*ధర్మాచరణపరులు ప్రతి నిత్యమూ పాటించవలసిన కొన్ని విషయాలు*
*అవి*
*ప్రతిరోజూ కనీసం ఒక్క తులసిదళం అయినా తినండి.*
*మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ వారానికి*
*ఒక్కరికైనా అన్న దానం చేయండి.*
*ఎల్లపుడూ శుభాన్నీ , మంచిమాటలనీ పలకండి.దైవ నామస్మరణ చెయండి. శుభాన్ని పలుకుతూ ఉంటే శుభం కలుగుతుంది. అశుభమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ అశుభాలు వదలవు. ఎప్పుడైనా అశుభం పొరపాటున పలికితే, వెంటనే కాసేపు దైవ నామ స్మరణ చెయ్యండి.*
*ప్రతిరోజూ ఒక మంచి పుస్తకాన్ని కొద్ది పేజీలైనా చదవండి. అలా చేస్తేనే ధర్మాచరణ చేస్తున్నట్టు.*
*కనీసం రోజుకు ఒక్క పేజీ అయినా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. అలాచేస్తే గ్రహాలు అనుకూలిస్తాయి.*
*ప్రతి రోజూ భగవద్గీత లోని ఏదో ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా చదవండి*
*గురూపదేశం పొందిన వారు ప్రతిరోజూ ఒక్క మాల అయినా మంత్రం జపం చెయ్యండి . కష్ట సమయంలో ఆ మంత్ర దేవత రక్షిస్తుంది.*
*కోపాన్నీ మరియు అసూయనూ వదిలేసి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి.*
*అనుకూలించినంత వరకూ వ్రతాలూ, దానాలు చేస్తూ ఉండండి.*
*అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి*
*సవాళ్ళను ధైర్యం తో స్వీకరించండి*
*మీకు మీరు జవాబుదారీతనం తో అనునిత్యం వ్యవహరించండి*
*ప్రతి రోజూ ధ్యానం చేయండి*
*కష్టాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు*
*కష్టమనుకోకుండా అనుభవిస్తే దాని గడువు ముగియ గానే అది వెళ్ళిపోతుంది*
*సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి వ్యర్థ సంభాషణలతో అమూల్యమైన కాలాన్నీ శక్తినీ వృధా చేయకండి*
No comments:
Post a Comment