Monday, November 23, 2026

 ❣❣❣❣❣❣❣❣❣❣❣❣

🍁*ఎవరు పండితుడు?*🍁

మెడలో రుద్రాక్షలు వేసినంత మాత్రాన పండితుడు కాదు. మరి ఎవరు పండితుడు? 

👉ఎవరనేది భగవద్గీత నాలుగో అధ్యాయం పంథొమ్మిదో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పాడు. 

🌿యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః🌿

‘రుద్రాక్ష’ అనే మాట తాలూకు తాత్వికమైన జ్ఞాన సంపద మొత్తం ఈ శ్లోకంలో ఉంది. 

🌿‘యస్య’... ఎవరికైతే, ‘సర్వే సమారంభా’🌿

అన్ని రకాల కోరికలు, ‘కామసంకల్పవర్జితాః’.. దాని సంకల్పంతో సహా విడిచిపోతాయో అంటే ఎవరైతే తమ అన్ని రకాల కోరికలను సంకల్పంతో సహా విడిచి పెట్టేస్తారో.. వారు ‘జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం’... అన్ని రకాల కర్మలను, వాటి వాసనలను జ్ఞానం అనే అగ్నితో దహించి పారేస్తారు. ‘తమాహుః పండితం బుధాః’... అలాంటి వాడిని మాత్రమే పండితుడు అంటారు. 

పండితుడు అంటే డాబుసరి వేషం వేసిన వాడు కాదు. మెడల నిండా రుద్రాక్షలు, తులసి మాలలు వేసిన వాడు కాదు. ఇదంతా బాహ్యవేషం.

👉జ్ఞానం అగ్నిలాంటిది. దాంతో కర్మలను దహించి వేయాలి. అగ్నితో దహించి వేయడమంటే రాసిన కాగితాలను దహించి వేయమని కాదు. కాగితాల గురించి, వాటిపై రాసిన విషయం గురించి, దాని ఫలితం గురించి ఆందోళనను దహించి వేయాలి.🍁

❣❣❣❣❣❣❣❣❣❣❣❣

🍁*ఒకే ఒక్క సిద్ధాంతం*🍁

సృష్టిలో మొత్తానికి ఉన్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే. అదే కర్మ సిద్ధాంతం. 

చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటారు. 

మన భావనలే మన యదార్ధాలవుతాయని వివరించేదే కర్మ సిద్ధాంతం. 

ఎంత కష్టపడితే అంత ప్రతి ఫలం పొందుతారు. కర్మ అనేది పాజిటివ్ థింకింగ్ ని, పాటిజివ్ పనులను సూచిస్తుంది.

👉కాబట్టి మన ప్రవర్తన బావున్నప్పుడే, మన ఆలోచనలు బావున్నప్పుడే మనం కోరుకున్న జీవితం మనకు దక్కుతుంది.🍁

🌷🌷🌷🌷.         *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment