Monday, November 23, 2026

 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


కథ*-  *158* 

మనం మన జీవితాన్ని సక్రమంగానే జీవిస్తున్నట్లుగా ఎలా తెలుస్తుంది?

*విశిష్ట* *మంత్రం*

రామానుజాచార్యులు ప్రాచీన కాలంలో ఒక ప్రసిద్ధ పండితుడు. ఆయన మద్రాసు నగరానికి సమీపంలోని పేరుబుదూరు గ్రామంలో జన్మించారు.  చిన్నతనంలో విద్యను అభ్యసించడానికి దూరం వెళ్లారు, ఆయన గురువు తన యువ శిష్యుడికి చాలా శ్రద్ధగా బోధించేవాడు.

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, గురువు ఇలా అన్నాడు - "నాయనా, నేను నీకు దీక్షను ఇస్తున్నాను. నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రాన్ని విన్నవారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. కానీ నీవు  ఈ మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు, ఎవరితోనూ పంచుకోకూడదు."

రామానుజులవారు మంత్ర దీక్షను ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఆ మంత్రం - "ఓం నమో నారాయణాయ."

ఆశ్రమం వదిలి వెళ్ళేముందు గురువుగారు మరోసారి హెచ్చరించారు - "రామానుజా, ఈ మంత్రం ఏ పనికిమాలిన వ్యక్తి చెవిలో పడకుండా జాగ్రత్తపడు."

దారిలో రామానుజులవారు మనసులో ఇలా అనుకోవడం మొదలుపెట్టారు – ‘ఈ మంత్రం యొక్క శక్తి ఎంత అపారమో! ఇది వింటేనే స్వర్గప్రాప్తి కలుగుతుంది!’ 
అప్పుడు హృదయంలో ఆయనకు ఇలా అనిపించింది, 'అందరూ స్వర్గాన్ని ఎందుకు పొందకూడదు'.

మానవ సంక్షేమ భావన రామానుజులవారి హృదయంలో లోతుగా నాటుకొని ఉండడం వలన, తన గురువు ఆజ్ఞలను పూర్తిగా పాటించాలనుకున్నప్పటికీ, మానవాళి సంక్షేమం కోసం ఆయన  హృదయం పడుతున్న తపన ఆయనను ఆపలేకపోయింది. ఆ  మంత్రాన్ని ఆయన ఉన్న ప్రదేశమంతా జపించేలా చేశాడు.

దానివల్ల అందరూ ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు. ఈ విషయం గురువుగారికి తెలియగానే ఆయనకి చాలా కోపం వచ్చింది.


అతను రామానుజాని,"ఎందుకు ఇలా చేసావు?" అని అడిగాడు.

రామానుజ ఇలా అన్నారు, "నన్ను క్షమించండి గురుదేవా. ఈ మంత్రాన్ని జపించడం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుందని తెలిసి, దానిని నా వద్దనే ఉంచుకోలేకపోయాను. నేను శిక్షకు అర్హుడినే, అయితే ఇది సర్వ మానవాళికి  ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి, నేను ఆ శిక్షను సంతోషంగా అంగీకరిస్తాను."

శిష్యుని సమాధానం విని గురువు హృదయం ప్రేమతో నిండిపోయింది. రామానుజాని ఆలింగనం చేసుకుని, "నాయనా, నువ్వు నిజమైన అన్వేషకుడివి. నువ్వు నరకానికి ఎలా వెళ్ళగలవు? అందరి అభ్యున్నతి కోసం ఆలోచించేవాడు ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందుతాడు. నీవు నిజమైన అర్థంలో ఆచార్యునివి (గురువు)" అని అన్నాడు.

రామానుజాచార్యులు గురువుగారి పాదాలకు నమస్కరించారు.

నిజమైన మానవుడు అంటే తన గురించి మాత్రమే ఆలోచించేవాడు కాదు... మానవునిగా ఉండడం అంటే ఇతరులకు మంచి చేయడం.

ఆధ్యాత్మికత యొక్క మార్గం సాహసవంతులకు, ధైర్యవంతుల కోసం. అంతకంతకూ ఇంకా దయగా, కరుణతో, దాతృత్వం కల వ్యక్తిగా మనం మారలేకపోతే మన జీవితానికి ప్రయోజనం ఏమిటి?

నిరంతరం ఇచ్చేవాడు ఎన్నటికీ ఖాళీ అవడు!

                       ♾️

మూలానికి అనుసంధానించబడిన స్వచ్ఛమైన హృదయం సహజంగా మంచితనంతో, దాతృత్వంతో, ప్రేమతో ప్రవహిస్తూ ఉంటుంది. 🌼

*లాలాజీ*

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

No comments:

Post a Comment