సర్దుకోడం నచ్చక
ఒప్పుకోవడం ఇష్టం లేక
నిలబెట్టుకోకపోతే
కోపమ్ తెలివిని చంపేయదా ?
లౌక్యంగా ఉండక
చురుకుగా ఆలోచించక
ధైర్యంగా అడుగేయకపోతే
భయం స్వేచ్ఛను చంపేయదా?
ఇష్టం అంటూ ఒకటయాక
కష్టం వచ్చినా నష్టం కలిగినా
నిందలు సందేహాలొస్తే
అహం ప్రేమను చంపేయదా ?
మనకున్నది మనని విడువదు
మనది కానిది వద్దకు రాదు
అక్కసుతో అలమటించే మనసున
శాంతిని అసూయ చంపేయదా?
మంచితనం నిజాయితీ
దైవం మెచ్చే గుణాలు
వంచన గురించిన ఆలోచనతో
సందేహం నమ్మకాన్ని చంపేయదా?
నిదుర రాదని విసుక్కుంటే
రేయి గడవక వుంటుందా?
వేగుచుక్క పొడవకుండా
వేకువ త్వరగా వస్తుందా?
🌸🌸సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment