💖*మానవ తప్పిదములు...*🍁
ప్రతి మానవుడు కూడా తన జీవితంలో.. రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు...
సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తుంటాడు...
🌿*మొదటిది ఆత్మస్తుతి...*
🌿*రెండవది పరనింద....*
...రెండూ తప్పులే, మనిషి తానెంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ తనను తాను పొగుడుకోకూడదు...
*"ఇన్ద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః"*
దేవతల అధిపతి ఆయన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే ప్రస్తుతించుకుంటే చాలా చులకన అవుతాడని చెప్తారు.
అందువలన ఎట్టి పరిస్థితుల లోను మానవుడు ఆత్మస్తుతి చేసుకోకూడదు...
👉ఇతరులను నిందించటమూ పెద్ద పాపమే, ఒక మనిషిని హత్య చేసిన దానికంటే ఇది ఎక్కువ పాపం...
🌿ఇందుకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉంది.
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణునితో యుద్ధం చేయటం ధర్మరాజుకు చాలా కష్టమైంది.
ఆ కష్టానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్దభూమి నుండి వెనుదిరిగి శిబిరానికి వెళ్ళిపోయాడు...
యుద్ధభూమిలో ధర్మరాజు కనపడక అర్జునుడు చాలా చింతించాడు,
అతని కోసం వెదికి వెదికి చివరికి శిబిరంలో కనుగొన్నాడు, ధర్మరాజు వెంటనే 'కర్ణుని చంపావా లేదా..' అని అర్జునుడిని ప్రశ్నించాడు.
లేదు అని అర్జునుడు సమాధానం మిచ్చాడు, తాను ధర్మరాజును వెతుకుతూ అక్కడికి వచ్చానని చెప్పాడు.
అప్పుడు కోపంతో ధర్మరాజు ఇలా అన్నాడు. 'కర్ణుని చంపలేకపోతే నీకు గాండీవమెందుకు.. దండగ.. దానిని ఎవరికైన దానం చేయు...
ఆ మాటలు వినగానే అర్జునుడి మనస్సు గాయపడింది, అతడు శ్రీ కృష్ణుని ఇలా ప్రశ్నించాడు. 'నా గాండీవాన్ని త్యజించమన్న వారిని చంపుతానని నేను శపధం పట్టాను, అందువలన నేను ధర్మరాజుని చంపాలి, కానీ ఆయన నా అగ్రజుడు, ఇప్పుడు నా శపథాన్ని నెరవేర్చు కొనడమెలా..'
అర్జునుని ప్రశ్నకు శ్రీ కృష్ణుడు ఇలా సమాధానం మిచ్చాడు.
'ధర్మరాజు వంటి మహా పురుషుని చంపాలను కోవటమే మహాపాపం...
కానీ నీ శపథాన్ని నెరవేర్చక తప్పదంటున్నావు, నీవు ధర్మరాజును ఎటువంటి కారణం లేకుండానే నిందించు.... అలా నిందించటమే హత్య చేసినట్లు' అని చెప్పారు...
👉దీని నుండి ఒక వ్యక్తిని నిందించటం అతనిని హత్య చేయటం కంటే ఘోరమైన పాపమని మనకు తెలుస్తుంది.
👉అందువలన మనల్ని మనం పొగుడుకోవటం, ఇతరులను నిందించటం మనం చేయకూడని పనులు...
మన జీవితంలో ఆ రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు.🍁. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment