🙏🙏🙏🙏🙏🙏
*అలిగి అత్తారింటికి వెళ్లకూడదా?*
🙏🙏🙏🙏🙏
ఇక్కడ అల్లుడు అలిగితే పిలవడానికి అత్తారిల్లు ధర్మ సత్రం కాదు! వెనకటి రోజుల్లో అల్లుడు గారు ఇంటికి వస్తున్నారంటే.. వాకిట్లో చెంబుతో నీళ్లు ఇచ్చి ఇస్త్రీ టవల్ ఇచ్చి తుడుచుకున్నకా, కుండలో చల్లటి నీళ్లు ఇచ్చి "బావ గారు వేడి వేడి నీళ్లు ఉన్నాయి...స్నానం చేసి రండి" అని బావ మరిది...స్నానాల గదిలో నీళ్లు పెట్టి...స్నానం చేసి
వచ్చాకా తెల్లటి లుంగీ, టర్కీ టవల్ ఇచ్చి గదిలో కూలర్ ఆన్ చేసి పరుపు మీద తెల్లటి దుప్పటి పరిచి...కూర్చున్నాడో లేదో టీ పాయి మీద వేడి వేడి అన్నం నాలుగు కూరలు, సాంబారు, నెయ్యి, స్వీట్ పెట్టి పక్కన విసన కర్రతో బావమరిది విసురుతుంటే...ఈ లోపు బావ మరిది భార్య వదిన గారిని రెడి చేసి గదిలోకి పంపే వరకు...అల్లుడు గారికి రాచమర్యాదలే మర్యాదలు!!.అలా మూడు రోజులు... నాల్గవ రోజు...బావ గారు పొలం దగ్గరికి వస్తారా? అన్న పిలుపు...బావ మరిది వెంట రెండు కోసుల దూరం నడుచుకుంటూ వెళ్లి పొలంలో పండిన కూరగాయలు తెంపుకొని రెండు సంచుల్లో మోసుకొని వస్తున్న బావ మరిది ని చూసి "ఇటివ్వవోయ్" ఒక బ్యాగ్ అనగానే చటుక్కున బరువున్న బ్యాగ్ ను బావకు ఇచ్చి వెనకాల నడుస్తూ..."తిన్నది అరగాలి" అనుకునే బావ మరిది స్వరం విన్నా విననట్టు నటిస్తూ రొప్పుతూ ఇల్లు చేరి...కాళ్లకు నీళ్లిచ్చి మర్యాద చేసే వారు లేరు కాబట్టి...ఆయనే కాళ్లు కడుక్కొని... బెడ్ రూంలో చిందర వందరగా ఉన్నా బెడ్ షీట్ ను సర్ది పడుకుందామనే సరికి గుసగుసలు వినిపించి అటు చెవులు రిక్కించి వినడం ప్రారంభించాడు! 'ఏమే రాజ్యం మీ ఆయన వచ్చి వారం రోజులు అవుతుంది...మీకు చాకిరి చేయలేక మీ మరదలు పుట్టింటికి నాలుగు రోజులు వెళ్లి వస్తా నంటుంది...అసలు పండుగలు పబ్బాలు లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మీరు" అన్న తల్లి మాటలకు...రాజ్యం బోరున ఏడుస్తూ..."ఏమి చేయమంటావే అమ్మా. ? మా అత్త మామ ఈయన పనిచేయంది నయా పైసా ఇవ్వమన్నారు...దానికి తోడు మాబావ అక్కా ఈయనను చులకనగా మాట్లాడితే అలిగారు... "మా అమ్మ గారు నాన్నగారు బ్రతికి ఉండగా మనకు కష్టాలు ఎందుకు మా పుట్టింటికి పోదాం రండి" అని మాట వరుసకు అన్నాను...అంతే ఈయన వెంటనే బస్సు ఎక్కి వస్తారు అనుకోలేదు".... పెళ్ళాం అన్న మాటలు వినిపించి గుండె గుబేలు మంది సుబ్బారావుకు!!
"ఇది మాట వరుసకు అందా?" అనుకోని పెళ్ళాం మీద కారం పొడి చల్లుదామన్నంత కోపము వచ్చింది! అదుముకొని పడుకున్న సుబ్బారావు కు రాత్రి ఒంటి గంట అయిన నిద్ర పోలేదు. నిద్ర పడితే కదా!!
ఆమె గదిలోకి రాలేదు! అత్తా, భార్య, బావ మరిది ఆయన భార్య తన గురించి అంటున్న మాటలు విని "చస్తే ఇక అలిగి అత్తారింటికి రావద్దు" అనుకోని తెల్లారి బస్సుకు తయారు అయి "వెళ్ళొస్తాను మావయ్య గారు" అన్నారు... "మళ్ళీ మీరు వచ్చినా, మేము ఉండం నాయనా" ఆర్నెళ్లు కాశీ రామేశ్వరం వెళుతున్నాం" అని ముసలాడు అన్న మాటలకు...మండి భార్య వంక తిరిగి 'వెళదాం పదా" అని గర్జించబోయాడు...!! ఆమె స్వరం పెంచి "పని పాట లేకుండా మీరున్నారు...నేను వచ్చి మీ అమ్మా నాన్నకు చాకిరి చేసే కన్నా మా అమ్మా నాన్న వెంట ఆర్నెళ్లు కాశీ ప్రయాగ చూసి వస్తా" అన్న పెళ్ళాం మాటలకు చేతులు పిసుక్కోని, స్థాన బలం లేదు కాబట్టి అందరూ కలసి చీపురు కట్ట తో వాయిస్తారని వడివడిగా బస్ స్టాండ్ వైపు నడుస్తూ వెళ్లిన సుబ్బారావు కు భార్య, అత్తా మామలతో అవమానానికి గురైన మరో నలుగురు సుబ్బారావులు సిగరెట్లు తాగుతూ..ఆకాశం వంక చూస్తూ ఒకడు, పెళ్ళాం పిలిస్తే వెనక్కు వెళదాం అని ఒకడు....బిత్తర చూపులు చూస్తూ కనబడ్డారు! *నీతి ఏమిటంటే*...ఉద్యోగం, సంపాదన లేని మొగుడు పెళ్ళాంకు చులకన! పైసా సంపాదన కోసం ఇంట్లో ఉండకుండా వీధుల్లో ఊరేగి, నాలుగు రాళ్లు తెస్తే పెళ్ళాం, అత్త మామలు విలువ ఇస్తారు... అందుకే ఆనాటి పెద్దలు.అలిగి పోరపాటున కూడా అత్తారింటికి దారేది అని పోతే అవమానాలు అవస్థలతో, తిరిగి ఇంటి దారి పట్టక తప్పదు! నాలుగు మాటలు అన్నా అమ్మా నాన్న సేవలే మిన్నా అని పురాణ కథలు కూడా ఉద్బోధిస్తున్నాయి!
🙏🙏🙏🙏🙏
సేకరణ
7386587623
యెనుముల
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment