నేనెందుకు చదువుతాను?
_(ఆంగ్ల మూలం: గేరీ పాల్సెన్ )
నేను చదవకుండా ఉండలేను కాబట్టి చదువుతాను
నేర్చుకోవడానికి,ఎదగడానికి,నవ్వడానికి,స్ఫూర్తి పొందడానికి చదువుతాను ....
నాకు తెలియని విషయాలను అర్థం చేసుకోవడానికి చదువుతాను ...
నాకు చికాకుగా ఉన్నప్పుడు చదువుతాను ...
నేను ప్రేమించే వ్యక్తులతో పరమ మూర్ఖంగా మాట్లాడినప్పుడు చదువుతాను ...
నేను నిరాశలో కృంగిపోయినప్పుడు,భయంతో వణికి పోయినప్పుడు,మానసికంగా ముక్క
చెక్కలయినప్పుడు కోలుకునే శక్తిని పొందడానికి చదువుతాను ...
అంతా సవ్యంగా నడుస్తున్నప్పుడూ చదువుతాను ...
జీవితంలో ఆశను అన్వేషించడానికి చదువుతాను ...
నేను కేవలం భావాలతో నిండిన చర్మపు తిత్తిని కాను,
తినడం కోసమే బతికే మనిషినీ కాదు,
నేను పదాలతో నిండిన మనిషిని,
పదాలు నా ఆలోచనలను వర్ణిస్తాయి,
నా గుండె లోతులలో దాగున్న విషయాలను వెల్లడిస్తాయి,పదాలు జీవంతో తొణికిస లాడుతుంటాయి ....
ఇష్టమైన పాటను మళ్ళీ మళ్ళీ పాడుకున్నట్లు
నేను ఇష్టపడే కథను
మళ్ళీ మళ్ళీ చదువుతాను ....
చదవడం అంటే క్రియా రహితంగా ఉండడం కాదు ...
పాత్రలతో పాటు నేనూ కథలోకి ప్రవేశిస్తాను ...
ఆ పాత్రలు పీల్చే గాలే నేనూ పీలుస్తాను ....
వాళ్ళ నిరాశ నిస్పహలను అనుభవిస్తాను ...
వాళ్ళు ఏదైనా తెలివితక్కువ పని చేస్తుంటే, వద్దురా అని కోప్పడతాను ...
వాళ్ళతో పాటు నవ్వుతాను, ఏడుస్తాను ...
నా దృష్టిలో చదవడం అంటే ఒక స్నేహితుడితో సమయాన్ని గడపడం ...
పుస్తకాలు మన స్నేహితులు ...
ఈ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఇంకా కొరతగానే ఉంటుంది
@what's app నుండి సేకరణ.
No comments:
Post a Comment