*_☘ శ్రీరమణుల బోధ : ధనమును సద్వినియోగం చేస్తే పుణ్యము వస్తుంది. మనసు విశాలం అవుతుంది. ధనమును దుర్వినియోగం చేస్తే పాపము వస్తుంది. మనసు సంకుచితం అవుతుంది. ధనాన్ని మంచి కోసం దానం చేస్తే నీ మనసులోని దోషాలు రాలిపోతాయి ! తపోధనం లేకపోతే ధనాభిమానం, దేహాభిమానం నశించవు !! 🪷_*
*_-శ్రీరమణమహర్షి._*
_*💫 శ్రీరమణమహర్షిని...*_
_*చంపుతానన్న యువకుడు!⚜️*_
➖➖➖➖➖➖✍️
*_-శ్రీరమణాశ్రమ లేఖలు_*
*_-శ్రీరమణ స్మృతులు_*
®®®®®®®®®®®®®®
*_⚡మహాత్మాగాంధి హత్య జరిగిన రోజులవి. ఉన్నట్లుండి ఎక్కడినుండో మతి స్థిమితంలేని ఒక యువకుడు శ్రీరమణాశ్రమానికి వచ్చాడు. సరాసరి మహర్షి సన్నిధిలోకి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఉగ్ర నరసింహుని వలె ఊగిపోతూ "గాడ్సే, గాంధీని చంపి ప్రఖ్యాతి పొందాడు. నేను, నిన్ను చంపి కీర్తి పొందుతాను" అని బెదిరించాడు మహర్షిని.._*
*_అందుకు మహర్షి "చంపు నాయనా చంపు; నాకు కూడా ఈ శరీర భారం తప్పిపోతుంది" అని సెలవిచ్చారు._*
*_అక్కడేఉన్న ఆశ్రమభక్తులు ఆ యువకుడిని బయటకు పంపించి వేయాలని చూశారు. కాని మహర్షి ఆ యువకుడిని తన వద్దనే ఉంచుకుని తనతోపాటే భోజనానికి తీసుకువెళ్ళారు. ఆ యువకుడు రెండు రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు._*
*_మూడవ రోజున ఆ యువకుడు మహర్షి వద్దకు పోయి వినయంగా.._*
*_"నన్ను క్షమించండి భగవాన్ ! నాకు అనుకోకుండా మతి స్థిమితం తప్పిపోతూ ఉంటుంది. నా మతి స్థిరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించి నాకు ఏదయినా ఉపదేశించండి !" అని అన్నాడు. మహర్షి ఆ యువకునితో "గాయత్రి మంత్రం చెయ్యి ! అని అన్నారు._*
*_ఆ యువకుడు ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తరువాత పిచ్చి కుదిరి, గొప్ప భక్తితో ఆశ్రమానికి వచ్చాడు ఆ యువకుడు.! -(సూరి నాగమ్మ)._*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
No comments:
Post a Comment