Monday, November 23, 2026

పూజించవలసింది... **నాగులనా?* **దేవతాసర్పాలనా?* **పాములనా?*

 🙏🐍🙏🐍🙏🐍🙏🐍🙏

🐍 *నాగుల చవితి* 🐍 
*13 నవంబర్ 2026*
*(శుక్రవారం)* 
*కార్తీక శుద్ధ చవితి*

🙏🐍🙏🐍🙏🐍🙏🐍🙏

పూజించవలసింది... 
**నాగులనా?* 
**దేవతాసర్పాలనా?* 
**పాములనా?*

నాగుల చవితి వస్తోందంటే చాలు మూఢనమ్మకం అంటూ దాడి చేస్తారు. కానీ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఇంగ్లీష్ లో Snake అనే ఒక్క మాటే ఉంది. కానీ మన ధర్మంలో.. నాగులు వేరు, సర్పాలు వేరు.

*భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు:

*సర్పాణామస్మి వాసుకిః 10-28*
సర్పాలలో నేను వాసుకిని.

*అనన్తశ్చాస్మి నాగానాం 10-29*
నాగులలో నేను అనంతుడిని.

వాసుకి శివుని మెడలో అలంకారం. 
సాగర మథనానికి త్రాడుగా ఉపయోగపడ్డాడు.
అనంతుడు అంటే ఆదిశేషుడు. ఈ భూమిని మోస్తున్నవాడు. 
రామావతారంలో లక్ష్మణుడిగా, 
కృష్ణావతారంలో బలరాముడిగా వచ్చాడు.

*నాగులు - సర్పాల తేడా ఏంటి?*

*నాగులు :*
కామరూపధారులు. 
ఏ రూపమైనా ధరించగలరు.
గాలినే ఆహారంగా తీసుకుంటారు*
వారికి ప్రత్యేకమైన నాగలోకం ఉంది.
మానవ రూపంలో దర్శనం ఇవ్వగలరు.

*సర్పాలు / మామూలు పాములు :*
నేలను అంటిపెట్టుకుని పాకుతాయి.
కప్పలు మొదలైన జీవాలను ఆహారంగా తీసుకుంటాయి.
పాలు తాగవు. 
వాటికి జీర్ణ వ్యవస్థ ఉండదు.

*దేవతాసర్పాలు :*
ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుంది.
మానవ సంచారం ఉన్న చోట తిరగవు.
భక్తికి మెచ్చి దర్శనం ఇచ్చి, సంతానాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
అవి పాలు తాగుతాయి.

పూర్వం నాగులు మనుషులతో కలిసి సంచరించేవారు. ప్రజల్లో శౌచం, ధర్మనిష్ఠ తగ్గిపోవడంతో ఇప్పుడు విగ్రహాలలోనే ఆవాహన చేసి పూజిస్తున్నాం.

నాగదేవతలను పూజించి సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. నాగదేవత అనుగ్రహంతో పుట్టిన సంతానంలో ఆ వరప్రభావం తల్లిదండ్రులకు తెలుస్తుంది.

*ఈ నాగుల చవితి ఎలా చేయాలి?*

1. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి.
2. పుట్ట దగ్గరకు లేదా గుడిలో ఉన్న నాగశిల దగ్గరకు వెళ్ళాలి.
3. పసుపు, కుంకుమ, పూలు, పాలు, పండ్లు, గంధం సమర్పించాలి.
4. నాగశిలకు పాలతో అభిషేకం చేయాలి.
5. చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలి.
6. సంతానం కోసం, పిల్లల క్షేమం కోసం మొక్కుకోవాలి.
7. పుట్ట మట్టి నుదుట పెట్టుకోవాలి.

పాములను చంపవద్దు, హింసించవద్దు. 
ప్రతి జీవికి ఈశ్వర సృష్టిలో ప్రాధాన్యత ఉంది.

🙏🐍🙏🐍🙏🐍🙏🐍🙏

No comments:

Post a Comment