*🌿 ఆరోగ్య జీవన యాత్ర – నేటి ఆరోగ్య సందేశం*
*అంశం: కూర్చునే జీవనశైలి – శారీరక చురుకుదనం*
గంటల తరబడి కూర్చుంటున్నావు… ఆరోగ్యం కోసం అరగంట కేటాయించలేవా?
నేటి ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గి, ఎక్కువసేపు కూర్చునే అలవాటు పెరిగింది. ఇది అధిక బరువు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రతి అరగంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవండి. రోజువారీ జీవితంలో నడక, యోగా, వ్యాయామానికి స్థానం కల్పించండి.
గుర్తుంచుకోండి… శరీరాన్ని కదిలించడం అలవాటు చేసుకోండి, నిశ్చల జీవనశైలికి స్వస్తి పలకండి!
*🌱 ఆరోగ్యమే నిజమైన ఐశ్వర్యం!*
ఇట్లు,
*ఆరోగ్య జీవన యాత్ర యోగ బృందం* జూలూరుపాడు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
No comments:
Post a Comment