన సంబంధం ఏర్పడి ఉందని మనకు తెలుస్తోంది . ఈ కవలల్లో ఒకడు ఉత్తర అమెరికాలోనూ , ఇంకొకడు దక్షిణ అమెరికాలోనూ ఉన్నా ఇద్దరికీ ఒకే విధమైన అనుభవాలు కలుగుతున్నట్టూ ఇద్దరికీ రెండోవాడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతున్నట్లు వచ్చే అనేక వార్తలని మనం ఎన్నోసార్లు వార్తాపత్రికల్లో చదివే ఉంటాం . ఈ చోద్యాలకి కారణం ఏమిటంటే ఈ కవలలు ఇద్దరూ ఒకే జీవకణంనుంచీ , ఒకే అండం నుంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి , ఇద్దరి మెదళ్ళు చక్కగా ట్యూన్ చేయబడ్డ ఓ జత రేడియో - ప్రసార , గ్రాహక - యంత్రాల్లాంటివి కాబట్టి . ఈ శక్తి ఉన్నట్లు ఆ కవలలకి తెలియకపోయినా ఇద్దరిమీదా ఇది పనిచేస్తూనే ఉంటుంది.

◆ " విశ్వాసమూ ” , “ అభ్యాసమూ ” ఈ రెండింటి ఆచరణ ద్వారా మీరు టెలీపతి శక్తిని సాధించవచ్చు . కానీ , మీకు ఎంత విశ్వాసం ఉన్నా ఎంత గొప్పగా సాధన చేసినా ఈ శక్తికి ప్రశాంతత్త్వమనే మీ స్నేహితుడు తోడుగా ఉండకపోతే సాధించడం అసాధ్యం ! 

◆ సాధన - 1:- ఒకటి రెండు రోజులపాటు మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి ' ఫలానా రోజు ' , ' ఫలానా సమయం ' నుంచి బయట నుంచి వచ్చే సంకేతాలను మీ మెదడు గ్రహించే శక్తిని పొందగలదనీ , మొదట్లో సామాన్యమైన స్పందనలనూ , తరువాత తరువాత స్పష్టమైన టెలీపతిక్ సంకేతాలనూ మీ మెదడు గ్రహించి అర్ధం చేసుకోగలదనీ -- ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి . అనేక మార్లు పునశ్చరణ చేస్తూ ఉండండి . విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందని చెప్పుకోండి.

◆  ముందుగా నిర్ణయించుకున్న రోజున సాయంత్రం అయితే మరీ మంచిది . మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి . దీపాలకాంతి తక్కువగా ఉండేట్టు చూసుకోండి . మీ గదిలో ఉష్ణోగ్రత సరయిన స్థాయిలో ఉండేట్టు చూసుకోండి . మీరు స్వస్థులుగా ఉండడం ముఖ్యం . మీకు అత్యంత సుఖప్రదంగా ఉండే స్థితిలోకి వాలిపోయి సర్దుకోండి . మీకు అత్యంత ప్రియులైన వ్యక్తి ఫోటోను మీ చేత్తో పట్టుకోండి . మీ వెనుక తగినంత వెలుతురును ఈ ఫోటో మీదకు ప్రసరింపజేయగల ఏ దీపమైనా ఉండాలి . కొన్నిమార్లు గాఢంగా శ్వాస తీసుకోండి . బయటి ఆలోచనలను అన్నింటినీ బహిష్కరించండి . మీ చేతిలో ఉన్న ఫోటోలోని వ్యక్తిని గురించి ఆలోచించండి . ఫోటోను చూడండి . ఆ వ్యక్తి మీ ఎదురుగా సాక్షాత్కరించినట్లు , మీ ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఊహించండి . ఈ వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడు ? మీ జవాబు ఏమిటి ? మీ ఆలోచనలను కట్టుదిట్టం చేసుకోండి . “ నాతో మాట్లాడు - నాతో మాట్లాడు ” అని మీరు ఇష్టమైతే అనుకోవచ్చు . అలా అనుకుని జవాబుకోసం నిరీక్షించాలి . తగినంత ప్రశాంతత మీలో నెలకొని ఉంటే , మీ విశ్వాసం సుస్థిరమై ఉంటే , మీ మెదడులో కొన్ని ప్రకంపనలను మీరు గుర్తించగలరు . మొదట్లో ఈ చిన్ని కదలికలను ఓ ఊహగా మీరు కొట్టిపారేయవచ్చు - కానీ ఇది " ఊహ " కాదనీ , సత్యమేనని గ్రహించండి . దీన్ని ఊహగా మీరు కొట్టిపడేస్తే టెలీపతీ శక్తిని కూడా కొట్టిపడేసినట్లే , దాన్ని పరిత్యజించినట్లే లెక్క.

◆ టెలీపతి శక్తిని సాధించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే , మీకు బాగా తెలిసిన వ్యక్తితో , అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం , మీరిద్దరూ కలిసి ఓసారి ఈ టెలీపతీ గురించి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలి - ' ఫలానా రోజు ' , ' ఫలానా సాయంత్రం ' , ' ఫలానా సమయానికి ' ఇద్దరూ స్థిమితంగా కూచుని టెలీపతీ ద్వారా సంభాషణ చెయ్యడానికి సంసిద్ధులై ఉంటామనీ , ప్రయత్నిస్తామనీ , అదే సమయానికి , సరిగ్గా మీరు మీ మీ గదుల్లోకి వెళ్ళిపోయి ఉండాలి . మీ ఇద్దరి మధ్యా ఎంత దూరం ఉన్నా పర్వాలేదు . దూరం సమస్యే కాదు . మీ ఇద్దరి మధ్యా ఓ ఖండాంతర దూరం ఉండొచ్చు . మీ ఇద్దరిలో ఎవరు ఆలోచనలను “ ప్రసారం " చెయ్యాలో - ఎవరు వాటిని ' గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి.

◆ ముందు పది నిమిషాల పాటు మీరు మీ ఆలోచనలను “ ప్రసారం " చేస్తే మీ స్నేహితుడు ఆ పదినిముషాల్లో వాటిని గ్రహించేట్టూ , ఆ తరువాత పదినిముషాల పాటు మీ స్నేహితుడు తన “ ప్రసారాలని ” పంపిస్తూంటే ఆ పదినిముషాల సమయంలో మీరు ఆ ప్రసారాలను “ అందుకుని ” అర్ధం చేసుకోగలిగేట్టూ ముందుగా నిర్ణయించి ఏర్పరచుకోవాలి . ఖచ్చితమైన సమయపాలనతో దీన్ని నిర్వర్తించాలి . ఇలాంటి సాధన మీ ఇద్దరూ కలిసి ప్రారంభించగానే మొదటి రెండు మూడుసార్లు మీకు ఏ ఫలితాలు కలుగకపోవచ్చు . కానీ , సాధన వల్ల త్వరలోనే ఈ శక్తిని మీరు సాధించగలుగుతారు.అనేకసార్లు ఒకే పనినిచేస్తూ పోతే చివరికి , ఆ పని సక్రమంగా జరిగి తీరుతుంది .

◆ మీ స్నేహితుడికి ఓ ఆలోచనను పంపగలిగి , అతడి వద్ద నుంచి వస్తున్న ఓ ఆలోచనను మీరు గ్రహించగలిగితే 
“ టెలీపతిక్ ” గా మీరు అందరి ఆలోచనలనూ గ్రహింపగల స్థితికి ఎదుగుతున్నట్లేనని గ్రహించండి . అయితే , ఒక్క విషయం . ఇంకొకళ్ళు ఆలోచనలను గమనించగలిగే స్థితి మీలో ఏ దుర్బుద్దీ లేకుండా ఉన్నప్పుడే సిద్ధిస్తుంది .

◆ ఇంకొకళ్ళకు హాని కలిగించే ఉద్దేశ్యంతో మీరు టెలీపతీనీ , యోగదృష్టినీ , సైకోమెట్రినీ ఉపయోగించలేరు- ఉపయోగించలేరు - ఉపయోగించలేరు . అదే విధంగా మీకు కూడా వీటి ద్వారా ఎవ్వరూ హాని కలిగించలేరు . దుర్బుద్ధి ఉన్నవాళ్ళకి ' టెలీపతీ , విద్య అబ్బితే తాము తెలుసుకున్న రహస్యాన్ని అందరికో , కొంతమందికో చెప్పేస్తామని బెదిరించి ( black - mail చేసి ) మనుష్యుల చిన్న తప్పులను తమ లాభం కోసం వినియోగించే అవకాశం వీళ్ళకు ఉందని మీరు అనుకుంటారేమో - ఇలాంటివి జరిగే అవకాశమే లేదు . అసంభవం . ఒకే సమయంలో , ఒకే ప్రదేశంలో వెలుతురూ , చీకటి కలిసి ఉండలేవు . టెలీపతీని మీరు దుర్మార్గానికి వినియోగించలేరు . ఇది వేదాంతంలో ఓకఠినమైన శాసనం. కాబట్టి మీరు దిగులు పడకండి . మీ ఆలోచనలను ఎవ్వరూ మీకు హాని కలిగించేందుకు గ్రహించలేరు .

◆ ఎంతోమందికి మీ ఆలోచనలను దురుద్దేశ్యంతో తెలుసుకోవాలని కోరిక ఉండవచ్చు . కానీ , వాళ్లు ఆ ఉద్దేశ్యం వల్లనే మీ ఆలోచనలను గ్రహించలేరు . చాలామందికి తమ ఆలోచనలను ఎవరైనా తెలుసుకుంటారేమోనన్న భయం ఉంటుంది . కాబట్టి , ఆ భయాన్ని తొలగించేందుకే ఈ మాటను చెబుతున్నాం . నిర్మలమైన మనస్సు ఉన్నవాళ్ళకే మీ ఆలోచనలను గ్రహించగల శక్తి ఉంటుంది . మీ ' ఆరా'లో వాళ్ళకు మీ బలహీనతలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి . ప్రవిత్రులకి దుష్టసంకల్పాలు కలగనే కలుగవు . దుశ్చింతులకు ఈ శక్తి సిద్ధించనే సిద్ధించదు .

◆ సాధన -- 2:- మీరు టెలీపతీని మీ స్నేహితుడితో కలిసి అభ్యసించండి . ఏ స్నేహితుడి సహకారమూ మీకు లభించకపోతే , పూర్తిగా రిలాక్స్ అయివచ్చే ఆలోచనలను స్వీకరించే ప్రయత్నాన్ని చెయ్యండి . మొదట్లో మీ తలనిండా జోరీగ చప్పుడు చేసే విధంగా పరస్పర ఆవిరుద్దాలైన ఆలోచనలు రావచ్చు . జనం మధ్యలోకి మీరు వెళ్ళి నుంచుంటే మనకు వినిపించే కలగాపులగంగా కలిసిపోయే మాటల్లాంటివి మీ ఆలోచనల్లోకి రావచ్చు . లేక ఉత్తి చప్పుడు భయంకరంగా వినిపించవచ్చు . అందరూ గట్టిగా గొంతులు చించుకునేలా మాట్లాడు ఉన్నట్టు మీకు అనిపించవచ్చు . కొంత సాధన చేస్తే ఈ మాటల్లోంచి ఏ ఒక్కరి మాటలనో మీరు వినవచ్చు . టెలీపతీలో ఇలాంటి సాధన కూడా చెయ్యొచ్చు . కాబట్టి ఈ పద్ధతుల్లో అభ్యాసం చెయ్యండి . అభ్యాసం చేస్తూ విశ్వాసాన్ని కలిగి ఉండండి . తరువాత మీరు ప్రశాంతంగా ఉండడంతో బాటు , ఎవర్నీ హింసించాలనుకునే దుర్భుద్దిని కూడా మీలోకి రానివ్వకుండా ఉన్నట్టయితే , మీరు 
" టెలీపతీ " ని సిద్దించుకోగలుగుతారు .

◆ సాధనతో మీరు యోగదృష్టిని సాధించవచ్చు . చరిత్రలో ఏ సమయానికైనా మీరు వెళ్ళి సాక్షాత్తుగా , మీ కళ్ళలో మీరే నేరుగా చరిత్రమ దర్శించవచ్చు . చరిత్ర పుస్తకాలలో పేరు చదువుకున్న అంశాలు కొన్ని ఈ సాక్షాద్దర్శనం వల్ల  'అబద్దాలని తేలవచ్చు . చరిత్ర పుస్తకాలు ఏ కాలంలో వ్రాస్తారో అప్పటి రాజనీతికి అనుగుణంగానే ఈ చిత్రీకరణలు ' జరుగుతాయి . యదార్ధంలో కల్పన కలిసిపోతూ ఉంటుంది . హిట్లర్ యొక్క జర్మనీ సోపియట్ రష్యాల చరిత్రల్ని ఇలాగే మీరు యదార్థంగా గ్రహించవచ్చు.

◆ సైకోమెట్రీని " వ్రేళ్ళతో దర్శించే విద్య " గా మనం చెప్పుకోవచ్చు .  సైకోమెట్రీ ' అనే మాటకు మా అర్ధం ఏమిటంటే - ఒక వస్తువును తీసి చేత్తో పుట్టుకుని , ఆ వస్తువు ఎలా పుట్టిందో , ఏయే మార్పులు దానికి సంభవించాయో ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో , ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి ' గ్రహించగలిగే విద్య - అని . ఒక్కోసారి ఓ వస్తువును మీరు పట్టుకుంటే " అది సంతోషంగా ఉన్న చోటులోంచి వచ్చిందా ? " లేకపోతే " దుర్భరమైన ప్రదేశం నుంచి వచ్చిందా ? ” మీకు చూచాయగా తెలియవచ్చు . ఇవి మాత్రం నిజమైన సైకోమెట్రీకి ఉదాహరణలే.

◆ రహస్య జ్ఞాన విద్యల్లో కుడిచేతిని “ ఇహానికి " ఉపయోగించే చెయ్యిగా భావిస్తారు . ఎడమ చెయ్యిని ఆధ్యాత్మికతకూ , “పరానికి సంబంధించినదిగా భావిస్తారు . మీరు మామూలుగా కుడిచేతి వాటం ఉన్నవాళ్ళయితే , మీరు మీ " ఆధ్యాతక " - ఎడం చేతిని వాడడం ద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు . మీరు మామూలుగా ఎండంచేతి వాటం ఉన్నవాళ్ళయితే , సైకోమెట్రీకోసం మీ కుడి చేతనే " ఆధ్యాత్మక" హస్తంగా గుర్తించవలసి వస్తుంది . సాధారణంగా కుడిచేతికన్నా ఎడం చేతిని సైకోమెట్రీకోసం వాడినప్పుడు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి . 

◆ మీరు మీ “ యోచన చేసే గది " ( ధ్యానమందిరం ) లో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కుని బాగా తుడుచుకుని , పొడిగా ఉంచుకోవాలి . ఆ విధంగా శుభ్రం చేసుకోకపోతే మీ చేతులకు అనేక అనుభూతులు అంటుకునివుండి మీ సాధనకు ప్రతిబంధకాలు కావచ్చు .

◆ ఉత్తరం ఉన్న ఓ కవరును చింపకుండానే ఆ ఉత్తరంలో మొత్తం మీద ఏ విషయం ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంటుందో గ్రహించడాన్ని కూడా సైకోమెట్రీ ద్వారా సాధించవచ్చు . మీకు తెలియని భాషలో ఉన్న ఉత్తరం మీద మీ ఎడం చేతి వ్రేళ్ళను నడిపించి మీరు ఆ ఉత్తరంలో వ్రాయబడ్డ విషయాన్ని గ్రహించవచ్చు . సైకోమెట్రీ ద్వారా ఇలాంటివి సుసాధ్యాలు . కానీ , ఇంకొకళ్ళకు నిరూపించేందుకు మాత్రం ఇలాంటివి చేసి చూపించే ప్రయత్నాలను చేయకండి .

◆ టెలీపతీని నిరూపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళతో మీకు " ఉత్సాహం లేదు ” అని చెప్నేయమని మా సలహా . మీకు తెలిపిన విద్యల్ని మీరు ఎవ్వరికీ నిరూపించి చూపించనక్కర్లేదని మీకూ తెలుసుకదా . 

◆ మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకళ్ళకు చూపించకపోవడమే మంచిదని మా అభిప్రాయం . ఎంత సాధారణంగా మీరు కనిపిస్తే ఎంత సహజంగా మీరు ఇంకొకళ్ళకి కనిపిస్తూంటే అంత ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు . ఈ విద్యలను నిరూపించే ప్రయత్నాన్ని ఒక వంక చేస్తూ ఉంటే మరోవైపు నుంచి నమ్మని వాళ్ళ నుంచి వచ్చే బలమైన అలలు మిమ్మల్ని ముంచెత్తుతూంటాయి . గొప్ప హానిని మీకు కలిగిస్తాయి.

◆ మరణం లేని మీరు.                  సే::మాధవ కొల్లి.             

No comments:

Post a Comment