232 వ భాగం
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకం 20
ప్రవృత్తౌ వా నివృత్తౌ వా నైవ ధీరస్య దుర్గృహః|
యధా యత్కృర్తుమాయాతి తత్కృత్వా తిష్టత సుఖం||
యధాప్రాప్తమైన కర్మలను సంతోషంగా నిర్వర్తించే జ్ఞాని కర్మలను చేయడంలో గాని మానడంలో గాని సుఖదుఃఖాలను పొందడు. నిత్యతృప్తుడై సుఖంగా జీవిస్తాడు.
కర్మలను చెయ్యడంలో జ్ఞానికి కొత్తగా లభించేది ఏమీ ఉండదు. మానేయడంలో అతనికి నష్టము కలగదు.
ఇదివరకు నాచే సాధింపబడిన పడనిది, నేను కొత్తగా సాధించవలసినది ఏదీ లేదు. అయినా నేను కర్మలను చేస్తూనే ఉన్నాను.
అయినా జ్ఞాని అనేక కర్మలతో నిత్యము సమాజాన్ని సేవిస్తూనే ఉంటాడు. కోరకుండా ప్రాప్తించిన కర్మలను దేశ కాలానుగుణంగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా తన శక్తిని అంతటినీ ధారపోసి నిర్వర్తిస్తూ వాటిని తన ప్రారబ్దంగా గుర్తిస్తూ నాని శాంతంగా జీవిస్తాడని అష్టావక్ర మహర్షి స్పష్టం చేస్తున్నారు.
తన శరీరము మనోబుదులు వాటి క్షేత్రాలలో పని చేయటాన్ని మిగతా ప్రపంచంతో పాటుగా గుర్తిస్తూ తాను మాత్రం సదాశాంతుడే ఆనందంగా జ్ఞాని జీవిస్తుంటారు. అద్వైయమైన ఆత్మ తత్వమై అంతటా ఉండటాన్ని గుర్తిస్తున్న జ్ఞాని కర్మలు ఆ దివ్య తత్వానికి అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. అంతేగాని దివ్య తత్వానికి వ్యతిరేకంగా జరుగుటకు వీలు లేదు.
పనులలో పూర్తిగా నిమగ్నమైపోయి క్షణము తీరిక లేకున్నా, ఏకాంతంలో విశ్రాంతిగా ఉన్న సదాశాంతంగా తృప్తిగా ఆనందంగా ఉండగలుగుతారు. నేను కర్తనని కానీ ,భోక్తనని కానీ అతడు ఎన్నడూ భావించడు. అతనిలో అహంకారమే ఉండదు. సత్ చిత్ ఆనందమయుడైన ఆత్మగా అతడు సర్వదా భాశిస్తుంటే ఆ ప్రకాశంలో అతని ఉపాధులు అవి చూసే ప్రపంచం కూడా పనిచేస్తూ ఉంటాయి.🙏🙏🙏
No comments:
Post a Comment