🍁 *ప్రియ పుష్పాలు* 🍁
✍️ మురళీ మోహన్
🙏పూజకు సిద్ధమై పోయారా?మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి పూలు తెద్దాం.అన్నట్టు విష్ణువుకి ఇష్టమైన పూలేంటో తెలుసా!
ఇవిగో.....👇
*అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః*
*సర్వ భూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః*
*జ్ఞాన పుష్పం తప: పుష్పం శాంతి పుష్పం తథైవ చ*
*సత్యం అష్ట విధం పుష్పో: విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!*
*1.అహింసా పుష్పం:*
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.
*2.ఇంద్రియ నిగ్రహం:*
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.
*3.దయ:*
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
*4.క్షమ:*
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
*5.ధ్యానం:*
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.
*6.తపస్సు:*
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.
*7.జ్ఞానం:*
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.
*8.సత్యం:*
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
అవి చాలా అరుదైన పుష్పాలు,అవి మా తోటలో *అన్ని లేవే* అంటున్నారా!మరేం పర్లేదు,ఇవాళే మొక్కలు నాటండి.🌱🌾🌴
త్వరలోనే మిగతా పూలు పూయించండి. మీరంతా పూజ వచ్చే వాటితోనే చేస్తారని ఆశిస్తూ 👍
No comments:
Post a Comment