"ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నిజం కావాలి...కానీ ఆ నిజం తమకు అనుకూలంగా ఉంటేనే.
తమ తప్పులను చూపించే నిజం మాత్రం ఎవరికీ నచ్చదు."
మనిషి సాదారణంగా తన గురించి మంచి మాటలు వినడానికి ఇష్టపడతాడు. కానీ తన లోపాలు, తప్పులు, బలహీనతలను చూపించే మాటలు వినడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే నిజం చెప్పేవారిని కొన్నిసార్లు ఇష్టపడరు.
అబద్ధం మనసుకు నచ్చుతుంది... నిజం మనిషిని మార్చుతుంది. అందుకే నిజం చేదుగా అనిపిస్తుంది.
😊 🙏🏻
*రెండు విషయాలు నువ్వేంటో తెలుపుతాయి...*
*ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక...*
*రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన...*
😊 🙏🏻
"డబ్బు పెరిగినప్పుడు చూపులు మారుతాయి.
బంధాల విలువ మారుతుంది.
మనుషుల స్థానం మారుతుంది. కానీ నిజమైన మనుషులు మాత్రం ఎప్పటికీ మారరు."
😊 🙏🏻
No comments:
Post a Comment