Tuesday, November 24, 2026

OSHO - ప్రశాంతంగా ఉండండి, అప్పుడే పనులు జరుగుతాయి | Osho motivational speech in Telugu

OSHO - ప్రశాంతంగా ఉండండి, అప్పుడే పనులు జరుగుతాయి | Osho motivational speech in Telugu

Author Name:Telugu Advice 2.O

Youtube Channel Url:https://www.youtube.com/@teluguadvice

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gc9-VOpkkww





Title: OSHO - ప్రశాంతంగా ఉండండి, అప్పుడే పనులు జరుగుతాయి | Osho motivational speech in Telugu

Author Name: Telugu Advice 2.O

Description: OSHO - ప్రశాంతంగా ఉండండి, అప్పుడే పనులు జరుగుతాయి | Osho motivational speech in Telugu

ఈ వీడియోలో ఓషో బోధనలను తెలుగులో విశ్లేషించడం జరిగింది. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మరియు మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో వివరించబడింది. ఆధ్యాత్మిక చింతన మరియు జీవిత సత్యాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ Osho telugu speech చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

జీవితంలో స్పష్టత కోసం మరియు మనశ్శాంతి కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. Osho wisdom ద్వారా మీ దైనందిన జీవితంలో సానుకూల మార్పులను ఎలా తీసుకురావచ్చో అర్థం చేసుకోండి. ఈ చర్చలో పేర్కొన్న అంశాలు మీ అంతర్గత ఎదుగుదలకు తోడ్పడతాయి.

ప్రతి వారం ఇటువంటి ఆధ్యాత్మిక మరియు జీవిత పాఠాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నచ్చిన ముఖ్యమైన అంశం ఏమిటో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.

Disclaimer: The visuals used in this video, including AI-generated images and stock footage, are included solely for illustrative purposes to make the topic easier to understand.

Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి అప్పుడే ఏ పనైనా పూర్తవుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్ లైన్లా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న రహస్యం చాలా లోతయింది. ప్రతి ఒక్కరు తమ పనులు పూర్తఅవ్వాలని తమ గోల్స్ రీచ్ అవ్వాలని తమ కలలు నిజం కావాలని కోరుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు తొందర పడటం వల్ల కోపం తెచ్చుకోవడం వల్ల ఎమోషన్స్ కి లోన్ అవ్వడం వల్ల లేదా యంజైటీలో తప్పుడు డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఎన్నిసార్లు మీ పనులు చెడిపోయాయి.
(00:29) ప్రశాంతంగా ఉండటం అంటే కేవలం సైలెంట్ గా ఉండటం కాదు అది ఒక ఆర్ట్ ఆర్ట్ లో మాస్టర్ అయిన వాళ్ళ ముందు ఈ ప్రపంచం తలవంచుతుంది. ఒక్కసారి గమనించండి సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంటుంది. గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు ఒక పడవ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిశశబ్దంగా తన గమ్యాన్ని చేరుకుంటుంది.
(00:52) మన మైండ్ కూడా అంతే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన గోల్ ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. అదే మనసు అశాంతిగా ఉంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ నే క్రియేట్ చేస్తుంది. క్లియర్ గా ఉన్న విషయం కూడా చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది. ఈజీగా ఉన్న పని కూడా కష్టంగా అనిపిస్తుంది. చివరికి సాధ్యమయ్యేది కూడా అసాధ్యంగా మారిపోతుంది. ఇప్పటి ప్రపంచంలో ప్రశాంతంగా ఉండటమే అసలైన సక్సెస్ ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంది.
(01:18) బయట మనుషుల గోల, ఫోన్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా నోటిఫికేషన్ల గోల. ఇవి చాలవన్నట్టు మన లోపల ఆలోచనలు, భయాలు, ఎమోషన్స్ చేసే గోల. ఈ అన్ని రకాల సౌండ్స్ మధ్య మన మనసు ఏం కోరుకుంటుందో వినడమే మర్చిపోతున్నాం. ప్రశాంతత అనేది ఏ amazమon లోనో వెకేషన్ కి వెళ్తేనో దొరికే ప్రొడక్ట్ కాదు. అది మన లోపల క్రియేట్ చేసుకునే ఒక స్టేట్ ఆఫ్ మైండ్.
(01:41) చాలామంది నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటారు. కానీ లైఫ్ రూల్ దీనికి పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. నువ్వు ముందు ప్రశాంతంగా ఉంటేనే నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ మైండ్సెట్ ని ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్లే లైఫ్ లో రియల్ విన్నర్స్ కష్ట సమయాల్లో మీరు ఎలా ప్రవర్తిస్తారు అనేదే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
(02:01) అంతా సంతోషంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం చాలా ఈజీ. అందరూ గౌరవిస్తున్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటం సులభమే కానీ పరిస్థితులు తలకిందులు అయినప్పుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు మీ మాట ఎవరూ విననప్పుడు ఈ ప్రపంచంంతా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటమే మీకు ఎదురయ్యే అతి పెద్ద పరీక్ష. ఒక్క విషయం గుర్తుంచుకోండి యంజైటీ మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు దారిలోకే నడిపిస్తుంది.
(02:28) మనసు కంగారుగా ఉన్నప్పుడు అది దేన్ని స్పష్టంగా చూడలేదు. సరిగ్గా ఆలోచించలేదు. చివరికి మన కళ్ళ ముందున్న అపర్చునిటీస్ ని కూడా చేజార్చుకుంటాం. ప్రశాంతత అనేది మీ బలం బలహీనత కాదు ప్రశాంతంగా ఉండేవాళ్ళు బలహీనులని ఈ ప్రపంచం తప్పుగా అర్థం చేసుకుంది. కానీ అసలు నిజం ఏంటంటే తమను తాము కంట్రోల్ లో ఉంచుకోగలిగిన వాళ్లే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలరు.
(02:51) తమను తాము గెలిచిన వాళ్లే ఈ ప్రపంచాన్ని గెలవగలరు. మరి ఈ ప్రశాంతత ఎలా వస్తుంది? తలనొప్పి రాగానే వేసుకోవడానికి అది ఏదో మెడికల్ షాప్ లో దొరికే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కాదు. అదిఒక డైలీ ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ పేరే యోగా యోగా అంటే కేవలం బాడీని వంచడం కాదు మన మైండ్ ను అర్థం చేసుకునే ఒక క్లారిటీ ఇందులో ఫస్ట్ స్టెప్ చాలా సింపుల్ జస్ట్ మీ శ్వాసను గమనించడం మొదలు పెట్టు మీ బ్రెయిన్ ఓవర్ థింకింగ్ తో ఫుల్ స్పీడ్ లో పరిగెడుతున్నప్పుడు స్ట్రెస్ తో బాడీ అంతా టైట్ అయిపోయినప్పుడు ఒక్క నిమిషం పాజ్ బటన్ నొక్కండి.
(03:23) జస్ట్ రెండు సార్లు డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా వదలండి. ఆ ఒక్క మూమెంట్ లోనే మీ మైండ్ ఎంత రిలాక్స్ అవుతుందో మీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి ఆ రెండు సెకండ్ల బ్రీతింగ్ కోపంలో లేదా కంగారులో మీరు తీసుకోబోయే ఒక పెద్ద రాంగ్ డెసిషన్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక రెండో స్టెప్ లెట్ గో చేయడం నేర్చుకోండి. అంటే గతాన్ని వదిలేయండి.
(03:45) మన మైండ్ ఎప్పుడూ పాత మెమోరీస్ ని పాత బాధల్ని రీప్లే చేస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు నన్ను అలా అన్నారు నాకు రావాల్సిన ఛాన్స్ లాక్కున్నారు నన్ను హర్ట్ చేశారు ఇలాంటి పాత విషయాలనే పట్టుకొని వేలాడతాం. గుర్తుపెట్టుకోండి గతం అనేది ఒక హెవీ లగేజ్ లాంటిది. ఆ బరువును భుజాలపై మోస్తూ మీరు లైఫ్ లో ఎప్పటికీ పైకి ఎగరలేరు. ఇక మూడో రూల్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం ఆపేయండి.
(04:06) జనాలు ఏమనుకుంటారు వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారా అని ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మనపై వచ్చే ప్రతి నెగిటివ్ కామెంట్ తో ప్రతి మాటతో ఫైట్ చేయడం మొదలు పెడితే మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. కొన్నిసార్లు జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ గా ఉండిపోవడమే బెస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి కొన్ని సిచువేషన్స్ లో మీ సైలెన్స్ కంటే పవర్ఫుల్ రిప్లై ఇంకొకటి ఉండదు.
(04:32) నాలుగవ స్టెప్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం నేర్చుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారు. కానీ తమను తాము మార్చుకోవడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మార్చుకోవడం మొదలు పెడతారో అప్పుడే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ప్రశాంతంగా మారడం మొదలవుతుంది. ఎందుకంటే బయట మనకు కనిపించేదంతా మన లోపల జరుగుతున్న దాని ప్రతిబింబమే ఇక ఐదవ స్టెప్ నమ్మకం కలిగి ఉండటం నేర్చుకోండి.
(04:58) నాకు జరగాల్సింది రైట్ టైం కి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మే మైండ్ మాత్రమే పీస్ ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడూ కంగారుపడే వాళ్ళలో ఆ నమ్మకం అస్సలు ఉండదు గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే నమ్మకం ఉండదో అక్కడ మనం తీసుకునే ప్రతి స్టెప్ భయం నుంచే పుడుతుంది. అండ్ భయం నుండి పుట్టే ఏ పనైనా మనల్ని ఎప్పుడూ రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది.
(05:19) ఒకసారి ఆలోచించండి ఒక రైతు పొలంలో విత్తనాలు నాటిన తర్వాత అవి మొలకెత్తాయో లేదో చూడటానికి మరుసటి రోజే మళ్ళీ మట్టిని తవ్వి చూడు ఎందుకంటే ఆ విత్తనం మొలకెత్తడానికి కొంత సమయం పడుతుందని అతనికి తెలుసు అతను ఓపికతో ఎదురు చూస్తాడు జీవితం కూడా అంతే ఇప్పుడు మీ పని మీరు చేయండి సరైన సమయం వచ్చినప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది.
(05:40) మీరు పని చేయడానికి ఆ ఫలితం రావడానికి మధ్య ఉన్న సమయమే మీరు ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. అసలు కోపం అంటే ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అది కేవలం మన ఎనర్జీ అదుపు తప్పి ఒక్కసారిగా బయటకు పేలడం. యంజైటీ అంటే ఏంటి మన ఊహలు సృష్టించే ఒక తుఫాన్ బాధ అంటే ఏంటి ఇంకా రాని ఫ్యూచర్ ని ఇప్పటికిప్పుడు మనసులోకి లాక్కోవడం కానీ ప్రశాంతత అంటే ఏంటి? గతం తాలూకు అడ్డంకులు లేకుండా ఫ్యూచర్ గురించిన భయాలు నీడలా వెంటాడకుండా పూర్తిగా ఈ ప్రెసెంట్ మూమెంట్ లో జీవించడం.
(06:12) మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోగలరు. ఎమోషన్స్ లో యంక్జైటీలో దాగి ఉన్న అసలు మెసేజ్ ని మీరు స్పష్టంగా వినగలరు. ప్రశాంతమైన మనసులోనే నిజమైన జ్ఞానం వికసిస్తుంది. ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారు. ఎందుకంటే అన్నింటికీ సమాధానం మన లోపల నుండే వస్తుంది. బయట నుండి కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటం అంటే పోరాటం ఆపేయడం కాదు.
(06:38) దాని అర్థం సరైన సమయంలో సరైన దారిలో ఎలాంటి హడావుడి లేకుండా మనసు చెదిరిపోకుండా కుంగిపోకుండా ముందుకు సాగడం. సూర్యుడు ప్రతిరోజు ఎలాంటి సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉదయించి ప్రపంచంలోని చీకటినంతా తరిమికొడతాడు. మన లైఫ్ కూడా అంతే మనకు ఎదురయ్యే ప్రతి సిచువేషన్ మన ముందు రెండు ఆప్షన్స్ పెడుతుంది. ఆప్షన్ వన్ ఆవేశపడి కంగారులో ఆ ప్రాబ్లం మిమ్మల్ని కొట్టుకుపోయేలా చేయడం.
(07:03) ఆప్షన్ టూ సూర్యుడిలా ప్రశాంతంగా ఉండి ఆ సిచువేషన్ ని మీ కంట్రోల్ లోకి తీసుకోవడం ఛాయిస్ ఎప్పుడూ మీ చేతిలోనే ఉంటుంది. తన మనసును తన కంట్రోల్ లో ఉంచుకున్నవాడే తన జీవితానికి కూడా యజమాని అవుతాడు. తన లోపల ప్రశాంతతను నింపుకున్న వ్యక్తిని బయటి ప్రపంచం ఏమీ చేయలేదు. బయట తుఫాను వస్తే కొంత నష్టం మాత్రమే జరుగుతుంది.
(07:24) కానీ మన లోపలే తుఫాను మొదలైతే జీవితం అనే ఓడ పూర్తిగా మునిగిపోతుంది. అందుకే ప్రశాంతత అనేది ఏదో ఒక ప్రాక్టీస్ మాత్రమే కాదు అది జీవితానికి అత్యంత అవసరం. కొన్నిసార్లు సముద్రంలా ఉండండి. పైన ఎన్ని అలలు ఎగసి పడుతున్నా లోపల మాత్రం పూర్తి నిశశబ్దంగా ఉండండి. కొన్నిసార్లు ఒక పర్వతంలా ఉండండి. ఎంత బలమైన గాలులు వీచినా మీ పునాది మాత్రం కదలకుండా స్థిరంగా ఉంచండి.
(07:50) కొన్నిసార్లు ఆకాశంలో ఉండండి. ఎన్ని దట్టమైన మేఘాలు కమ్ముకున్నా మీ మంచితనాన్ని ఏమాత్రం తగ్గించుకోకండి. మీరు లోపల స్థిరంగా ఉన్నప్పుడే మీరు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. స్థిరత్వం అంటే కేవలం ఒక మైండ్ సెట్ మాత్రమే కాదు అది మీ జీవితానికి అసలైన బలం. ఈ నిజాన్ని మీరు అర్థం చేసుకున్న రోజు మీ ముందున్న ప్రతి తలుపు దానంతటి అదే తెరుచుకుంటుంది.
(08:12) మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే అసలైన పవర్ మన లోపలి నిశశబ్దంలోనే దాగి ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీలో ఒక తెలియని శక్తి మేల్కుంటుంది. ఎలాంటి ఛాలెంజ్ ఎదురైనా మిమ్మల్ని తడబడకుండా నిలబెడుతుంది. మన మనసులో ఉండే ఆందోళన ఎప్పుడూ బయట ప్రపంచం వైపే పరిగెడుతూ ఉంటుంది. బయటి వస్తువుల్లో బయటి మనుషుల్లో ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది.
(08:38) కానీ నిశశబ్దం మాత్రం మనల్ని మన లోపలికి నడిపిస్తుంది. ఆందోళన మిమ్మల్ని ఈ బయట ప్రపంచపు మాయలో బంధిస్తే ఆ లోపలి నిశ్శబ్దం మిమ్మల్ని తిరిగి మీ దగ్గరికి మీ అసలైన వ్యక్తిత్వానికి చేరుస్తుంది. ఒక్కసారి గమనించండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం కూడా ఒక చిన్న పరిస్థితి కూడా మీకు కొత్త దారిని చూపిస్తుంది. కానీ మనసు అశాంతిగా ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు లక్ష ఆపర్చునిటీస్ ఉన్నా సరే అవి మీకు సరిగ్గా కనిపించవు.
(09:05) ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. బయట ఉండే గందరగోళం దేన్ని నాశనం చేయదు. ఎప్పుడు మన లోపల ఉండే గందరగోళమే అన్ని నాశనం చేస్తుంది. లోపలి గందరగోళం అంటే యాంజైటి లోపలి గందరగోళం అంటే కోపం. లోపలి గందరగోళం అంటే డౌట్ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంతకుముందు ఎంతో కష్టంగా అనిపించిన పరిస్థితులు కూడా ఒక్కసారిగా ఈజీగా కనిపిస్తాయి. ఎందుకంటే అప్పుడు మీకు అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది.
(09:31) ఆ క్లారిటీనే సక్సెస్ కి అసలైన రహస్యం. ఒక మహానుభావుడు దీని గురించి చాలా గొప్పగా చెప్పారు. లైఫ్ లో ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ నువ్వు గనుక నీ మైండ్ మీద నీ ఎమోషన్స్ మీద సెల్ఫ్ కంట్రోల్ సాధిస్తే మిగతా సక్సెస్ అంతా వాటంతటవే నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే నిన్ను నువ్వు గెలవడమే అన్నిటికంటే పెద్ద సక్సెస్.
(09:56) ఇక్కడ కంట్రోల్ అంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ కి గురి చేసుకోవడం కాదు. కంట్రోల్ అంటే ఎప్పుడూ అవేర్నెస్ తో ఉండటం. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి నేను ఏం ఆలోచిస్తున్నాను నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని ఇలా మిమ్మల్ని మీరు గమనించుకోవడం మొదలు పెడితే క్రమంగా మీ మనసు ప్రశాంత పడుతుంది.
(10:15) ప్రశాంతంగా ఉండే వాళ్ళు ఏదో మ్యాజిక్ చేయరు. వాళ్ళు కేవలం తమ మనసును పాడుకానివ్వరంతే వాళ్ళు పరిస్థితులకు బానిసలు కారు వాళ్ళు ఎమోషన్స్ కి బానిసలు కారు. వాళ్ళు తమ ఎనర్జీని బయట విషయాల మీద అనవసరంగా ఖర్చు చేయరు. తమ లోపలే ఫోకస్ పెడతారు. ఇంకో విషయం గుర్తుంచుకోండి జీవితంలో పోరాటం అనేది చాలా అవసరం. ఒకవేళ జీవితంలో ప్రతిది సులభంగా దొరికితే అసలు ఛాలెంజెస్ఏ లేకపోతే ప్రతి అడుగు ఈజీగా ఉంటే అప్పుడు మీ మనసుకు నిజమైన పరీక్ష ఎప్పటికీ జరగదు.
(10:45) మిమ్మల్ని మీరు ఏంటో తెలుసుకోవడానికే జీవితంలో కష్టాలు వస్తాయి. లైఫ్ లో వచ్చే కష్టాలు మిమ్మల్ని కింద పడేయడానికి రావు. మీ మెంటల్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో టెస్ట్ చేయడానికి వస్తాయి. లోతుగా పాతుకుపోయిన వేర్లు ఎప్పుడూ కూల్ గా కామ్గా ఉంటాయి. ఎందుకంటే బయట ఎంత పెద్ద తుఫాను వచ్చినా తట్టుకొని నిలబడగలమనే కాన్ఫిడెన్స్ వాటికి ఉంటుంది.
(11:05) ప్రశాంతత అంటే బలహీనత కాదు. ప్రశాంతంగా ఉండే వ్యక్తి బయటకు ఎంత కామ్గా కనిపిస్తాడో లోపల కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాడు. ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఓటం ఎదురైనా బాధపడుతూ అక్కడే ఆగిపోడు. దాని నుంచి ఏం నేర్చుకోవాలో ఆలోచించి మళ్ళీ ప్రయత్నిస్తాడు. కానీ మనసులో ప్రశాంతత లేని వ్యక్తి చిన్న ఓటమి ఎదురైనా ఇక తన వల్ల ఏమీ కాదని నిరాశ పడతాడు.
(11:28) ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఎవరైనా తనను విమర్శిస్తే అందులో తన తప్పు ఏమైనా ఉందా అని ఆలోచిస్తాడు. కానీ ప్రశాంతంగా లేని వ్యక్తి తన తప్పును సరిదిద్దుకోవడానికి బదులు విమర్శించిన వాళ్ళపైనే కోపం తెచ్చుకుంటాడు. అలాగే ప్రశాంతంగా ఉండే వ్యక్తి తనకు వచ్చిన అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకుంటాడు. కానీ ప్రశాంతంగా లేని వ్యక్తి భయం అయోమయం అతిగా ఆలోచించడం వల్ల తన ముందున్న అవకాశాలను కూడా చేజార్చుకుంటాడు.
(11:55) ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఏ రోజైతే మీరు మీ జీవిత బాధ్యతను పూర్తిగా తీసుకుంటారో ఆ రోజు నుండి ఈ ప్రపంచాన్ని హ్యాండిల్ చేయడం మీకు అస్సలు కష్టంగా అనిపించదు. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మాత్రమే మీ ఇన్నర్ వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుంది.
(12:18) ఆ వాయిస్ మిమ్మల్ని ఎప్పటికీ రాంగ్ రూట్ లో తీసుకెళ్ళదు. నిజానికి మీ లైఫ్ కు అదే అసలైన గైడ్ కానీ ఒక్క కండిషన్ మీ మైండ్ లో ఓవర్ థింకింగ్ అనే సౌండ్ ఆగిపోయి కంప్లీట్ సైలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ గొంతు మీకు వినిపిస్తుంది. అందుకే అసలైన గొప్ప యుద్ధాలు కత్తులతో కాదు మన లోపలే జరుగుతాయి. ఈ యుద్ధం భయానికి ధైర్యానికి మధ్య యంజైటీకి కాన్ఫిడెన్స్ కి మధ్య కోపానికి సహనానికి మధ్య జరుగుతుంది.
(12:44) ఈ యుద్ధంలో గెలవడానికి మన దగ్గర ఉన్న అతి పెద్ద ఆయుధం ప్రశాంతమైన మనసు జీవితంలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. వాటిలో చాలా వరకు మీరు తొందరపాటులో ఉన్నప్పుడు జరిగినవే. ఎన్నిసార్లు కోపంలో మాటలు అనేసి ఆ తర్వాత బాధపడ్డారు ఎన్నిసార్లు భయంతో వెనక్కి తగ్గి ఆ తర్వాత అసలు భయపడాల్సిన అవసరమే లేదని తెలుసుకున్నారు.
(13:06) కోపం మీ జ్ఞానపు తలుపులను మూసేస్తుంది. యంజైటీ మిమ్మల్ని గుడ్డివారిగా చేస్తుంది. తొందరపాటు మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపిస్తుంది. కానీ ప్రశాంతత మీ కళ్ళ ముందున్న ఆ పొగమంచును తొలగిస్తుంది. మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏదో వీకెండ్ లోనో ఖాళీగా ఉన్నప్పుడో ఎంచుకునే ఒక ఆప్షన్ కాదు అదిఒక లైఫ్ స్టైల్.
(13:27) మనం రోజు నిద్రలేవడం తినడం ఎంత నాచురల్ గా చేస్తామో ప్రశాంతంగా ఉండటాన్ని కూడా ప్రతిరోజు ఒక డైలీ హ్యాబిట్ లా మార్చుకోవాలి. ఈ ప్రశాంతత ఒక్క క్షణంలో ఏర్పడేది కాదు కానీ మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక్క క్షణంలో నాశనమైపోతుంది. అందుకే ప్రశాంతంగా ఉండటాన్ని ఒక హ్యాబిట్ గా మార్చుకోండి. ప్రతిరోజు ఉదయం, రాత్రి కొన్ని నిమిషాల పాటు బయట ప్రపంచానికి మర్చిపోయి మీతో మీరు గడపడం నేర్చుకోండి.
(13:52) ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి కళ్ళు మూసుకోండి. ఆ కొన్ని నిమిషాలు మిమ్మల్ని తప్ప బయట ప్రపంచంలో ఎవరిని దీన్ని పట్టించుకోకండి. దీన్ని ఏదో పెద్ద మెడిటేషన్ అని భయపడకండి. ఇది జస్ట్ రోజంతా మీ మైండ్ మీద పేరుకుపోయిన దుమ్మును దులుపుకోవడం లాంటిది. మన బాడీకి ఆహారం శ్వాస ఎంత అవసరమో మన మైండ్ కి కూడా ప్రతిరోజు ఈ ప్రశాంతత అంతే అవసరం. మీకు ఒక విషయం తెలుసా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం కూడా మీతో పాటు మారడం మొదలవుతుంది.
(14:20) చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఆగిపోయిన పనులు వాటంతటవే జరగడం మొదలవుతాయి. కొత్త దారులు కనిపిస్తాయి. అప్పటివరకు అస్సలు సాధ్యం కాదని మీరు అనుకున్న విషయాలు కూడా ఒక్కసారిగా పాసిబుల్ అయినట్లు అనిపిస్తాయి. ఒక్క నిజం గుర్తుపెట్టుకోండి. ఈ యూనివర్స్ మొత్తం ఒక స్టేబుల్ సెంటర్ చుట్టూనే తిరుగుతుంది. మన లైఫ్ కూడా అంతే.
(14:40) మీరు లోపల ఎంత స్ట్రాంగ్ గా గ్రౌండెడ్ గా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అంతే బాలెన్స్ ఇస్తారు. టెన్షన్ ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతుందో ప్రశాంతత కూడా అంతే త్వరగా స్ప్రెడ్ అవుతుంది. మీరు కూల్ గా ఉంటే మీ చుట్టూ ఉన్న వైబ్ మొత్తం ఆటోమేటిక్ గా ప్రశాంతంగా మారిపోతుంది. ఒక చిన్న కొవ్వొత్తి గదిలోని చీకటినంతా తరిమికొడుతుంది. కేవలం అది వెలుగుని ఇస్తుంది కాబట్టే కాదు తన ఉనికి ఏంటో దానికి తెలుసు కాబట్టి అది కంగారుపడదు అటు ఇటు పరుగెత్తదు.
(15:05) తన స్థానంలో తాను నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. వెలిగించినప్పుడు వెలుగును పెంచుతుంది. కానీ ఆరిపోతామనే భయం లేని మనసును మీలో పెంపొందించుకోండి. ప్రశాంతంగా ఉండటం అంటే ఎదురయ్యే ప్రతి సిచువేషన్ ని కొంచెం దూరం నుండి గమనించడం. ఎమోషన్స్ లో కొట్టుకుపోకుండా పూర్తి అవగాహనతో చూడటం. మీరు ఇలా చేయడం మొదలు పెట్టినప్పుడు మీరు తీసుకునే ప్రతి డెసిషన్ లోనూ ఒక పరిపక్వత ఉంటుంది.
(15:30) ఆ జ్ఞానం మిమ్మల్ని ఎప్పటికీ తప్పుడు దారిలో నడిపించదు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రమంగా ఈ ప్రశాంతతే మీ అసలైన ఐడెంటిటీగా మారిపోతుంది. చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు ఇంత కూల్ గా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని జనాలు మిమ్మల్ని అడగడం మొదలు పెడతారు. అప్పుడు మీరు చిన్నగా నవ్వి చాలా సింపుల్ గా ఒక మాట అంటారు.
(15:50) ఈ తుఫాను ఎంతోసేపు ఉండదు. కచ్చితంగా వెళ్ళిపోతుందని నాకు తెలుసు. తుఫాన్ రాకముందు నేను ఎలా ఉన్నానో అది వెళ్ళిపోయాక కూడా నేను అలాగే ఉంటాను. ఇదే జీవితం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి లైఫ్ లో వచ్చే సిచువేషన్స్ గాని మనలో కలిగే ఎమోషన్స్ గాని ఏవి పర్మనెంట్ కాదు అన్ని టెంపరరీ మరి పర్మనెంట్ గా ఉండేది ఏంటంటే ఎంతటి టఫ్ సిచువేషన్ అయినా తట్టుకొని కూల్ గా నిలబడే మీ ఇన్నర్ స్ట్రెంత్ ప్రతి ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకొని గ్రో అయ్యే మీ మైండ్సెట్ మాత్రమే అందుకే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో అదే మీ బిగ్గెస్ట్ అసెట్ ఈ
(16:25) రోజుల్లో ప్రతి ఒక్కరు మనీ కోసం పరిగెడుతున్నారు సక్సెస్ కోసం పరిగెడు గెడుతున్నారు. పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ లోపల ప్రశాంతత ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ అంతర్గత ప్రశాంతతను కనుగొన్న వాళ్ళకు జీవితంలో మిగతావన్నీ వాటంతట అవే దక్కుతాయి.
(16:47) ప్రశాంతంగా ఉండటం అంటే మీ లోపల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ ని క్రియేట్ చేసుకోవడం. అక్కడికి ఏ బయట పరిస్థితి చేరలేదు. ఎవరి మాటల ప్రభావము అక్కడ పని చేయదు. ఈ ప్రపంచం మిమ్మల్ని తాకలేని చోట అది అక్కడ మీరు పూర్తిగా మీలాగే ఉంటారు. బలంగా స్థిరంగా ఎంతో ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండటం అంత ఈజీ కాదని చాలా మంది అంటుంటారు. నిజమే ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మన దారిలోకి ఏది వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యేలా మన మనసుకి మనం ట్రైనింగ్ ఇచ్చాము.
(17:17) ఎవరైనా ఏదైనా అనగానే మీరు వెంటనే సమాధానం ఇస్తారు. ఎవరైనా కోప్పడితే మీకు వెంటనే కోపం వస్తుంది. ఎవరైనా మీకు ఎదురు తిరిగితే మీరు కూడా తిరిగి ఎదురుదాడి చేస్తారు. ఇది ఒక హ్యాబిట్ గా మారిపోయింది. ఆ హ్యాబిట్ే మనలోని అశాంతికి అసలు కారణం అవుతుంది. కానీ ఎలాగైతే ఒక అలవాటు ఏర్పడుతుందో అలాగే దాన్ని మార్చుకోవడం కూడా సాధ్యమే. ప్రశాంతంగా ఉండటానికి మీరు చేయాల్సిన మొదటి మార్పు ఏంటంటే రియాక్షన్ రెస్పాన్స్ మధ్య ఒక చిన్న గ్యాప్ ఇవ్వడం.
(17:43) ఎవరైనా మాట్లాడిన వెంటనే మీరు మాట్లాడకండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే ఆవేశపడకండి. ఎవరైనా మీకు ఛాలెంజ్ విసిరినప్పుడు వెంటనే గొడవకు దిగకండి. జస్ట్ ఒక్క క్షణం ఆగండి. ఆ ఒక్క క్షణం మీకు నిజమైన స్వేచ్ఛని ఇస్తుంది. ఆ ఒక్క క్షణం మీ ఆలోచనా శక్తిని మేలుకొలుపుతుంది. ఆ ఒక్క క్షణమే మనసును ఆవేశపూరితమైన రియాక్షన్ నుండి ఆలోచనాత్మకమైన రెస్పాన్స్ వైపు నడిపిస్తుంది.
(18:08) కొన్నిసార్లు నేను గనుక సైలెంట్ గా ఉంటే అవతలి వాళ్ళు నన్ను చేతకాని వాళ్ళా అనుకుంటారేమో అని మీకు అనిపించవచ్చు. కానీ అసలు నిజం ఏంటంటే మౌనం కంటే గొప్ప ధైర్యం ఇంకొకటి లేదు. అరవడం, గొడవ పడటం, తిట్టడం, భయపడటం, కుంగిపోవడం ఇవన్నీ చాలా ఈజీ కానీ అసలైన కష్టమైన పని ఏంటో తెలుసా చిన్నగా నవ్వుతూ మౌనంగా ఉండటం.
(18:30) మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకోవడం చుట్టూ ఎంత పెద్ద తుఫాను చెలరేగుతున్నా నిశ్చలంగా నిలబడటం. ఒక బలమైన తుఫాను వీచినప్పుడే ఆ చెట్టు అసలు బలం ఏంటో బయటపడుతుంది. వేర్లు బలహీనంగా ఉంటే ఆ చెట్టు నేలకూలిపోతుంది. కానీ వేర్లు భూమిలో లోతుగా పాతుకుపోయి ఉంటే తుఫాను ఆ చెట్టును కొంచెం వంచగలదేమో కానీ ఎప్పటికీ విరగగొట్టలేదు. మనసుకు ఆ వేర్లు లాంటిదే ఈ ప్రశాంతత.
(18:56) మీ లోపల ఆ ప్రశాంతత అనే మూలాలను బలంగా నాటుకునే వరకు ఈ బయట ప్రపంచం మిమ్మల్ని కదిలిస్తూనే ఉంటుంది. ఇంకో విషయం గుర్తుంచుకోండి. ప్రశాంతంగా ఉండటం అంటే సమస్యల నుండి పారిపోవడం కాదు ప్రశాంతత అంటే ఎదురైన సిచువేషన్ ని ఒక పాజిటివ్ కోణంలో చూసి ఆ తర్వాత సరైన యాక్షన్ తీసుకోవడం లోపల ప్రశాంతంగా ఉన్నవాళ్ళు మాత్రమే సరైన డెసిషన్స్ తీసుకోగలరు.
(19:18) మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది తప్పయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి టెన్షన్ లో ప్రెజర్ లో మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత బాధపడ్డారు కోపంలో ఎన్ని మాటలు అనేసి ఆ తర్వాత అయ్యో అనకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాప పడ్డారు. మీ మీద మీకు నమ్మకం లేక కంగారులో ఎన్ని మంచి ఆపర్చునిటీస్ ని చేజార్చుకున్నారు? అశాంతితో ఉన్న మనసు సమయాన్ని గాని, అవకాశాన్ని గాని అసలు నిజాన్ని గాని చూడలేదు.
(19:47) కానీ ప్రశాంతమైన మనసు ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారాన్ని ప్రతి చోట ఒక కొత్త దారిని వెతుక్కుంటుంది. ప్రశాంతతకు ఉన్న మరో ముఖ్యమైన కోణం యక్సెప్టెన్స్. జీవితంలో జరిగే సంఘటనలన్నీ మీరు కోరుకున్నట్లే జరగవు. ఈ ప్రపంచం మీ ఇష్ట ప్రకారం మారదు కానీ మీరు మీ మనసును ఖచ్చితంగా మార్చుకోగలరు. ఎప్పుడైతే మీరు పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మీ స్ట్రెస్ దానంతట అదే సగానికి తగ్గిపోతుంది.
(20:13) యాక్సెప్టన్స్ అంటే ఓటమి కాదు అది ఒక పరిపక్వత. అది ఒక అవగాహన. సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి కలిసినా అది పొంగిపోదు. తన బ్యాలెన్స్ కోల్పోదు. చాలా కూల్ గా అన్నింటిని యక్సెప్ట్ చేస్తుంది. లైఫ్ లో రియల్ యక్సెప్టెన్స్ అంటే కూడా అదే ప్రాబ్లం రాగానే అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆగిపోకుండా సరే ఇప్పుడు సిచువేషన్ ఇలా ఉంది.
(20:36) దీంతో మనం బెస్ట్ గా ఏం చేయగలం అని ఒక్క క్వశ్చన్ అడగండి. ఆ ఒక్క ఆలోచన మీ మైండ్సెట్ ని పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి నుండే ప్రాబ్లం నుండి సొల్యూషన్ వైపుకు దారి ఓపెన్ అవుతుంది. అశాంతితో ఉన్న మనసు ఎప్పుడు అసలు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఆగిపోతుంది. కానీ ప్రశాంతమైన మనసు మాత్రం సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ముందుకు అడుగు వేస్తుంది.
(20:58) ఇందులో ఇంకొక ముఖ్యమైన రహస్యం ఉంది. మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మీలో ప్రశాంతత పెరుగుతుంది. మనం పక్క వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ తప్పుల్లో వాళ్ళ మాటల్లో ఎంతగా చిక్కుకుపోతాం అంటే అసలు మన లోపల ఏం జరుగుతుందో గమనించుకోవడమే మర్చిపోతాం. ఎప్పుడైతే మీరు మీ లోపలికి ప్రయాణించడం మొదలు పెడతారో అప్పుడే నిజమైన ప్రశాంతత పుడుతుంది.
(21:19) నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది? ఈ యంజైటీ ఐకకి అసలు కారణం ఏంటి? ఏ భయం నన్ను వెనక్కి లాగుతుంది గతం తాలూకు ఏ జ్ఞాపకం నన్ను ఇంకా బాధిస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇలా క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పటివరకు మిమ్మల్ని గట్టిగా పట్టుకున్న ఆ నెగిటివ్ ఎమోషన్స్ గ్రిప్ మెల్లగా లూస్ అవ్వడం మొదలవుతుంది.
(21:38) అవి మిమ్మల్ని కంట్రోల్ చేసే పవర్ ని కోల్పోతాయి. మళ్ళీ మీ లైఫ్ స్టీరింగ్ మీ చేతిలోకి వస్తుంది. ఒక కూల్ మైండ్సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన ఎమోషన్స్ ని బలవంతంగా లోపలే సప్రెస్ చేసుకోడు. వాళ్ళు ఆ ఫీలింగ్స్ ని గుర్తిస్తారు యక్సెప్ట్ చేస్తారు ఆ తర్వాత చాలా జెంటిల్ గా లెట్ గో చేస్తారు. అచ్చం ఆకాశం మేఘాలను చూసినట్లే అంటే మేఘాలు వస్తాయి కాసేపు ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయి.
(22:02) వాటి వల్ల ఆకాశం బాధపడదు ఓవర్ ఎక్సైట్ అవ్వదు అసలు డిస్టర్బే అవ్వదు. అది ఎప్పటిలాగే కామ్ గా ఉంటుంది. మన ఎమోషన్స్ కూడా అంతే వస్తాయి వెళ్తాయి. కానీ మీరు మాత్రం ఆకాశంలా స్టేబుల్ గా ఉండండి. మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే మనకు వచ్చే ప్రతి ఆలోచనతో ప్రతి ఎమోషన్ తో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కానీ ఒక్కసారి ఇలా ఆలోచించండి మన మనసు ఒక ఆకాశం లాంటిది.
(22:27) మన థాట్స్ మన ఎమోషన్స్ మన లైఫ్ సిచువేషన్స్ అన్నీ ఆ ఆకాశంలో వచ్చి వెళ్లే మేఘాల లాంటివి మాత్రమే. ఒక సినిమా స్క్రీన్ పై సీన్స్ మారుతున్న స్క్రీన్ ఎలా అయితే కదలకుండా ఉంటుందో మీరు కూడా అలానే నేను ఈ ఆలోచనలను కాదు ఈ ఎమోషన్స్ ని కాదు ఈ పరిస్థితులను కాదు వీటన్నింటిని చూస్తున్న ఒక విట్నెస్ ని మాత్రమే అని మీరు అర్థం చేసుకున్న రోజు ప్రశాంతత కోసం వెతకాల్సిన పని లేదు.
(22:51) అది మీలో సహజంగానే పుడుతుంది. ఎందుకంటే ఈ లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదనే బిగ్ ట్రూత్ అప్పుడు మీకు క్లియర్ గా అర్థంవుతుంది. ఈరోజు ఉన్న హ్యాపీనెస్ శాశ్వతం కాదు ఇప్పుడున్న బాధ కూడా శాశ్వతం కాదు. జీవితంలో ఏ గెలుపు శాశ్వతం కాదు ఏ ఓటమి శాశ్వతం కాదు. అన్నీ జస్ట్ వచ్చి వెళ్లే ఫేజెస్ మాత్రమే. ఇలా ఎప్పటికప్పుడు మారిపోయే వాటి వెంట పరిగెత్తడం ఎందుకు మారాల్సింది సమయం వచ్చినప్పుడు దానంతట అదే మారుతుంది.
(23:18) ఈ నిజం తెలిసినప్పుడు మీరు జీవితంలో ఒక గొప్ప నిధిని కనుగొంటారు. అదే మనసు తేలిక పడటం. మీ మనసు తేలికగా ఉన్నప్పుడు మీరు వేసే ప్రతి అడుగు ఎంతో బలంగా పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ గోల్స్ ఎంతో క్లియర్ గా కనిపిస్తాయి. మనసు స్థిరంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీకు తలవంచాల్సిందే. క్రమంగా మీకు ఒక విషయం అర్థంవుతుంది.
(23:41) బయట ప్రపంచం మీకు అనుగుణంగా నడవదు కానీ మీ మనసు మాత్రం ఖచ్చితంగా మీ మాట వింటుంది. ఎప్పుడైతే మీ మనసు మీ కంట్రోల్ లోకి వస్తుందో అప్పుడు ఈ ప్రపంచం అంతా మారిపోయినట్లు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే అసలైన పవర్ ఎప్పుడూ మన లోపలే ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు దొరికే మరో బిగ్ సూపర్ పవర్ పేషెన్స్. ఈ రోజుల్లో అందరికీ ఓవర్నైట్ సక్సెస్ కావాలి.
(24:04) కానీ మీరు చేసే హార్డ్ వర్క్ కి మీకు వచ్చే రిజల్ట్స్ కి మధ్య ఉండే ఒకే ఒక్క బ్రిడ్జ్ ఈ పేషెన్స్ మాత్రమే ఓపిక లేకుండా ఏ గొప్ప విజయాన్ని సాధించలేం. విత్తనం వేసి పంట కోసం ఎదురుచూసే ఒక రైతులో ఆ ఓపిక ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా ప్రతిరోజు ఉదయించే సూర్యుడిలోనూ ఆ ఓపిక ఉంటుంది. ఒక మొగ్గ పువ్వుగా వికసించాలన్నా పేషెన్స్ కావాలి. ఒక చిన్న పిల్లాడు ఎదగాలన్నా పేషెన్స్ కావాలి.
(24:27) అలాగే మన డ్రీమ్స్ నిజమవ్వాలన్నా కూడా అదే పేషెన్స్ కావాలి. ప్రశాంతంగా కూల్ గా ఉండే మైండ్ లో ఎప్పుడూ ఓపిక ఉంటుంది. కానీ ఎప్పుడూ కంగారుపడే ఓవర్ థింకింగ్ చేసే మైండ్ లో అసలు ఓపికే ఉండదు. గుర్తుపెట్టుకోండి. పేషెన్స్ లేని వాళ్ళు హాఫ్ వే లోనే గివ్ అప్ ఇచ్చి దారి తప్పిపోతారు. కానీ పేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం కచ్చితంగా వాళ్ళ డెస్టినేషన్ ని రీచ్ అవుతారు.
(24:53) లైఫ్ లో ఏదో ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక బిగ్ రియలైజేషన్ కలుగుతుంది. మీరు సక్సెస్ అయింది బయట ప్రపంచంతో బయట మనుషులతో ఫైట్ చేయడం వల్ల కాదు మీ లోపల మీ ఓవర్ థింకింగ్ తో మీ ఫియర్స్ తో జరిగిన ఆ ఇన్నర్ బాటిల్ లో గెలవడం వల్లే అని కూల్ గా ప్రశాంతంగా ఉండటంలో ఇంకో పెద్ద సీక్రెట్ ఉంది. అదే సెల్ఫ్ బిలీఫ్ అంటే మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడం.
(25:17) మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీకు మీరే ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. బయట వాళ్ళు మిమ్మల్ని అస్సలు నమ్మకపోయినా సరే ఎప్పుడైతే మీ మైండ్ మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఆటోమేటిక్ గా బయట ప్రపంచపు నెగిటివిటీ అంతా మెల్లగా మాయమైపోతుంది. ఎప్పుడూ టెన్షన్ తో కంగారుతో ఉండే మైండ్ బయట వాళ్ళ సపోర్ట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి దారి చూపించాలి.
(25:40) ఎవరో ఒకరు వచ్చి నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అని ఎదురుచూస్తూ ఆగిపోతుంది. కానీ ప్రశాంతంగా కూల్ గా ఉండే మైండ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఇలా చెబుతుంది. నేను ఉన్నాను కదా నా స్ట్రెంత్ నాకు చాలు నా క్లారిటీ నన్ను ముందుకు నడిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే రియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పుడుతుంది. ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోండి.
(25:59) కాన్ఫిడెన్స్ అనేది జస్ట్ మైండ్ లో అనుకునే థాట్స్ నుండి రాదు. అది మీ లోపల ఉండే ఇన్నర్ స్టెబిలిటీ నుండి వస్తుంది. కొందరు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూల్ గా స్మైల్ ఇస్తూ హ్యాండిల్ చేస్తారు. మరి కొందరు చిన్న కష్టం రాగానే కంప్లీట్ గా డౌన్ అయిపోతారు. ఎప్పుడైనా గమనించారా వీళ్ళద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఒక్కటే ఒకరు తమ లోపల నిజమైన నమ్మకాన్ని బిల్డ్ చేసుకున్నారు.
(26:21) ఇంకొకరు జస్ట్ బయటికి మాత్రమే కాన్ఫిడెన్స్ ఉన్నట్లు యాక్ట్ చేశారు. ఈ రియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ప్రశాంతతే మెయిన్ ఫౌండేషన్. ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ మీ ఇన్నర్ స్ట్రెంత్ గ్రో అవుతుంది. అక్కడ హోప్ బతికి ఉంటుంది. అక్కడ మీ మనసు చెప్పే అసలైన మాట క్లియర్ గా వినిపిస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచంలో ఫుల్ నాయిస్ ఉంది.
(26:42) జనాల ఒపీనియన్స్ సొసైటీ పెట్టే ఎక్స్పెక్టేషన్స్ లాభ నష్టాల లెక్కలు ఒకరితో ఒకరు కంపారిజన్స్ రోజు రోజుకి పెరిగే ప్రాబ్లమ్స్ ఇలా బయట ఎన్నో రకాల శబ్దాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. కానీ బయట ఉన్న ఇన్ని శబ్దాల మధ్యలో ఒకే ఒక వాయిస్ ఉంది. అదే అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఇన్నర్ వాయిస్ ఈ వాయిస్ చాలా జెంటిల్ గా ఉంటుంది. అది ఎప్పుడూ గట్టిగా అరవదు మీకు ఆర్డర్స్ వేయదు మిమ్మల్ని భయపెట్టదు.
(27:08) జస్ట్ చిన్న చిన్న సిగ్నల్స్ మాత్రమే ఇస్తుంది. మీ ఫోకస్ ని అటువైపు తిప్పి మిమ్మల్ని కరెక్ట్ రూట్ లో సైలెంట్ గా గైడ్ చేస్తుంది. కానీ ఒక్క కండిషన్ ఈ వాయిస్ కేవలం మీ మైండ్ ప్రశాంతంగా కూల్ గా ఉన్నప్పుడు మాత్రమే వినిపిస్తుంది. అందుకే ప్రపంచంలో ఎందరో గ్రేట్ పర్సన్స్ ఒంటరితనాన్ని కాదు ఏకాంతాన్ని ప్రేమించారు. ఆ సైలెన్స్ లోనే ఈ ప్రపంచం ఎటువైపు వెళ్తుందో వాళ్ళు ముందుగానే అర్థం చేసుకోగలిగారు.
(27:33) రైటర్స్ అద్భుతమైన కథలు రాశారు. కవులు కవిత్వం రాశారు. మెడిటేషన్ చేసేవాళ్ళు డీప్ ఫోకస్ లోకి వెళ్ళగలిగారు. ఎందుకంటే బయట కన్ఫ్యూజన్ తో ఉన్న వాళ్ళందరూ తమ లోపల ఆ ఇన్నర్ సైలెన్స్ ని కాపాడుకున్నారు. నిశ్శబ్దం అంటే ఏమీ మాట్లాడకుండా ఉండటం కాదు మనసులోని అనవసరమైన ఆలోచనలు, కోపం, గందరగోళం తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటమే నిజమైన నిశశబ్దం.
(27:58) ఎప్పుడైతే మీ మనసు ఇలా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ అర్థం ఉంటుంది. అనవసరంగా ఎవరితోనూ వాదించరు. ప్రతి విషయానికి తొందరపడి స్పందించరు. మీరు ఎవరిని తక్కువ చేసి మాట్లాడరు. మీరు చెప్పేది నిజమని నిరూపించుకోవడానికి అనవసరంగా ప్రయత్నించరు. చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు. అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు.
(28:20) అర్థం చేసుకొని వాళ్ళను కూడా మీరు గౌరవిస్తారు. ఎందుకంటే ప్రశాంతమైన మనసుకి ఒక నిజం తెలుసు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టే ఆలోచిస్తారు. అలానే జీవిస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీ వేరు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకు పట్టే టైం కూడా వేరు. అందుకే ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఆటిట్యూడ్ పూర్తిగా మారిపోతుంది.
(28:40) వాళ్ళు నెమ్మదిగా అడుగులు వేస్తారు కానీ చాలా షార్ప్ గా ఆలోచిస్తారు. తక్కువ మాట్లాడతారు కానీ స్ట్రెయిట్ టు ద పాయింట్ మాట్లాడతారు. తక్కువ పనులే చేస్తారు కానీ సూపర్ ఎఫెక్టివ్లీగా పూర్తి చేస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది. మీరు తొందరపడినప్పుడు పనులు ఇంకా వేగంగా పూర్తవుతాయి. ఎందుకంటే తొందరపాటులో మనం చిక్కుల్లో పడతాము.
(28:59) కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ చిక్కులన్నీ విడిపోతాయి. ఈ రోజుల్లో మన సొసైటీ మనకు ప్రతిది ఇన్స్టంట్ గా కావాలని అలవాటు చేసింది. ఇన్స్టంట్ సక్సెస్, ఇన్స్టంట్ రెస్పెక్ట్, ఇన్స్టంట్ రిజల్ట్స్ అందుకే అందరికీ మెంటల్ స్ట్రెస్ ఇంతలా పెరిగిపోయింది. కానీ నేచర్ ఎప్పుడూ ఇలాంటి రూల్ పెట్టలేదు. ప్రకృతి స్లోగా పనిచేస్తుంది. కానీ పక్కగా పనిచేస్తుంది.
(29:19) అది ఎప్పుడూ తొందరపడదు. కానీ మిరాకల్స్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు వేసిన విత్తనం రేపటికే పెద్ద చెట్టు అయిపోదు. పుట్టిన వెంటనే ఒక చిన్న నది సముద్రం అయిపోదు. ముందు మేఘాలు ఫామ్ అవుతాయి. తర్వాత వర్షం పడుతుంది. ఆ నీరు నదిని నింపుతుంది. మళ్ళీ ఆవిరై మేఘాలుగా మారుతుంది. ఇలా ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేచర్ ఎప్పుడూ తన టైం ని తాను తీసుకుంటుంది.
(29:40) ఎందుకంటే టైం తోనే అసలైన మెచూరిటీ వస్తుందని దానికి తెలుసు. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది ఎప్పుడూ తొందరపడదు. సరైన దారిలో ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణం మెల్లగా మీకు ఒక గొప్ప నిజాన్ని నేర్పిస్తుంది. జీవితంలో ప్రతికూలతల స్థానంలో సానుకూలతను నింపడమే ప్రశాంతతకు అసలైన అర్థం. భయం స్థానంలో నమ్మకం, కోపం స్థానంలో అవగాహన. తొందరపాటు స్థానంలో ప్రశాంతత వచ్చి చేరుతాయి.
(30:05) ఎప్పుడైతే మీ మైండ్ ఈ పాజిటివ్ క్వాలిటీస్ తో నిండిపోతుందో అప్పుడు మీరు మీ లైఫ్ ని బయట నుండి కాకుండా లోపల నుండి మార్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి మీ మైండ్ సెట్ మారడం మొదలైన ఆ క్షణం నుండే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆటోమేటిక్ గా మారడం మొదలవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ పూర్తిగా యాక్సెప్ట్ చేయదు.
(30:26) కాబట్టి ప్రపంచం కోసం ఎదురు చూడకండి. ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాటంతటవే సర్దుకోవడం మొదలవుతాయి. ఈ లైఫ్ లో మీ కంట్రోల్ లో ఉన్న విషయాలు చాలా తక్కువ అని ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడే మీకు రియల్ పీస్ దొరుకుతుంది. మీరు బయట పరిస్థితులను గాని పక్కవాళ్ళ ఆలోచనలను గాని గడిచిపోయిన పాస్ట్ ని గాని మార్చలేరు.
(30:49) కానీ 100% మీ చేతుల్లో ఉన్న విషయం ఒక్కటే అదే మీ రియాక్షన్ మీ రెస్పాన్స్. ఇవే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. మీరు ఇచ్చే కూల్ రెస్పాన్సే మీ లైఫ్ ని బ్యూటిఫుల్ గా మారుస్తుంది. ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి బిగ్ చేంజ్ ఒక కామ్ మైండ్ నుండే స్టార్ట్ అయింది. కంగారు అశాంతి ఎప్పుడూ సొల్యూషన్స్ ని తీసుకురాలేదు. అవి కేవలం గొడవలను యుద్ధాలను బాధలను మాత్రమే పెంచాయి.
(31:13) రియల్ సొల్యూషన్స్ ఎప్పుడూ ఒక కామ్ మైండ్ నుండే వస్తాయి. గట్టిగా అరవకుండా ఎదుటి వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకుని కరెక్ట్ డెసిషన్ తీసుకునే మనసు నుండే అవి పుడతాయి. అందుకే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం ఏదో చిన్న విషయం కాదు ఇదే నిజమైన స్పిరిచువాలిటీ ఇదే మీ రియల్ పవర్ ఈ రోజుల్లో ఇదే ఒక పెద్ద రెవల్యూషన్ క్రమంగా మీకు ఒక విషయం అర్థమవుతుంది.
(31:35) మీరు ప్రశాంతంగా ఉండటం వల్ల మీ జీవితమే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం కూడా సంతోషంగా మారుతుంది. ఎందుకంటే కోపం ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందో ప్రశాంతత కూడా అలాగే వ్యాపిస్తుంది. మీ మాటలు, మీ చిరునవ్వు, మీ ప్రవర్తన ఇతరులకు కూడా మనశశాంతిని ఇస్తాయి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ శ్వాస కూడా నెమ్మదిగా సహజంగా ఉంటుంది. కానీ కోపంగా లేదా కంగారుగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా మారుతుంది.
(32:00) అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ముందుగా మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఎప్పుడైనా మీకు కంగారుగా అనిపిస్తే కళ్ళు మూసుకుని మూడు సార్లు నెమ్మదిగా గాలి పీల్చి వదలండి. ఇలా చేయడం వల్ల మీ మనసు కొంత ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు మీరు మీ సమస్యలను స్పష్టంగా ఆలోచించగలుగుతారు. మీ జీవితంలో ఏం చేయాలి ఏ దారిలో వెళ్ళాలి అనే విషయాలపై కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
(32:24) అందుకే కూల్ గా ఉండే వ్యక్తి తాను వెళ్తున్న రూట్ రాంగ్ అనిపించగానే వెంటనే తన డైరెక్షన్ మార్చుకోగలడు. కానీ ఎప్పుడూ కంగారుపడే మైండ్ ఉన్నవాళ్ళు అసలు తప్పు దారిలో వెళ్తున్నామ అన్న విషయమే గుర్తించలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తొందరపాటులో ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో అన్నింటికంటే టఫ్ టాస్క్ ఫాస్ట్ గా పరిగెత్తడం కాదు.
(32:47) కాసేపు ఆగి సిచువేషన్ ని అబ్సర్వ్ చేసి రైట్ స్టెప్ వేయడం కానీ ఆ ఆర్ట్ ఆఫ్ పాజింగ్ అందరికీ తెలియదు. ఈ సొసైటీ మీకు పరిగెత్తడం నేర్పించింది కానీ కాసేపు ఆగడం నేర్పించలేదు. గోల్స్ ని అచీవ్ చేయడం నేర్పించింది. కానీ ఆ జర్నీని ఎంజాయ్ చేయడం నేర్పించలేదు. పక్కవాళ్ళను దాటి ముందుకు వెళ్ళడం నేర్పించింది. కానీ మీ లోపల ఏం జరుగుతుందో చూసుకోవడం నేర్పించలేదు.
(33:09) ప్రశాంతంగా ఉండటం మీకు నేర్పే అసలైన విషయం ఏంటంటే మన జీవితంలో మనం గెలవాల్సిన మొదటి పోరాటం మనతో మనమే. బయట సమస్యలను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే మనసులో వచ్చే కోపాన్ని, భయాన్ని, బాధను అదుపులో పెట్టుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే మనం ఇతరుల దగ్గర నిజాన్ని దాచగలమేమో కానీ మన మనసులో ఏముందో మనకు తెలుసు. అందుకే నిజమైన విజయం అంటే ఇతరులను ఓడించడం కాదు మన మనసును అర్థం చేసుకొని దానిపై నియంత్రణ సాధించడం.
(33:37) మీ మనసును మీరు ఎప్పటికీ మోసం చేయలేరు. మీరు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారో ఎక్కడ వీక్ గా ఉన్నారో అది ప్రతీక్షణం మీకు చూపిస్తూనే ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండటం మొదలుపెట్టినప్పుడు మీలో ఉన్న బలహీనతలు, మీ తప్పులు మీకు అర్థం కాని విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. కానీ చాలామంది తమలో ఉన్న లోపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
(33:55) వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే బదులు వాటి గురించి ఆలోచించకుండా ఉండటమే మంచిదని అనుకుంటారు. ఎందుకంటే మనలో ఉన్న తప్పులను మనం నిజాయితీగా చూసుకోవడం అంత సులభం కాదు. కానీ అసలు నిజం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మీ లోపల మీరు దీపం వెలిగించకపోవడం వల్లే అది అంత చీకటిగా కనిపిస్తోంది. ప్రశాంతమైన మనసే మన లోపల వెలుగు నింపే అసలైన దీపం.
(34:16) మెల్లగా మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీ ప్రాబ్లమ్స్ కి అసలు కారణం బయట ఎక్కడో లేదు. మీ రియాక్షన్స్ లోనే ఉందని మీరు పర్మిషన్ ఇవ్వనంత వరకు మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయలేరు. మీరు ఛాన్స్ ఇవ్వనంత వరకు మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టలేరు. మీ వీక్ పాయింట్స్ ని పక్కవాళ్ళ చేతుల్లో పెట్టనంత వరకు మిమ్మల్ని ఎవరు డౌన్ చేయలేరు. మీరు బలంగా నిలబడితే మీ ఎనర్జీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ప్రశాంతత మీకు నేర్పిస్తుంది.
(34:38) జనాలు ఏమైనా అనొచ్చు కానీ ఆ మాటలు మిమ్మల్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేయాలనేది కేవలం మీ రియాక్షన్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. కోపానికి మీరు ప్రశాంతతో సమాధానం ఇస్తే ఆ కోపం దానంతటి అదే చల్లారిపోతుంది. బాధను అర్థం చేసుకుని ఫేస్ చేస్తే అది మెల్లగా కరిగిపోతుంది. స్ట్రెస్ ని ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తే అదే ఒక గొప్ప అపర్చునిటీగా మారుతుంది.
(35:00) అలాగే ప్రశాంతమైన మనసు మెల్లగా ఎలాంటి సిచువేషన్ నైనా తనకు అనుకూలంగా మార్చుకునే ఒక అద్భుతమైన శక్తిలా మారిపోతుంది. అది పక్క వాళ్ళ విమర్శలను ఇన్స్పిరేషన్ గా, ప్రతి ఛాలెంజ్ ని ఒక ఆపర్చునిటీగా, ఓటమిని ఒక ఎక్స్పీరియన్స్ గా, తప్పును ఒక గొప్ప పాఠంగా మార్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు జీవితంలోని చేదు అనుభవాలు కూడా తీపిగా మారడం మొదలవుతాయి.
(35:24) ఎందుకంటే అప్పుడు మీరు పరిస్థితులకు బానిస కాదు వాటికి మాస్టర్ అవుతారు. ప్రపంచంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పు ఇలాంటి వాళ్ళ వల్లే సాధ్యమైంది. వాళ్ళు బయట ప్రపంచాన్ని మార్చడానికి ముందు తమ లోపలి ప్రపంచాన్ని మార్చుకున్నారు. ప్రశాంతంగా ఉండే వాళ్ళలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ళకు బయట వస్తువుల మీద ఆశ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎవరి దగ్గర నుండి సర్టిఫికెట్స్ ఆశించరు.
(35:45) చప్పట్లు, అవార్డ్స్, పొగడ్తలు ఇవేవి వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు చేసే పనితోనే పూర్తిగా సాటిస్ఫై అవుతారు. ఎవరిలో అయితే ఈ సంతృప్తి ఉంటుందో వాళ్ళలోనే గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆ గ్రాటిట్యూడే నిజమైన సంతోషానికి అసలైన దారి ఎందుకంటే ఈ ప్రపంచం మీకు ఎంత ఇచ్చినా సరే మీ లోపల గ్రాటిట్యూడ్ లేకపోతే మీకు ఎప్పుడూ ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. అదే ఈ ప్రపంచం.
(36:07) మీ దగ్గర నుండి ఏం లాక్కున్నా సరే మీ లోపల గ్రాటిట్యూడ్ ఉంటే మీ జీవితంలో ఎప్పటికీ ఏ లోటు ఉండదు. సంతోషం అనేది బయటి వస్తువుల నుండి రాదని ప్రశాంతమైన మనసు మనకు నేర్పిస్తుంది. నా దగ్గర ఉన్నది నాకు చాలు అనే ఆలోచన నుండే నిజమైన ఆనందం పుడుతుంది. అలా అని దీనికి అర్థం బద్ధకం కాదు నిజమైన సంతృప్తి అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితిని ఎంజాయ్ చేస్తూనే మీరు చేరుకోవాలనుకుంటున్న గోల్స్ వైపు ముందుకు వెళ్ళడం ఎలాంటి యంజైటీ లేకుండా పక్కవాళ్ళతో కంపారిజన్ లేకుండా ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగడం.
(36:39) ఇలా జీవించడం మొదలుపెట్టినప్పుడు మెల్లగా మీ జీవితమే ఒక అందమైన నృత్యం లా మారిపోతుంది. అక్కడ ఎలాంటి తొందరపాటు ఉండదు పోరాటం ఉండదు. మీరు కేవలం ఒక ప్రవాహంలా ముందుకు సాగిపోతారు. కొండల గుండా ప్రవహించే ఒక నది తనకు అడ్డుగా ఉన్న రాళ్లను దాటుకుంటూ ముందుకు వెళ్ళినట్లు. మీరు కూడా ఆ నదిలా మారండి. అడ్డంకులను దాటుకుంటూ, ప్రాబ్లమ్స్ ని కరిగించుకుంటూ, ఎక్స్పీరియన్సెస్ ని పోగు చేసుకుంటూ, మీకంటూ ఒక కొత్త దారిని ఏర్పరచుకోండి.
(37:05) చివరికి ఆ సముద్రమే మిమ్మల్ని పిలుస్తుంది. మీలోని ఆ విశాలమైన మనసే మిమ్మల్ని పిలుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకునే కళ ఒక్క రోజులో వచ్చేదు అది మనం రోజూ చేసే చిన్న చిన్న ప్రాక్టీసెస్ నుండే పుడుతుంది. దీన్ని దూరపు కొండల నుండి ప్రవహిస్తూ కిందికి వచ్చాక ఎంతో ప్రశాంతంగా, పెద్దగా మారే ఒక నదిలా ఊహించుకోండి.
(37:26) ఆ నది పైన ఉన్న రాళ్లను తాకినప్పుడు నురుగును సృష్టిస్తూ ఎంతో శబ్దం చేస్తుంది. కానీ ఎప్పుడైతే అది కింద ఉన్న నేలను చేరుతుందో దాని వేగం తగ్గుతుంది. లోతు పెరుగుతుంది ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. మనసు కూడా అంతే అది జీవితంలోని అప్స్ అండ్ డౌన్స్ ని ఎదుర్కుంటున్నంత కాలం అల్లకల్లోలంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రశాంత పడటం పరిస్థితులను యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటుందో వెంటనే అది ఒక ప్రశాంతమైన ప్రవాహంలా మారిపోతుంది.
(37:52) ప్రశాంతత అంటే మీలో ఆలోచనలు పూర్తిగా ఆగిపోవడం కాదు. ఆకాశం మేఘాలను చూసినట్లు మీరు వాటిని కేవలం అబ్సర్వ్ చేస్తారు అంతే. మేఘాలు వస్తాయి పోతాయి. కానీ ఆకాశం మాత్రం ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు ఆ ఆకాశంలా మారినప్పుడే జీవితంలో నిజమైన సరైన డెసిషన్స్ పుడతాయి. సరైన డెసిషన్స్ ఎప్పుడూ కన్ఫ్యూజన్ లో తీసుకోబడవు. గందరగోళంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ బాధకే దారితీస్తాయి.
(38:16) మీ లోపల అలజడి, భయం, కోపం లేదా అసూయ ఉన్నప్పుడు మీరు తీసుకునే ఏ ఛాయిస్ కూడా మీ ఆత్మ నుండి రాదు. అది మీ లోపలి గాయాల నుండి వస్తుంది. అలా గాయాల నుండి పుట్టిన నిర్ణయాలు జీవితాన్ని ఇంకా కాంప్లికేటెడ్ గా మారుస్తాయి. అందుకే వివేకం ఉన్న వ్యక్తి ముందుగా తనను తాను ప్రశాంత పరుచుకుని ఆ తర్వాతే ఒక దారిని ఎంచుకుంటాడు.
(38:36) ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రశాంతమైన మనసు మాత్రమే దేన్నైనా స్పష్టంగా చూడగలదు. లోతు తక్కువగా ఉన్న నీటిలో అలలు ఎక్కువగా ఉంటాయి. కానీ లోతైన నీటిలో నిశశబ్దం ఉంటుంది. అలాగే లోతు లేని మనసు ఎప్పుడూ వాదిస్తుంది పోరాడుతుంది. వెంటనే రియాక్ట్ అవుతుంది. కానీ లోతైన మనసు అర్థం చేసుకుంటుంది. వేచి చూస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటుంది.
(39:00) చాలా మంది ఒకే తప్పు చేస్తుంటారు. వాళ్ళు తమ మనసును మార్చుకోవడం మర్చిపోయి బయట సిచువేషన్ ని మార్చడానికి తొందరపడతారు. మీ లోపల తుఫాను చెలరేగుతుంటే బయట మీరు ఎన్ని మార్పులు చేసినా ఎంత అందంగా అలంకరించుకున్నా ఆ లోపలి అశాంతిని శాంత పరచలేరు. అదే మీ లోపల ప్రశాంతత ఉంటే బయట ఎంత గందరగోళం ఉన్నా మిమ్మల్ని ఏమాత్రం కదిలించలేదు. మీ మనసును ప్రశాంత పరుచుకోవడంలో ఫస్ట్ స్టెప్ యాక్సెప్టెన్స్.
(39:26) విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. చాలా మంది సరిగ్గా ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఎవరైనా ఏదైనా అనగానే లోపల ఒక తుఫాన్ మొదలవుతుంది. మీ పనిలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వెంటనే యాంజైటీ మొదలవుతుంది. ఒక ప్లాన్ మారగానే ఎందుకంత కంగారు ఎందుకంటే మనసు ఎప్పుడూ తాను ఊహించుకున్న దానికే అతుక్కుపోయి ఉంటుంది. ఎక్కడైతే మీరు ఒకే ఆలోచనలో చిక్కుకుపోతారో సరిగ్గా అక్కడే స్ట్రెస్ పుడుతుంది.
(39:51) జీవితంలో ప్రతీదీ దాని సహజమైన వేగంతోనే జరుగుతుందని మీరు తెలుసుకున్నప్పుడు జరిగే ప్రతి సంఘటన మిమ్మల్ని ముందుకు నడిపించడానికే వస్తుందని మీకు అర్థమవుతుంది. ప్రశాంతమైన మనసు కష్టాలను కూడా ఆపర్చునిటీస్ గా చూస్తుంది. కానీ అశాంతితో ఉన్న మనసు కొత్త పునాదులు వేసుకోవడానికి ఉపయోగపడే ఆ కష్టాలను చూసి భయపడి వదిలేస్తుంది. జీవితంలో ప్రతి ఉదయం మీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది.
(40:14) ఒకటి ఆవేశంతో వెంటనే రియాక్ట్ అవ్వడం లేదా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవడం రియాక్షన్ అనేది ఒక గొడవ లాంటిది కానీ కాన్షియస్ ఛాయిస్ అనేది ప్రశాంతత ఏమాత్రం ఆలోచించకుండా కోపం, అసూయ, బాధ, యంజైటీ గొడవల మధ్య పుట్టేదే రియాక్షన్. కానీ కాసేపు ఆగి పరిస్థితిని అర్థం చేసుకుని మన ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత తీసుకునేదే నిజమైన ఛాయిస్. ఇదే మనసును ప్రశాంతంగా, సరైన డైరెక్షన్ లో ఉంచుతుంది.
(40:41) దీనిని అలవాటు చేసుకోవడానికి ప్రతిరోజు మూడు చిన్న విషయాలను గుర్తుంచుకోండి. మొదటిది పాజ్ ఏదైనా విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు ఆగండి. కేవలం 20 సెకండ్స్ పాటు ఆగడం అనేది ఒక అద్భుతమే చేస్తుంది. ఆ 20 సెకండ్స్ లో మీరు మీ ఆవేశం నుండి బయటపడి మీ అంతరాత్మను చేరుకుంటారు. ఆగడం అంటే ఒక్క క్షణం పాటు మీ లోపలికి మీరు వెళ్ళడం.
(41:03) రెండవది అబ్సర్వ్ మీ ఆలోచనలను పట్టుకొని వేలాడకండి. మీరు ఒక ట్రైన్ లో కూర్చుని కిటికీలోనుంచి బయట వెళ్ళిపోతున్న దృశ్యాలను చూస్తున్నట్లుగా మీ ఆలోచనలను చూడండి. మీరు ఆ స్టేషన్ కాదు అలాగని ఆ పట్టాలు కూడా కాదు మీరు కేవలం ఒక పాసంజర్ మాత్రమే ఆలోచనలు వస్తాయి. అలాగే వెళ్ళిపోతాయి. చివరికి ప్రశాంతంగా ఉన్న మీ మనసులో సరైన ఆలోచన మాత్రమే స్థిరపడుతుంది.
(41:24) మూడవది లెట్ గో మనం దేన్నైతే వదిలి పెట్టలేమో అదే మన మనసును మరింత బరువుగా మారుస్తుంది. అది ఎవరో అన్న మాటలైనా ఒకరి ప్రవర్తన అయినా మనకున్న కంప్లైంట్స్ అయినా లేదా ఏదైనా కోరిక అయినా సరే ప్రతిరోజు కొద్ది కొద్దిగా వాటిని వదిలేయడం నేర్చుకోండి. ఎక్కడైతే ఆ బరువు తగ్గుతుందో అక్కడ ప్రశాంతత మరింత లోతుగా పెరుగుతుందని మీరే గమనిస్తారు.
(41:47) విషయాలను వదిలేయడం నేర్చుకున్న వ్యక్తి లోపల ఎంతో తేలికపడతాడు. అలా తేలికపడిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులకైనా అతీతంగా ఎదుగుతాడు. ప్రశాంతమైన మనసు మీకు మరో గొప్ప శక్తిని ఇస్తుంది. అదే మీ లోపల వినిపించే సంగీతాన్ని వినగలగడం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం బయట వాళ్ళ మాటలను తక్కువగా మన ఇన్నర్ వాయిస్ ని ఎక్కువగా వినడం మొదలు పెడతాం. ఈ గొంతు చాలా సున్నితంగా ఉంటుంది.
(42:09) అందుకే మనసులో గందరగోళం ఉన్నప్పుడు ఇది అస్సలు వినిపించదు. ఈ గొంతు మిమ్మల్ని ఎప్పుడూ భయపెట్టదు ఆజ్ఞాపించదు అది కేవలం మీకు దారి చూపిస్తుంది. మిమ్మల్ని విమర్శించదు. అసలు విషయాన్ని వివరిస్తుంది. మిమ్మల్ని తొందర పెట్టదు. మీకు కావాల్సినంత సమయం ఇస్తుంది. ఎప్పుడైతే ఈ గొంతు మీకు వినిపించడం మొదలవుతుందో అప్పటి నుండి మీ జీవితాంతం ప్రశాంతతను ఇచ్చే సరైన డెసిషన్స్ ని మీరు తీసుకుంటారు.
(42:34) చాలా మంది ఎంతో కష్టపడి పనిచేసినా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం సరైన డైరెక్షన్ లో లేదు. కాబట్టి మీ లోపల క్లారిటీ ఉన్నప్పుడే మీకు ఆ సరైన డైరెక్షన్ కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే దేంట్లోనైనా క్లారిటీ వస్తుంది. అందుకే జీవితంలో ఏ కలనైనా నిజం చేసుకోవడానికి వేయాల్సిన మొదటి అడుగు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడమే.
(42:56) కొన్నిసార్లు ఈ ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. జనాలు మిమ్మల్ని అర్థం చేసుకోరు. పరిస్థితులు ఇంకా దిగజారిపోతుంటాయి. అన్ని దారులు మూసుకుపోతున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో మనసు ఇంకా ఎక్కువ అశాంతికి లోనవుతుంది. కానీ సరిగ్గా ఇలాంటి క్షణాల్లోనే మీరు ప్రశాంతంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి.
(43:17) అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీ లోపల ఒక కొత్త మనసు పుడుతోందని అర్థం చేసుకోండి. ఎవరో ఒక గొప్ప వ్యక్తి అన్నారు. మీరు గట్టిగా అరుస్తున్నప్పుడు ఈ ప్రపంచం మీ మాట వినదు. కానీ మీరు మౌనంగా ఉన్నప్పుడు ప్రపంచమే మీ మాట వినడం మొదలు పెడుతుంది అని. మీరు మీ ఎనర్జీని కాపాడుకోవాలి కోపంలో వాదనల్లో ఆవేశంలో మీరు మీ వాల్యబుల్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు.
(43:42) కానీ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మీలోనే సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన ఎనర్జీనే మీకు రైట్ టైం లో ఉపయోగపడుతుంది. ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్న వాళ్ళకు ఒక నిజం అర్థంవుతుంది. జీవితం అనేది ఒక యుద్ధభూమి కాదు అది మనం ఎన్నో విషయాలు నేర్చుకునే ఒక స్కూల్ లాంటిది. కష్టాలు మన ఎనిమీస్ కాదు మనకు జీవిత పాఠాలు నేర్పే టీచర్స్ ఎవరైనా మీతో రూడ్ గా ప్రవర్తిస్తే అది మిమ్మల్ని గాయపరిచే రాయి కాదు.
(44:07) మిమ్మల్ని ఒక అందమైన శిల్పంలా చెక్కే ఉలి ఎదురయ్యే సిచువేషన్స్ మీకు అడ్డంకులు కావు అవి మీకు సరైన దారి చూపించే సిగ్నల్స్ మాత్రమే అందుకే ప్రశాంతంగా ఉండటం అంటే బలహీనత కాదు అది అన్నింటికంటే గొప్ప పవర్. ఈ అవగాహన మీ మనసులో బలంగా నాటుకున్నప్పుడు జీవితం మీకు ఇకపై భారం అనిపించదు. ప్రతి క్షణం ఒక కొత్త పాఠంలా వికసిస్తుంది. అప్పుడు సక్సెస్ దానంతట అదే మీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది.
(44:34) ఎందుకంటే ఆ విజయాన్ని తట్టుకొని నిలబడగల ప్రశాంతమైన మనసు కోసమే అది వెతుకుతుంటుంది. ఎలాంటి భయం లేకుండా కంప్లైంట్స్ లేకుండా కుంగిపోకుండా తన కలలను నిజం చేసుకోగల శక్తి కోసమే అది ఎదురుచూస్తుంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రశాంతమైన మనసు ఈ యూనివర్స్ నే తన వైపు ఆకర్షిస్తుంది. సముద్రం చంద్రుడిని ఆకర్షించినట్లే లోపల బ్యాలెన్స్ కలిగిన వ్యక్తి సరైన మనుషులను సరైన ఆపర్చునిటీస్ ని జీవితంలో రావాల్సిన సరైన క్షణాలను తన వైపుకు ఆకర్షించుకుంటాడు.
(45:05) కానీ చివరికి ఒక్క విషయం గుర్తుంచుకోండి జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మీరు మార్చలేకపోవచ్చు. ప్రతి ఒక్కరిని మీకు నచ్చినట్లు నడుచుకునేలా చేయలేకపోవచ్చు. కానీ ఏ పరిస్థితిలోనైనా మీ మనసును ఎలా ఉంచుకోవాలనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. పరిస్థితులు మిమ్మల్ని కిందకు లాగవచ్చు.
(45:27) అనుకున్న పనులు జరగకపోవచ్చు కానీ వాటి కారణంగా మీలోని ప్రశాంతతను కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో మీరు కోల్పోయిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు. కోల్పోయిన అవకాశాలను మళ్ళీ వెతుక్కోవచ్చు. కానీ ఒకసారి మీ మనసుపై మీకు నియంత్రణ కోల్పోతే తిరిగి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే రేపటి నుండి కాదు ఇప్పటి నుండే ఒక చిన్న మార్పు చేసుకోండి.
(45:51) ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగండి మీ శ్వాసను గమనించండి. మీ మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఆ తర్వాతే మీ నిర్ణయం తీసుకోండి. గుర్తుంచుకోండి. ప్రశాంతంగా ఉండే వ్యక్తికి సమస్యలు రావని కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటి ముందు తనను తాను కోల్పోని వ్యక్తే నిజంగా బలమైనవాడు.
(46:14) ఈ ప్రపంచాన్ని గెలవడానికి ముందు మీ మనసుని గెలవండి. ఎందుకంటే మీ మనసుపై మీకు నియంత్రణ వచ్చిన రోజే మీ జీవితంపై కూడా మీకు నిజమైన నియంత్రణ వస్తుంది. అదే నిజమైన ప్రశాంతత. అదే నిజమైన విజయం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీలాంటి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.
(46:37) ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్ కి మరింత సపోర్ట్ ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ మెంబర్ గా జాయిన్ అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రశాంతంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి.
(46:54) మీ జీవితాన్ని మీరే అందంగా నిర్మించుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.

No comments:

Post a Comment