నేనెవరు? | నేతి - నేతి నుండి ఇతి - ఇతి వరకు ఆధ్యాత్మిక ప్రయాణం
Author Name:Jeeva Kamalam
Youtube Channel Url:https://www.youtube.com/@jeevakamalam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NKvdR2K4oTw
Transcript:
(00:03) పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే బహుదోస్తారే కృపయపా రే పాహిమురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
(00:49) గోవింద అనే నామంలో గో అంటే జ్ఞానం అనగా వేదాల ద్వారా తెలుపబడిన జ్ఞానం గోవిందుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు లేదా వేదాల ద్వారా తెలుసుకోగల పరమాత్మ అని అర్థం. మరి ఆ గోవిందుని ఎలా తెలుసుకోవాలి అజ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ఉన్న భేదం ఏమిటి? శంకరాచార్యుల అద్వైత వేదాంతం ప్రకారం గోవిందుడు అంటే మన లోపల ఉన్న ఆత్మ సత్యమేనా మనందరిలో ఎప్పుడో ఒకప్పుడు తలెత్తే అతి పెద్ద ప్రశ్న నేను ఎవరు? ఈ ప్రశ్న వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు కానీ ప్రపంచంలో సమస్త ఆధ్యాత్మిక రహస్యాలు ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతాయి.
(01:25) మనం పుట్టినప్పటి నుండి మనల్ని మనం ఒక పేరుతోనో ఒక శరీరంతోనో గుర్తిస్తూ ఉంటాం. కానీ శంకరాచార్యుల ప్రకారం ఇవన్నీ మారుతూ ఉంటాయి. మరి మారని నేను ఎవరు మనం ఈ దేహమా ఈ ఆలోచనలా లేక వీటన్నిటికీ అతీతమైన శక్త జగద్గురు ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని రామకృష్ణుల వారి బోధనలను మరియు ఉపనిషత్తుల సారాన్ని కలిపి ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం.
(01:54) జీవకమలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యనే వైశాఖ శుక్ల పంచమి నాడు జరుపుకున్న శంకరాచార్య జయంతిని గుర్తు తెచ్చుకుంటూ అటువంటి గొప్ప గురువు నడయాడిన ఈ పుణ్యభూమిలో పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆ మహాత్మునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ప్రేక్షకులకు గొప్ప జ్ఞానాన్ని అందించబోతుంది.
(02:18) కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఇందాక ఆధ్యాత్మిక ప్రయాణం అనుకున్నాం కదా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి ఇదే ప్రశ్న మా గురువుగారిని అడిగితే ఆది నుండి ఉన్న ఆత్మకథే ఆధ్యాత్మికత అని చెప్పారు. మనం ఈ శరీరమే అనుకుంటూ ఉన్నంత కాలం మనం ఒక చిన్న పరిధిలో బంధీలై ఉంటాం. ఒక శిల్పి ఒక బండరాయిని శిల్పంగా మార్చే క్రమంలో ఆ రాయిలో కొత్తగా దేన్ని చేర్చడు.
(02:42) కేవలం అనవసరమైన దాన్ని తొలగించుకుంటూ వెళ్తాడు. అప్పుడు అద్భుతమైన శిల్పం బయటపడుతుంది. అలాగే మనల్ని కమ్మేసిన అజ్ఞానాన్ని తొలగించుకుంటూ నేను కాదు అన్న వాటిని తీసివేస్తూ వెళ్తే నిజమైన నేను సాక్షాత్కరిస్తుంది. అదే ఆధ్యాత్మికత. సాధనలో మొదటి మెట్టు నేతి నేతి నేతి నేతి అనగా సంస్కృతంలో న ఇతి అంటే ఇది కాదు అని అర్థం.
(03:12) నేతినేతి విధానం బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడినప్పటికీ ఆదిశంకరాచార్యుల వారు అద్వైత బోధనలో ఈ విధానాన్ని ప్రధానంగా ఉపయోగించారు. ఇది ఒక నిరాకరణ పద్ధతి ఆత్మ లేదా బ్రహ్మం ఈ శరీరం మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవేవి కాదు అని విశ్లేషించి చివరికి మిగిలే సత్యాన్ని తెలుసుకోవడమే దీని ఉద్దేశం. ఇక్కడ ఈ విషయం బోధించడానికి గురువులు చెప్పే ఒక కథను చూద్దాం.
(03:38) శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతమ్మ అరణ్యవాసానికి బయలుదేరారు. 14 సంవత్సరాల వనవాసం ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే. అరణ్యవాసానికి వెళ్తూ ఉంటే ఆ అరణ్యంలో అక్కడక్కడ మునీశ్వరులు ధ్యానం చేసుకుంటున్నారట. కొందరు గృహస్తులు కూడా ఉన్నారు. అలా ఒక చోటకి వారు రాగా అక్కడున్న మునీశ్వరులంతా ఒక సభ పెట్టుకున్నారట. ఆ మహాసభలో ఉన్న ఎందరో మునీశ్వరులంతా కలిసి ఒకచోట కూర్చున్నారు.
(04:04) మునీశ్వరుల భార్యలు అందరూ ఇంకో చోట కూర్చున్నారు. అయితే శ్రీరామచంద్రుల వారు అక్కడికి వచ్చిన వెంటనే ఆ మునీశ్వరుల మధ్యలో వచ్చి కూర్చున్నారట. సీతమ్మేమో మహిళా సమాజం మధ్యలో కూర్చుందట. ఇంతలో ఒక ఆమె ఆలస్యంగా వచ్చి కొత్తగా వారి మధ్య వచ్చిన సీతమ్మను చూసి అమ్మ సీతమ్మ ఆలస్యంగా వచ్చిన కారణంగా నీ భర్త అయిన శ్రీరాముల వారిని నేను చూడలేదు.
(04:27) ఈ మునీశ్వరులంతా ఉన్న ఈ సభలో మీ భర్తగారు ఎవరో చూపించవమ్మ నేను నమస్కరించి దర్శనం చేసుకుంటాను అని అడిగిందంట అప్పట్లో ఫలానా వారు నా భర్త అని వేలు చూపించడం సంప్రదాయం కాదు కాబట్టి సీతమ్మ మౌనంగా ఉండిపోయిందంట మళ్ళీ ఆమె అడిగిన సీతమ్మ పలకలేదట అలా మూడు సార్లు అడిగినప్పటికీ సీతమ్మ పలకకపోవడంతో ఆమె ఇంకొక ఉపాయం ఆలోచించిందట ఎలాగైనా రామచంద్రుల వారిని దర్శనం చేసుకోవాలనే తప్పనతో అమ్మ సీతమ్మ ఆ మూల కూర్చున్న మునీశ్వరుడు నీ భర్త అని అడిగిందట అప్పుడు సీతమ్మ కాదు అన్నదట ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడే ఆయన నీ భర్త అంటే కాదు అన్నదట అలా అందరిని కాదు కాదు అని ఆఖరికి రామచంద్రుల
(05:12) వారి వద్దకి వచ్చేసరికి మౌనం వహించిందట కాదు కాదు అని నిరాకరిస్తూ పోతే చివరికి ఏదో అదే మిగిలిందట దీన్నే నేతి నేతి పద్ధతి అంటారు. భగవంతుని పొందాలంటే భగవంతుడు కానటువంటి నామరూపాలను ఇది కాదు ఇది కాదు అని పక్కన పెట్టాలి. శంకరాచార్యుల నిర్వాణ శకంలోని ఈ నేతినేతి విధానంలోనే మనల్ని మనం విశ్లేషించుకోమని చెప్పారు.
(05:37) మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచశ్రోత్రజిహ్వే నచగ్రాణ నేత్రే నచవ్యోమభూమేర్ణ తేజోనవాయుహు చిదానంద రూపః శివోహం శివోహం నేను మనసును కాను బుద్ధిని కాను అహంకారాన్ని కాను ఇంద్రియాలను కాను అనుకుంటూ ఈ పద్ధతిలో మనం మన దేహాన్ని ప్రాణాన్ని మనసును ఒక్కొక్కటిగా నేను కాదు అని పక్కన పెడతాం ఎందుకు ఎందుకంటే ఇవన్నీ మారుతూ ఉంటాయి.
(06:12) మారుతూ ఉంది అంటే అది నిజమైన నేను కాదు. నమే ద్వేష రాగవు నమే లోభ మోహం నాకు ద్వేషం లేదు రాగం లేదు లోభం లేదు మోహం లేదు ఈ వికారాలు ఏవి నేను కాను నేను ఈ ఆలోచనలను గమనిస్తున్నాను కాబట్టి నేను వీటికి అతీతుడను ఏ విధంగా అయితే బురదగా ఉన్న నీరు ఆ బురద కిందకు దిగిపోవడంతో స్వచ్ఛంగా ఎలా మారుతుందో ఇది నేను కాదు అని అన్ని పక్కన పెట్టినప్పుడు అసలైన నేను లేదా ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది.
(06:43) ఆ మారనటువంటి చైతన్యాన్ని పట్టుకోవడమే ఈ నేతి నేతి వివేచన ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యు ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి ఒకే కాంతి ఒకే శాంతి ఓం మహర్షి ఓం మహాత్మ ఇందాక ఆలోచనలను గమనిస్తున్న నేను అనుకున్నాం కదా మరి గమనించడం అంటే ఏంటి
(07:29) మనలోని ఈ స్థితిని మాండూక్య ఉపనిషత్తు ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది. ఒకే చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉంటాయి. ఒక పక్షి చెట్టుకున్న పండ్లను తింటూ తీపి తగిలినప్పుడు సంతోషిస్తూ చేదు తగిలినప్పుడు బాధపడుతూ ఉంటుంది. ఇది మన జీవాత్మ అంటే మన నిత్య జీవితంలోని సుఖ దుఃఖాలకు లోనయ్యే మన వ్యక్తిత్వం కానీ రెండో పక్షి ఏ పండును తినదు అది కేవలం మొదటి పక్షి చేస్తున్న ప్రతి పనిని నిశశబ్దంగా ప్రశాంతంగా గమనిస్తూ ఉంటుంది.
(07:59) ఇది మన సాక్షి చైతన్యం. మన వేదాంతం చెప్పే ఈ సాక్షి భావననే క్వాంటం ఫిజిక్స్ లో అబ్సర్వర్ ఎఫెక్ట్ అని అంటాం. జీవితంలో మనం ఎప్పుడైతే ఆ రెండో పక్షుల మనల్ని మనం గమనించడం మొదలు పెడతామో అంటే కర్మఫలాలను తినే పక్షిలా కాకుండా అంటే సుఖ దుఃఖాలను అనుభవించే పక్షి లేదా జీవాత్మ నేను కాదు కేవలం సాక్షి స్థితిలో ఉన్న రెండో పక్షి నేను అని తెలుసుకోవడమే నేతి నేతి సాధన సర్వ ఏనానుభూయంతే యస్వయం నానుభూయతే దేని చేత సర్వము అనుభవించబడుతున్నదో ఏది స్వయంగా తాను అనుభవించబడదో ఆ సర్వసాక్షి అగు దానిని నీ ఆత్మ అని అతి సూక్ష్మమైన బుద్ధితో ఎరుగుము అని శంకరులు
(08:41) వివేక చూడామనిలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నేను ఈ దేహాన్ని కాదు అని అనుకున్నంత మాత్రాన ఈ దేహం అవసరం లేదా అంటే దేహాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన మన దేహం ఒక దేవాలయం అన్ని కాదు అని తీసివేసిన తర్వాత మిగిలే సాక్షి చైతన్యం లేదా సచ్చిత్ ఆనందం తెలుసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనే ఎరుక కలుగుతుంది.
(09:11) కాబట్టి ఈ ఆత్మ ప్రయాణం సాగడానికి దేహం ఒక వాహనం లాంటిదే. ఎంతో మంది యోగులు సైతం శరీరాన్ని క్రమశిక్షణతో ఉంచుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఒక పటిష్టమైన పాత్ర ఉంటేనే అందులోని అమృతాన్ని నింపగలం. శంకరులు భజగోవిందంలో ఈ దేహం ఉన్నప్పుడే మనం పరమాత్మను చేరుకోవాలి అని చెప్పారు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లు నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః ఆత్మను ఏ శస్త్రం ఛేదించలేదు ఏ అగ్ని దహించలేదు నాశనం చేయలేదు కానీ ఆ ఆత్మను అనుభూతి చెందడానికి ఈ దేహం అనే ఆలయం అవసరం.
(09:46) ఆరోగ్యకరమైన దేహం ఉంటేనే మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలం. కాబట్టి దేహాన్ని గౌరవిస్తూ దేహ భావనను దాటి ఆత్మ భావనలోకి వెళ్ళాలి. నేతి నేనేతి విధానం ద్వారా నేను ఇది కాదు అని తెలుసుకున్న తర్వాత మిగిలేది శూన్యం కాదు అది అనంతం ఆస్తితే ఇతి ఇతి అంటే ఇది కూడా అదే ఉపనిషత్తులు మొదట నేతి నేనేతి ద్వారా పరమాత్మ కాని వాటిని తొలగించమని చెప్తాయి.
(10:17) ఆ తర్వాత మిగిలేదంతా బ్రహ్మమే అని చెప్పడమే ఇతి ఇతి సర్వం కల్విదం బ్రహ్మ ఈ కనిపించేదంతా బ్రహ్మమే అనే మహా వాక్యం దీనికి మూలం శంకరాచార్యుల వారు తన అద్వైత వేదాంతంలో మొదట జ్ఞానాన్ని సంపాదించడానికి అశాశ్వతమైన వాటిని తోసిపుచ్చుతూ సత్యాన్ని తెలుసుకునే నేతి నేతి అనే మార్గాన్ని వాడమన్నారు. ఇది ఎంత ప్రసిద్ధమో దానికి కొనసాగింపుగా ఇతి ఇతి అంటే ఇది కూడా అదే అనేది అంతకంటే లోతైన స్థితి.
(10:47) ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత సాధకుడు బ్రహ్మము ఇది కాదు అని అనడం మానేసి అంతా బ్రహ్మమే అని గుర్తిస్తాడు. దీన్నే ఇతి ఇతి అంటారు. దీని అర్థం ఇది కూడా ఆ పరమాత్మే అది కూడా ఆ పరమాత్మే అంటూ కనిపించే ప్రకృతి మనుషులు వస్తువులు అన్ని ఆ పరమాత్మ స్వరూపమే అని గుర్తిస్తారు. శ్రీ రామకృష్ణుల వారు దీనిని అత్యంత సులభంగా ఒక ఉదాహరణతో చెప్పారు. ఒక మెట్ల వరస ఎక్కేటప్పుడు మనం ప్రతి మెట్టును నేతి నేతి అంటే ఇది మేడ కాదు, ఇది మేడ కాదు అని దాటుకుంటూ పైకి వెళ్తాం.
(11:22) ఒక్కసారిగా మెడపైకి అంటే ఉన్నత స్థితికి వెళ్ళాక కింద ఉన్న మెట్లు ఇటుకలు ఇసుక అన్ని కూడా ఆ మేడ నిర్మించడానికి వాడినవే అని తెలుస్తుంది. అదే ఇతి ఇతి అంటే జ్ఞానోదయం కలిగిన వ్యక్తికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు ప్రతి మనిషి చివరికి తన దేహం కూడా ఆ పరమాత్మ యొక్క వ్యక్తీకరణే అని అభివ్యక్తమవుతుంది. శంకరులు వివేక చూడామనిలో బ్రహ్మమే సత్యం ఈ జగత్తు ఆ బ్రహ్మం యొక్క వ్యక్తీకరణే అని చెప్పారు.
(11:53) ఇదంతా వినడానికి ఒక ఫిలాసఫీలా ఉండొచ్చు కానీ నాకు ఈ మధ్య జరిగిన కొన్ని అనుభవాలు దీనిని నాకు నిజం చేశాయి. ఈ మధ్యనే నేను ఒక గురువుని కలిసి దీక్ష తీసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుండగా బస్సులో కూర్చొని చుట్టూ చూస్తుంటే నాకొక వింతైన అనుభూతి కలిగింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా ప్రతిబింబం లాగే కనిపించారు. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
(12:18) నేను వారు అనే భేదం మాయమై అందరిలో ఒకటే చైతన్యం ప్రతిబింబించింది. నిజానికి మనం విడివిడి వ్యక్తులుగా కనిపిస్తున్న పరమాణువుల స్థాయిలో మనమంతా ఈ విశ్వంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాం. సైన్స్ లో దీనినే క్వాంటం ఎంటైన్మెంట్ అని అంటారు. అదేరోజు ఇంకొక అనుభవం కూడా కలిగింది. ఒకచోట పడి ఉన్న పక్షి ఎముకలను చూసినప్పుడు అవి ఏదో పక్షివి కాదు నా శరీరంలో భాగాలే విరిగి అక్కడ పడి ఉన్నాయేమో అన్నంత బాధ కలిగింది.
(12:48) అది నేను వేరు కాదు అనే స్పృహ ఆ సమయంలో నాకు కలిగింది. ఆత్మ స్థాయిలో వేరు అనే భావన పోయింది. నేతి నేతి ద్వారా నేను ఈ శరీరాన్ని కాను అని ఎంత లోతుగా తెలుసుకుంటామో ఇతి ఇతి ద్వారా ప్రపంచమంతా నాలోనే ఉంది. ఆ పరమాత్మ చైతన్యమే నేను అనే ఎరుక అంత బలంగా కలుగుతుంది. అప్పుడు ఎదుటి ప్రాణి బాధ మన బాధగా మారుతుంది. గురువు మనకు అందించే జ్ఞానం ఒక బీజం లాంటిది.
(13:12) అది మనలో మొలకెత్తి ఈ విశ్వ రహస్యాలను విప్పుతుంది అని నాకు అర్థమైంది. గురు దర్శనం జరిగిన వెంటనే ఆ ఏకత్వ భావన నేను అనుభవంలోకి తెచ్చుకోగలిగాను. జ్ఞాని ఆత్మవత్ సర్వభూతాని అంటే ఇతర ప్రాణులను తన వలె భావిస్తాడు అన్న స్పృహ నాకు కలిగింది. ఇక్కడ వేదాంత పాఠాలు నేర్పడానికి గురువులు వాడే ఒక బోధనా కథ తెలుసుకుందాం. అద్వైత సిద్ధాంతంలో ఆత్మ సాక్షాత్కారం సర్వాంతర్యామి అనే భావనలను వివరించడానికి గురువులు ఈ పద్ధతిని వాడుతూ ఉంటారట ఒక గురువు వద్ద ఉన్న శిష్యుడు గురువర్య నాకు జ్ఞానం కావాలి మీరే తెలియజేయాలి అని అడుగుతారట. అప్పుడు ఆ గురువు దానికన్నా
(13:51) ముందు దేశాటన చేసి బయట అన్నిటిని పరిశీలించి రమ్మని చెప్తారు. అలా దేశాటన చేసి వచ్చిన శిష్యుడిని గురువు నువ్వు ఏం తెలుసుకున్నావు అని అడిగితే అహం బ్రహ్మాస్మి నాలోనే దైవం ఉన్నాడని చెప్పి ఈ శరీరం తనది కాదు అంటూ తనలో ఉన్న ఆత్మే దైవం అని గుర్తించినట్లుగా తెలియజేస్తాడు. గురువు మళ్ళీ దేశాటన చేసుకొని తిరిగి రా అని శిష్యుడిని రెండోసారి పంపిస్తారు.
(14:17) ఆ కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన శిష్యుడిని ఈసారి ఏం నేర్చుకున్నావు అని అడగగా దైవం నాలోనే కాదు సృష్టిలో ప్రతి జీవిలో ప్రతి అణువులో ఉంది. అందరూ దైవ స్వరూపాలే అని శిష్యుడు చెప్తాడు. ఇది తత్వమసి అంటే అది నీవే ఆ దైవమే వీరంతా అనే జ్ఞానాన్ని సూచిస్తుంది. అంటే శిష్యుడు ఈసారి తనలో ఉన్న దైవమే ఎదుటివారిలో కూడా ఉందని గుర్తించి ఏకత్వాన్ని గ్రహించగలిగాడు.
(14:45) బాగుంది మళ్ళీ వెళ్లిరా అని మూడవసారి గురువు శిష్యుడిని పంపిస్తారు. ఈసారి తిరిగి వచ్చిన శిష్యుడిని ఏం తెలుసుకున్నావు అని ప్రశ్నించగా అతడు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే శిష్యుడు లోపట బయట అని కాకుండా ఉన్నదంతా ఆ దైవమే అని సముద్రంలో నీటి బొట్టుల తాను కూడా ఆ దైవంలో భాగమే అని కలిసిపోతాడు. ఇది సర్వం కల్విదం బ్రహ్మ అనే అంతిమ స్థితి.
(15:11) పై కథను బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే సాధనలో ముందుగా మనం మనలో ఉన్న దైవాన్ని గుర్తిస్తాం. ఇది జ్ఞానం. ఆ తర్వాత సృష్టిలో ఉన్న అందరిలోనూ అన్నిటిలోనూ అదే దైవం ఉంది అని గ్రహిస్తాం. ఇది విజ్ఞానం. చివరిగా ఉన్నదంతా ఆ సృష్టికర్తే అని తెలుసుకొని ఇక మౌనంగా ఉండిపోతాం. ఇది ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అందుకే కృష్ణుడు అంటారు వాసుదేవః సర్వమితి సమహాత్మ సుదుర్లభః అంతా వాసుదేవుడే అని తెలుసుకున్న మహాత్ముడు దొరకడం చాలా అరుదట.
(15:44) అటువంటి గొప్ప గురువు నాకు దొరికారు. ఆయనే డాక్టర్ శ్రీ హరికృష్ణ గారు ఇటువంటి గొప్ప విషయాలను ఆయన ద్వారా గ్రహించే అవకాశం నాకు కలిగినందుకు ఈ వీడియో రూపకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాధన చేయడం ఒక యోగం ఆ యోగంలో పరమాత్మతో కలేక చెందినప్పుడు మనకు అంతటా ఉన్నది ఆ పరమాత్మే అనే తత్వం అర్థంఅవ్వడం ద్వారానే ఆ ఏకత్వ భావన కలుగుతుంది.
(16:09) ఏ మనిషియైనా ఈ యోగం లేదా కలవడం మూలంగానే గెలవడం జరుగుతుంది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్య జ్ఞాన వైరాగ్య సిద్యర్థం భిక్షాందేహీచ పార్వతి అని అన్నపూర్ణ దేవిని ప్రార్థించారు. మనం దేవుణ్ణి కోరాల్సింది కోరికలు కాదు ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అనవసరమైన వాటిని వదిలివేయడానికి వైరాగ్యం ఈ రెండు సిద్ధించినప్పుడే మన ప్రయాణం సంపూర్ణమవుతుంది.
(16:34) ఈ ప్రయాణంలో గురువు ఒక వెలుగు వంటివారు. గురుదర్శనం తర్వాత నాకు కలిగిన ఆ ఏకత్వ అనుభూతి కూడా ఈ జ్ఞాన వైరాగ్యాల ఫలితమే అని నేను నమ్ముతున్నా. ఆ రోజు గురువుగారి ముందు కూర్చుని ధ్యానం చేసినప్పుడు అంతులేని ఆనందం ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియలేదు. లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిని సమస్త వేదాంతాలు నేతి నేతి అని వెతికి చివరకు దేనిని తెలుసుకుంటాయో ఆ సత్యమే లలితాదేవి ఆమె కేవలం ఒక రూపం మాత్రమే కాదు మనలో సత్యం మరియు ఆనందం.
(17:09) తర్కం ద్వారా లేదా పుస్తక జ్ఞానం ద్వారా ఆమెను అందుకోలేము. ఆత్మ విచారణ ద్వారా మాత్రమే ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అనుభూతి చెందగలం. మనిషి నేర్చిందంతా విస్మరిస్తేనే గాని అసలు స్వరూపం కనిపించదు అని రమణ మహర్షి తెలిపారు. అన్నిటిని వదిలిన మనసే సత్య మార్గం చూపగలదు అని శ్రీ జిడ్డు కృష్ణమూర్తి వారు చెప్పారు. అనుభవంలో నుంచి శాస్త్రాలు వచ్చాయే కానీ శాస్త్రాల వల్ల అనుభవం కలగదు అని శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు తెలిపారు.
(17:34) జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకు నేర్పింది నీవే బ్రహ్మము అది తెలుసుకోవడమే మోక్షం. ఇటువంటి గొప్ప గురువులను ఈ వీడియో రూపంగా స్మరించుకోవడం గురు అనుగ్రహంగా భావిస్తున్నాను. మీరు కూడా మీ అంతర్ ప్రయాణంలో సత్యజ్ఞాన ఆనంద స్వరూపిని అయిన ఆ సాక్షి చైతన్యంను కనుగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
(17:55) శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. శంకరం శంకరాచార్యం. కేశవం బాదరాయణం. సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః యద్వారే నిఖిలానిలింప పరిషత్ సిద్ధిం విదత్తేనిషం శ్రీమత్ శ్రీలసితం జగద్గురుపదం నత్వాత్మా తృప్తిం గతః లోకాజ్ఞాన పయోధపఠనధురం శ్రీ శంకరం శర్మదం బ్రహ్మానంద సరస్వతీంచ శ్రీ బ్రహ్మంధా
(18:41) ాయామి జ్యోతిర్మయం
No comments:
Post a Comment