🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(228వ రోజు):--
ప్రతిరోజూ,భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం గురించి ఒక్కొక్కరు పది,15 ని. ల సేపు మాట్లాడాలి. అది పూర్త య్యాక, మాట్లాడాల్సిన సమయాన్ని 30 ని.కు పెంచారు. "మీకు మాట్లాడ టం తెలిసింది కనుక.. ఇక వినడం మొదలుపెట్టండి" అన్నారాయన నవ్వుతూ ఒక టేపురికార్డర్ బయట కు తీసి. ఎవరితర్వాత ఎవరు మాట్లా డాలో నిర్ణయించే పద్దతిని కూడా మార్చారు. మొదటి కొద్దిరోజుల తర్వాత, ఏ శ్లోకాన్ని ఎవరు వివరిం చాలో ముందే తెలిసిపోయేది ; అందరూ దానికి తగినట్లు సిద్దపడే వారు. తర్వాత లాటరీపద్దతిలో నిర్ణ యించడం మొదలుపెట్టారు ఎవరు మాట్లాడాలో. అంతేకాకుండా, ఉప న్యాస సమయాన్ని గంటవరకూ పెంచారు. టేపురికార్డారుమీద తమ ఉపన్యాసాల 'ఇంకా'లు,'అంతేకాక' లు, కాసేపు నోటమాట రాకపోవటం, ఉపన్యాసంలో పసలేకపోవటం - వీటన్నిటినీ భరిస్తూ వినాల్సివచ్చింది విద్యార్థులకి. తమ లక్ష్యానికి ఎప్పటి కైనా సిద్దపడగలమా అనే సందేహం వచ్చేది వాళ్లందరికీ.
మరుసటి సంవత్సరపు వర్షా కాలంలో మళ్ళీ ఉత్తరకాశీ చేరినపు డు, "సరే, మీరిప్పుడు గీత గురించి మాట్లాడగలుగుతున్నారు ; కాని, శ్రోతలముందు మాట్లాడటం మీకింకా తెలియదు" అన్నారు స్వామీజీ. రకరకాల శ్రోతలగురించి చెప్పి, వారికి తగినట్లు ఎలా మాట్లా డాలో తర్ఫీదునివ్వటం మొదలు పెట్టారు. ముసిముసినవ్వులు నవ్వే కాలేజీయువతులు, వృద్ధాశ్రమవాసు లు, వ్యాపారస్థుల సంఘం, అనారో గ్యస్థితిలో ఉన్న ఒక మిత్రుడు, తన యుని కోల్పోయిన తల్లి - ఈవిధంగా స్వామీజీ రకరకాల పరిస్థితులను కల్పించి, వాటికి తగినట్లు మాట్లాడ మని సవాలుచేసేవారు. ఉపన్యాసం తర్వాత, స్వామీజీ దానిని విమర్శిం చి తగిన సలహాలనిచ్చేవారు. ఒకసారి కుట్టి అనే విద్యార్థికి అసాధ్య మనిపించే శ్రోతలనిచ్చారు - అతడు నైటు క్లబ్బులోఉన్న శ్రోతలనుద్దేశిస్తు న్నట్లు ఊహిస్తూమాట్లాడాలి.అతడు కాని, సహవిద్యార్థులుకాని అటువం టి చోటికి ఎప్పుడూ వెళ్లిన పాపాన పోలేదు. ఐనప్పటికీ ధైర్యంగా ముందుకు వచ్చి అవస్థాత్రయం గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం ప్రారంభించాడతను. అతన్ని మధ్య లో ఆపి, "చూడు, నీచుట్టూ డాన్సు చేస్తున్న యువతులూ, తాగినమత్తు లో ఉన్న క్లబ్బు మేనేజరు ఉన్నారు. బీరు సీసాలు విసరటానికి సిద్ధంగా ఉన్నారందరూ, మూడు నిమిషాల్లో ఏం చెప్తావు?" అనిప్రశ్నించారు.
తర్వాత ఇంకా కొన్ని సూచన లిచ్చారు. "కూర్చొని మాట్లాడటం వచ్చింది మీకు. ఇక నిలబడి మాట్లా డటం నేర్చుకోవాలి." వాళ్ళు ఉపన్యా సం చెప్తుంటే గమనించి విమర్శించే వారు, అప్పుడప్పుడు వాళ్ళు చేతు లు నలుపుకోడాన్నీ, కాళ్ళు మారు స్తూ నిలబడటాన్నీ అనుకరిస్తూ. కాళ్ళను స్థిరంగా ఉంచి ఎలా నిల బడాలో చేసి చూపించారు. ఆవిధం గా, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో, దానిని ఎలా సరి దిద్దుకోవాలో ఉదాహరణలతో సహా వివరిస్తూ బాహ్యంగానూ, అంతరం గంలోనూ కూడా మంచి అధ్యాపకు లుగా తీర్చిదిద్దటం మొదలుపెట్టారు. ఇటువంటి పటిష్టమైన శిక్షణతర్వాత ఆ విద్యార్థులు అధ్యాపకవృత్తి చేపట్టి నపుడు, ఎలా నిలబడ్డారో, ఎలా మాట్లాడుతున్నారో అనే సంకోచం లేకుండా ధైర్యంగా ఉండి, వారు మాట్లాడాల్సిన శాశ్వతసత్యపు సందేశమే వారినుంచి అనర్గళంగా వెలువడటానికి సాధ్యపడుతుంది.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment