Saturday, July 13, 2024

శిశుపాల దంతవక్త్రుల కథ

 *శ్రీరమణీయభాగవత కథలు- 23- (1)*
( బాపు-రమణ )

జరిగిన కథ:

ఆ యేనుగు మొర విన్న శ్రీహరి వెనువెంటనే వచ్చి మొసలిని సంహరించి, మొసలికి, ఏనుగుకు మోక్షము ప్రసాదించాడు.

ఇక చదవండి... ..
******
*శిశుపాల దంతవక్త్రుల కథ - 1*

పరీక్షిత్తు తలవంచి
 నమస్కరించాడు.

శుక : *నారయణః పరంధామ ధ్యానం నారాయణః పరః నారాయణ పరోధర్మో నారాయణ నమోస్తుతే!*

పరీ: మహార్షి భక్తితో ఆశ్రయించి శరణు కోరిన వారు కాబట్టి అంబరీషుడు, గజేంద్రుడు వంటి వారిని కాపాడడం బాగానే వుంది, కాని పుట్టిన దాదిగా దేవుడిని నిందించి ఆయనపై పగబట్టిన శిశుపాలుడు దంతవక్త్రుడు వంటి వారికి కూడా స్వామి మోక్షం ఇచ్చాడని విన్నాను. ఇది చాలా వింతగా వుంది. సత్యేమేనా?

శుక : అవును

*చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్*

భగవంతుడిని చేరే మార్గాలు అనేకం. ప్రేమ భక్తి వంటివే కాక ద్వేషం శత్రుత్వం వంటివి కూడా వాటిలో వున్నాయి. ఉన్నాడు లాగే, లేడు లేడు అన్న మాటలో కూడా నిత్య స్మరణేకదా! 

కామంతో గోపికలు, భయంతో కంసుడు, వైరంతో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు శిశుపాలాదులు శ్రీహరిని చేరుకున్నారు. 

ముందుగా జయవిజయుల కథవిను. వారు వైకుంఠంలో స్వామివారికి ద్వార పాలకులు.

శుక: బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులనే నలుగురు దివ్య ఋషులు త్రిలోక సంచారం చేస్తూ ఒక నాడు వైకుంఠానికి వచ్చారు. 

వయసు చేత వారు ఎంతో వృద్ధులైనా రూపం చేత ఎల్లపుడూ బాలకుల వలెనే నిర్మలానందులై కనిపిస్తారు.

వారు దైవ నామం జపిస్తూ మహాద్వారం చేరుకున్నారు. 

అతిమానుష విగ్రహులు తేజస్వంతులు అయిన జయవిజయులు ద్వారానికి అటూ ఇటూ ద్వార పాలకులుగా ఠీవిగా దర్పంతో నిలచి వున్నారు. 

ఆ భారీ విగ్రహులకు సనకామలు అంగుష్ట మాత్రులుగా తోచారు. ఈసడింపుగా కనుబొమ లెగరేశారు. వీరేమిటి లోపలికేమిటి అన్నట్టు చూశారు.

సనకాదులు మహాద్వారం వద్దనిలుచున్నారు. ఆ గడపే పెద్ద ప్రహరీ గోడలా కనబడింది. పసుపు కుంకాలతో
ఎర్రని శతపత్ర పద్మాలతో ఆ గడప శోభాయమానంగా వుంది. మహర్షులు దానికి నమస్కరించి ఎక్కబోయారు. రూపు ధరించిన పిడుగుల్లా రెండు గదలు వారి ముందు ధన్ ధన్ మని నేల మీదకు దిగాయి. 

వారు ఆశ్చర్యంగా పైకి చూశారు.

ఈ సడింపుగా కిందకు చూస్తున్న జయవిజయుల ముఖాలు కనిపించాయి. 

మునులు ఆగ్రహించారు. మునులు శాంతంగా మాట్లాడినా జయవిజయులకు వారి మాటలు గుండెలు అదిరేలా ప్రతిధ్వనించాయి.

శ్రీమహావిష్ణు ప్రాంగణంలో సత్వగుణం గల సాధు సేవకులే వుంటారను కున్నాము.

రాజసం కాదు తామసం వీరి బుద్ధిని పూర్తిగా ఆక్రమించుకొంది.

మీ వంటి రాజసం అహంకారం గలవారు ఉండరాదు. జయ విజయులకు భయం కలవరం ఆవరించాయి. లోపలకి వెళ్లాడానికి మాయోగ్యత ఎలావున్నా ఇక్కడ నిలచే యోగ్యత మీకు లేదు. మీరు చీకటిలోకాలకు పోయి రాక్షసులుగా పుట్టండి.

జయవిజయులు శాపం వినగానే నిలువునా వణికి పోయారు. వంగి మోకాళ్లమీద కూర్చుని చేతులు జోడించి నమస్కరించారు.

జయ: మహర్షులారా! క్షమించండి.

విజ: శరణు శరణు!

జయ:
మీ శాపాగ్ని నుండి కాపాడమని మిమ్మల్నే శరణు కోరుతున్నాం.

విజ:మీరు ఎవరో తెలియక మిమ్మల్ని గద్దించాము.


జయ
ఎవరో బాలకులు - ఇట్టివారిని లోనికి అనుమతించరాదనే భావించాం.

విజ:
ద్వారం దగ్గరే  కావలి పడి ఎప్పటికైనా వైకుంఠస్వామి పాదాల దగ్గరకు చేరాలన్న ఆశా వున్న మమ్మల్ని వైకుంఠ ద్వారం నుండి ఎంతో దూరానికి పొమ్మంటున్నారు. ఈ ఎడబాటు భరించలేము. కాపాడండి.

మునులు ముఖముఖాలు చూసుకున్నారు.

ఇంకావుంది.....2
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

*శ్రీరమణీయభాగవత కథలు- 23- (2)*
( బాపు-రమణ )

జరిగిన కథ:
వైకుంఠద్వారము లోనికి వెళ్ళనీయని, జయ, విజయులకు, సనకాది మహర్షులు శాపమిస్తారు.

ఇక చదవండి... ..
******
*శిశుపాల దంతవక్త్రుల కథ - 2*

మునులు ముఖముఖాలు చూసుకున్నారు.

మా శాపవచనాలకు తిరుగు లేదు. మీరు దైవభక్తులుగా ఏడు జన్మలు జీవించి స్వామిని పూజించి ఇక్కడకు చేరుకుంటారు.

లేదా 

స్వామికి శత్రువులై ఆయనను నిందించి ద్వేషించి మూడు జన్మలలో తిరిగి రావచ్చు.

జయ : ఏడుజన్మల కాలం ఎడబాటు భరించలేము

విజ: దైవదూషణ చేసి రాక్షసులమై కత్తి దూసినా సరే మూడు జన్మల్లో స్వామి సేవకు చేరుకునే భాగ్యాన్నే అనుగ్రహించండి.

సనక : తధాస్తు

లోపల వైకుంఠంలో యోగనిద్రలో వున్న విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుకున్నాడు.

*పరీక్షిత్తు యాగశాల*

చతుర్దశ భువనాలకూ రారాజధానిగా శతకోటి భాస్కర ప్రభా భాసమానమై వెలుగొందే విష్ణు విరాజమాన నిలయం శ్రీ వైకుంఠ ధామం! 

అంతటి వైకుంఠ పురానికి విచ్చేసే వారి ప్రవేశ అర్హతా నర్హతలను నిర్దేశించే ద్వార పాలకులు జయవిజయులు. 

ఆకారణంగా అట్టి మహత్తర అధికార దర్పంతో అజ్ఞానంతో కండకావరంతో వారు ఒక అపచారం చేసి వుండవచ్చును. కాని తపోనిధులు, శమదమాది సంపన్నులు అయిన సనకాది ఋషులు కూడా ఆగ్రహావేశానికి లోనై అంతటి ఘోర శాపం ఇవ్వడం ధర్మమా? 

శాపం యిచ్చేటంత కోపం ఎందుకు రావాలి? తమంతటి తపోధనులను కేవలం ఇద్దరు భటులు అవమానించారే అన్న అహంకారమా?

శుకుడు: (నవ్వి) తస్మాత్ జాగ్రత జాగ్రత అన్నారు. 

అందుకే భాగవతం పదేపదే హెచ్చరించేది - అరిషడ్వర్గాలలోని ఈ అహంకారం గురించే... 

భాగవత కథా ప్రసూనాల హారంలోని దారం ఈ అహంకారమే ... ఎంతటి వారినైనా అది పరిహసిస్తుంది. - పరిహరిస్తుంది.

పరీక్షిత్తు : మంచిది. అజ్ఞాన భటుల తప్పిదానికి శిక్షపడింది అయితే మరి ఆ"జ్ఞాను"ల తప్పిదానికి?

శుకుడు: భటుల వలెనే ఋషులు కూడా తమ అహంకార పూరిత కృత్యాన్ని అందలి అధర్మాన్ని క్షణంలో గ్రహించారు. అంతలో ఈ వుదంతం తెలిసిన శ్రీమహావిష్ణువు అక్కడకు వచ్చాడు.

ఋషులు ఆయన పాదాల పై పడి తమకు కూడా శిక్ష విధించమని వేడుకున్నారు.

పరీక్షిత్తు :ఓహో - ప్రభువే వారికి శిక్షవిధించాడా?

శుకుడు : శ్రీహరి బ్రహ్మణ్య దేవుడు. అనగా బ్రాహ్మణుల తేజానికి భక్తుడు దాసుడు - ఆయన ఋషులను మందలించలేదు దండించనూ లేదు. పైగా తనను మన్నించమని వారినే ప్రార్థించాడు. తన దాసుల తప్పులు వారి యజమానిగా ప్రభువుగా తనవేనన్నాడు. వారికై తాను భూలోకం వెళ్ళి వారిని సంహరించి, ఉపసంహరించి వైకుంఠానికి తీసుకు రాగలనని చెప్పాడు.

పరీక్షిత్తు: అంటే ?

శుకుడు :(నవ్వి) శ్రీహరి బహు చమత్కారి గదా! ఆయన అంతరంగం వలెనే ఆయన మాటలూ చేతలూ కూడా గూఢార్ధవంతములూ 

దుర్భేద్య తాత్పర్య యుతములూ చివరకు ఆయన విధించని శిక్ష కన్నా ఆయన చూపిన క్షమయే సనకాదులకు బాధా కరమయింది.. 

తమ కోపం వల్లనే స్వామి భూమికి వెళ్లి శ్రమపడనున్నాడు అదే తమ పాలిట శిక్ష అని భావించారు. ఎంతటి మహాఋషులకైనా అహంకారం ప్రమాద హేతువు అని లోకానికి తెలియ 💝ఉదయాన్నే ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు.
💖బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్లుతున్నది.
❤️ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ, ఆగి, దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది.
💕ఒకానొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి. కాసేపు ఆగి, విశ్లేషించి, ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగులు మీద ఉంచి, ఆకు మీద నడిచి, అవతలి వైపుకు వెళ్లి, ఆకును తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది.
దేవుని సృష్టిలో చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. 
💞ఈ సంఘటన అతనిని విస్మయానికి గురి చేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది, పరిమాణం తక్కువగా ఉంది.. కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది.
💖కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు - అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియ వచ్చింది.
చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకు వచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్లగలదు..? దానికి అది సాధ్యం కాలేదు..!
❤️అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి, మరెంతో శ్రమించి, మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి (రంధ్రంలోకి) వెళ్లిపోయింది.
💕చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు.
💖మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే. మనము మన కుటుంబం గురించి చింతిస్తాము, మన ఉద్యోగం గురించి చింతిస్తాము, ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ నివసించాలి, ఎటువంటి వాహనం కొనాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి... అని ఆలోచించి మన గమ్యం (సమాధి) చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం.
💝మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో, ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్లలేమని మాత్రం గ్రహించలేము!
💞 ఆయన పరమార్ధమని అర్ధం చేసుకున్నారు.

ఆ జయవిజయులే తొలిజన్మలో దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా మలి జన్మలో కైసికీ విశ్రవసులకు రావణ కుంభకర్ణులుగానూ మూడవ జన్మలో శిశుపాల దంతవక్త్రులుగానూ పుట్టారు. హరివైరులై పోరాడి తరించారు.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)


No comments:

Post a Comment