🍁*పెద్దల ఆశీర్వచనం*🍁
మన చేతి వేళ్లలో కూడా పంచభూత తత్త్వం నిక్షిప్తమై ఉంది.
ఆ శక్తిని జాగృతం చెయ్యగలిగితే మన చేతికి ఎంతో శక్తి ఏర్పడుతుంది.
‘ఆ చేతిలో ఏదో మహత్తు ఉంద’ని చెప్పిడానికి ఏర్పడటానికి కారణం ఇదే.
👉బొటన వేలు అగ్నితత్త్వానికి, చూపుడు వేలు వాయుతత్త్వానికి, మధ్యవేలు ఆకాశ తత్త్వానికి, ఉంగరపు వేలు భూతత్త్వానికి, చిటికిన వేలు జలతత్త్వానికి సంకేతం.
మంత్రజపాలు చేసేటప్పుడు అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు.
ఈ ప్రక్రియలో చేతివేళ్ల మొదలు నుంచి కొన వరకు సున్నితంగా తాకుతారు.
దీనిద్వారా ఆ వేళ్లలో ఉండే పంచభూతశక్తులు ఉద్దీపనం చెందుతాయి. తద్వారా మనిషిలో ఆత్మచైతన్యశక్తి జాగృతమవుతుంది.
👉అలాగే, ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కూడా హస్త మస్తక సంయోగం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది.
🌿అందుకే సాధకులైన పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పారు.🍁 *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment