Wednesday, March 5, 2025

 *`భార్యాభర్తల అనుబంధం`*

*నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.*

*తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.*

*అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.*
*అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.*

*ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..*
*ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...*
*ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...*

*భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం*
*బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.*

*సంసారం అంటే కలసి ఉండడమే కాదు.*
*కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.*

*ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ*
*అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...*
*మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.*

*భార్యాభర్తల సంబంధం శాశ్వతం.*
*కొంతమంది మధ్యలో వస్తారు.*
*మధ్యలోనే పోతారు.*
*భార్యకి భర్త శాశ్వతం.*
*భర్తకు భార్య శాశ్వతం.*

*ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ...*
*గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క...!*

*అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.*
*భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.*

*మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం*
*ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.*

*బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే*
*ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.*
*మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.*

*మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.*
*కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.*

*కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.*
*భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.*

*నీ సంతోషం నేను కాకపోయినా నా *చిరునవ్వు మాత్రం నువ్వే.*
*నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.*

*ప్రేమ అనేది చాలా విలువైనది.*
*దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.*

*సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.*

*గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...*
*ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.*

*పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.*
*ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.*

*వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.*

*నేలకు జారిన తారకలైముత్యాల తలంబ్రాలు*
*ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!*

*సప్తపది ఏడు అడుగులు*
*మొదటి అడుగు - అన్న వృద్ధికి*
*రెండవ అడుగు - బలవృద్ధికి*
*మూడవ అడుగు - ధన వృద్ధికి*
*నాల్గవ అడుగు - సుఖవృద్ధికి*
*ఐదవ అడుగు - ప్రజాపాలనక*
*ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి*
*ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి*

*కోరుకున్న ఇంతి... నేడు నీ సతి... నేడు పట్టుకున్న ఆమె చేయి...*
*విడవకు ఎన్నటికీ.*

*వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.*
*పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.*

*కలిమి లేములతో...కలసిన మనసులతో...కలివిడిగా మసలుకో..*
*కలకాలం సుఖసంతోషాలు పంచుకో...*

*బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.*
*పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.*
*ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ...*
*మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.*

*మగవాడు గాలి పటం*
*(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)*
*ఆడది దారం, అతడికి ఆధారం*
*(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను* *పదిమందికి ప్రదర్శించడం తెలీదు)*
*విడివిడిగా దేనికీ విలువ లేదు ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.*

*భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు*
*భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు*
*భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి*
*అయోమయం కాకూడదు.*

*మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.*

*అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే*
*ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.*

*పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.*
*ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.*

*ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.*
*కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.....*

No comments:

Post a Comment