Tuesday, November 24, 2026

రమణ మహర్షి నిత్యం పఠించిన గ్రంథం ఇదే! | Ribhu Gita Telugu

రమణ మహర్షి నిత్యం పఠించిన గ్రంథం ఇదే! | Ribhu Gita Telugu

Author Name:chaitanya jyothi

Youtube Channel Url:https://www.youtube.com/@chaitanyajyothi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=q8k_xj6fyNQ





Title: రమణ మహర్షి నిత్యం పఠించిన గ్రంథం ఇదే! | Ribhu Gita Telugu

Author Name: chaitanya jyothi

Description: ఋభు గీత రహస్యం (Ribhu Gita in Telugu) — దేవతలే భయపడి నడిసముద్రంలో విసిరేసిన అద్వైత మహా గ్రంథం! శ్రీ రమణ మహర్షి నిత్యం పఠించిన పరమ సత్యం ఇదే. ॥ శ్రీ గురుభ్యో నమః ॥ 🔱

ఒక అద్భుతమైన మహా గ్రంథాన్ని చదివిన తర్వాత "దీనిని మనుషులకు ఇవ్వకూడదు, దీన్ని తట్టుకునే స్థాయి లోకానికి లేదు" అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు మరియు ఋభు మహర్షి తీసుకెళ్లి క్షీరసాగరంలో ఎందుకు విసిరేశారు? పరమేశ్వరుడు స్వయంగా ఋభు మహర్షికి ఉపదేశించిన శివ రహస్య ఇతిహాసంలోని అత్యంత శక్తివంతమైన సారం ఈ వీడియోలో ఉంది.

ఆదిశంకరాచార్యుల నిర్వాణ షట్కం అంతరార్థం నుండి ఉపనిషత్తులు చెప్పిన "ఆత్మద్రోహి" స్థితి వరకు, అలాగే మన భయాలు, బంధాలు కేవలం ఒక భ్రమ మాత్రమేనని నిరూపించే అత్యద్భుతమైన దృష్టాంతాలను పూర్తిగా తెలుసుకుందాం.

⏱️ ఈ వీడియోలోని ముఖ్యాంశాలు (Chapters):
00:00 - దేవతలే సముద్రంలో దాచిన రహస్య గ్రంథం (ఋభు గీత కథ)
00:47 - ఆదిశంకరాచార్యుల నిర్వాణ షట్కం & మనం చేస్తున్న అసలు తప్పు
02:20 - ఋభు గీతలోని 38 అధ్యాయాల్లో దాగి ఉన్న ఒకే ఒక్క బ్రహ్మజ్ఞాన సత్యం
03:50 - 'నేతి నేతి' నుండి అద్వైత వేదాంత రహస్యం వరకు (సూర్యకాంతి ఉదాహరణ)
05:52 - సముద్రపు అల & తాడు లేని గాడిద కథ (మన భయాల అసలు నిజం)
07:05 - మోక్షానికి ఎన్ని జన్మలు పడుతుంది? (చీకటి గదిలో పాము - తాడు రహస్యం)

🙏 ఈ వీడియోలోని జ్ఞానం మీ మనసును తాకితే, మీ ఆత్మీయులకు మరియు ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు తప్పకుండా SHARE చేయండి — మీరు చేసే ఒక్క షేర్ మరొకరి జీవితంలోని అజ్ఞానపు చీకటిని తొలగించవచ్చు. అలాగే మన CHAITANYA JYOTHI ఛానెల్ కంటెంట్ మీకు నచ్చితే, ఇంటర్నెట్‌లో ఎక్కడా దొరకని అరుదైన స్తోత్ర PDF గ్రంథాలు మరియు ప్రత్యేక పరిహార మాన్యువల్స్ పొందడానికి Subscribe పక్కన ఉన్న 'JOIN' బటన్ నొక్కి మన ఛానెల్ మెంబర్‌షిప్ తీసుకోండి! 🪔🔱

🔱 చైతన్య జ్యోతి — ఆధ్యాత్మిక సాధనా పరివారం (Channel Membership)
ఈ పూర్తి శ్రీ రుద్రం సాధనా తరగతులలో చేరడానికి మీ సాధనా స్థాయిని బట్టి తగిన పరివారాన్ని ఎంచుకోండి:

👑 1. సుందరం (SUNDARAM) — [సంపూర్ణ పరివారం | అన్ని ప్రయోజనాలు ఒకేచోట]:
• 'శివం' (పూర్తి శ్రీ రుద్రం తరగతులు) & 'సత్యం' పరివార ప్రయోజనాలన్నీ ఇందులో పూర్తిగా లభిస్తాయి.
• ఛానెల్‌లోని ప్రతి ఒక్క వీడియో 100% Ad-Free (మధ్యలో ఎలాంటి యాడ్స్ అంతరాయం లేకుండా) చూసే అవకాశం.
• అరుదైన స్తోత్రాలు, మంత్రాల PDF గ్రంథాల పూర్తి లైబ్రరీ యాక్సెస్.
• ప్రత్యేక సౌకర్యం (Personal Request): మీకు నచ్చిన ఏదైనా పారాయణ వీడియో లేదా PDF గ్రంథాన్ని ప్రత్యేకంగా అడిగి చేయించుకునే అవకాశం!

🔸 2. శివం (SIVAM) — [శ్రీ రుద్రం + సత్యం]:
స్వర దోషం లేకుండా 'శ్రీ రుద్రం (నమకం - చమకం)' గురుకుల సాధనా తరగతులతో పాటు, 'సత్యం' పరివార ప్రయోజనాలన్నీ లభిస్తాయి.

🔸 3. సత్యం (SATYAM):
ఛానెల్‌లోని ప్రత్యేక సాధనా వీడియోలు & ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి అడుగు.

👉 ఇప్పుడే 'సుందరం' లేదా 'శివం' పరివారంలో చేరడానికి లింక్:
   / @chaitanyajyothi  


॥ ఓం నమః శివాయ ॥ ॥ శివోహం ॥

ఈ వీడియోలో చర్చించిన అంశాలు:
ఋభు గీత తెలుగు | శివ రహస్య ఇతిహాసం | రమణ మహర్షి ఋభు గీత | అద్వైత వేదాంతం తెలుగు | ఆదిశంకరాచార్యుల నిర్వాణ షట్కం అర్థం | ఆత్మ జ్ఞానం ఉపనిషత్తులు | చైతన్య జ్యోతి ఆధ్యాత్మిక వీడియోలు
#RamanaMaharshi
#ChaitanyaJyothi #RibhuGita #AdvaitaVedanta #TeluguDevotional #SanatanaDharma #ShivaRahasya #Upanishads #AtmaJnana #SpiritualTelugu

Transcript:
(00:01) శ్రీ గురుభ్యో నమః ఒక గ్రంథం రాసి దాన్ని చదివిన తర్వాత దీన్ని మనుషులకు ఇవ్వకూడదు అని చెప్పి ఎవరైనా తీసుకెళ్లి నడిసముద్రంలో విసిరేస్తారా? నమ్మడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజంగా జరిగిన ఒక కథ. సాక్షాత్తు పరమేశ్వరుడు రుబు మహర్షికి ఉపదేశించిన ఒక అద్భుతమైన రహస్య గ్రంథం అది. బ్రహ్మదేవుడు రుబు మహర్షి ఇద్దరూ కలిసి ఆ గ్రంథం మొత్తం చదివారు.
(00:24) చదివిన తర్వాత వాళ్ళకి ఒక భయంకరమైన నిజం అర్థమైంది. ఈ విషయం లోకానికి పనికిరాదు. దీన్ని అర్థం చేసుకునే స్థాయి మనుషులకు లేదు అని నిర్ణయించుకుని ఆ గ్రంథాన్ని తీసుకెళ్లి క్షీరసాగరంలో విసిరేసారు. కానీ అదృష్టవశాత్తు అందులో ఉన్న కొన్ని భాగాలు మన వరకు చేరాయి. ఆ గ్రంథం మరేదో కాదు రిబు గీత. అసలు ఆ పుస్తకంలో అంత ప్రమాదకరమైన విషయం ఏముంది? దేవతలే దాన్ని సముద్రంలో ఎందుకు దాచాలనుకున్నారు? ఈ తొమ్మిది నిమిషాలు అయిపోయేలోపు ఇప్పుడు వేసుకున్న ప్రతి ప్రశ్నకు మనకు సమాధానం దొరకనుంది.
(00:51) మనం రోజు గుడికి వెళ్తాం. శ్లోకాలు చదువుతాం. కొంతమంది అయితే పొద్దున్నే లేచి మనో బుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూపః శివోహం శివోహం అని నిర్వాణ షట్కం ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో పారాయణం చేసేస్తుంటారు. ఇంకొంతమంది దాన్ని మొబైల్ రింగ్ టోన్ గా కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
(01:11) ఆ శ్లోకం అర్థం ఏంటి? నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను ఈ శరీరం కాదు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ శ్లోకాన్ని చదువుతూనే నా కొడుకుకి మంచి ఉద్యోగం రావాలి, నా బిజినెస్ లో లాభాలు రావాలి అని కోరికల లిస్టు దేవుడి ముందు పెడుతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే డాక్టర్ ఇచ్చిన ఆపరేషన్ కత్తిని తీసుకొని దాంతో కూరగాయలు కోసే మూర్ఖత్వంలా ఉంటుంది.
(01:31) ఎందుకంటే ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకాలు రాసింది మనం రోజువారీ పారాయణం చేసి టిక్ మార్క్ పెట్టుకోవడానికి కాదు. అది నువ్వు ఏకాంతంలో కూర్చుని నీ లోపలికి నువ్వు చూసుకోవడానికి రాసిన సర్జికల్ టూల్స్. ఉపనిషత్తులో ఒక మాట అన్నాయి. వింటే ఒళ్ళు జలదరిస్తుంది. మనుషుల జన్మ వచ్చాక ఇంత ఆలోచించే బుద్ధి వచ్చాక కూడా అసలు నేను ఎవరిని? నా వెనక ఉన్న అసలైన శక్తి ఏంటి అని తెలుసుకోకుండా బ్రతికేసి ఉపనిషత్తులు వాళ్ళని ఏమని పిలుస్తాయో తెలుసా? ఆత్మద్రోహి.
(01:58) అంటే తన సొంత ఆత్మకే ద్రోహం వాడు అని అర్థం. కానీ రిబుగీత అందరికీ అర్థం కాదు. ఎందుకంటే దాన్ని చెప్పేవాడు దొరకడం ఎంత కష్టమో దాన్ని విని అర్థం చేసుకునే వాడు దొరకడం కూడా అంతే కష్టం. రోడ్డు మీద దొరికే రాళ్లను ఎవరు బీరువాలో దాచుకోరు. కానీ ఒక విలువైన రత్నం దొరికితే దాన్ని భరణిలో పెట్టి తాళం వేసి ఎంతో భద్రంగా దాచుకుంటాం.
(02:20) ప్రభుగీత అలాంటి ఒక అరుదైన రత్నం లాంటిది. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం చూద్దాం. నువ్వు ఒక మెడికల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశావు అనుకో అందులో వందల టాపిక్స్ ఉంటాయి. ఎందుకంటే మనిషికి వచ్చే రోగాలు లక్షల్లో ఉంటాయి కాబట్టి. నువ్వు సంగీతం నేర్చుకోవాలన్నా, మంత్రశాస్త్రం నేర్చుకోవాలన్నా లక్షల వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనిషి కోరికలు అనంతం కాబట్టి.
(02:38) కానీ బ్రహ్మ జ్ఞానంలో ఎన్ని టాపిక్స్ ఉంటాయో తెలుసా? ఒక్కటే. అవును ఒకే ఒకటి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అందుకే రిబుగీతలో ఉన్న 38 అధ్యాయాల్లో ప్రతి చాప్టర్లో ఒకే ఒక వాక్యం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. వేమన పద్యాల్లో విశ్వదాభిరామ వినురవేమ అని మకుటం రిపీట్ అయినట్లు ఇక్కడ ఒక పిడుగు లాంటి స్టేట్మెంట్ ప్రతి పేజీలో తగులుతూనే ఉంటుంది.
(03:02) మొదటిసారి చదివే వాడికి చిరాకు వస్తుంది. ఏంటిది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని. కానీ ఇక్కడే రిబు మహర్షి వాడిని ఒక లోతైన సైకాలజికల్ హ్యాక్ ఉంది. నువ్వు ఒక్కసారి ఒక విషయం విని ఆహా భలే అర్థమైంది అని నోట్స్ రాసుకొని WhatsApp గ్రూపుల్లో స్టేటస్ లు పెట్టి పడుకుంటే అది నీకు అర్థమైనట్టు కాదు. మన మైండ్ ఎలా తయారైంది అంటే ప్రతిరోజు ఈ లోకం ఈ బంధాలు ఈ భయాలు మన మీద కప్పేస్తూనే ఉంటాయి.
(03:23) ఇది ఎలా ఉంటుంది అంటే నదీ ఇసుకలో నువ్వు ఒక పెద్ద గొయ్యి తవ్వడానికి ప్రయత్నిస్తున్నావు అనుకో నువ్వు పారతో ఇసుక తవ్వుతూనే ఉంటావు. కానీ పక్కనుంచి ఇసుక మళ్ళీ ఆ గొయ్యిలో పడిపోతూనే ఉంటుంది. నువ్వు ఎంత తవ్వినా గొయ్యి మాత్రం పడదు. మన సాధన కూడా ఇంతే. ఒకసారి వినగానే మన లోపల ఉన్న అజ్ఞానం పోదు. అసకృత్ అభ్యాసాత్ మళ్ళీ మళ్ళీ ప్రతిక్షణం ఆ ఒక్క సత్యాన్ని మన బుర్ర మీద సుత్తితో కొట్టినట్టు కొట్టాలి. అప్పుడే ఆ ఇసుక ఆగుతుంది.
(03:47) అప్పుడే నిజమైన లోపల గొయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. లేకపోతే మిస్ అయిపోతారు. సాధారణంగా వేదాంత శాస్త్రం మనకు ఏం నేర్పిస్తుంది? నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని. నువ్వు అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడు ఈ శరీరం నేను కాదు, నా కళ్ళు నేను కాదు, నా ఆలోచనలు నేను కాదు, నా కోపం నేను కాదు అని ఒక్కొక్కటి తీసేయడం ఇలా తీయడం మొదలుపెడతాం.
(04:10) అలా అన్నీ తీసేయగా చివరకు ఎవరు మిగులుతారు? ఆ శరీరాన్ని, ఆ మనసుని గమనిస్తున్న చైతన్యం మాత్రం మిగులుతుంది. ఇక్కడి వరకు చాలా మందికి అర్థమవుతుంది. కానీ రివ్వు గీత ఇక్కడ ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తుంది. రివ్వు మహర్షి ఏమంటారో తెలుసా అసలు అనాత్మ అనే వస్తువే ఈ సృష్టిలో లేదు అని గట్టిగా నిశ్చయించుకో. ఒక నిమిషం ఆగండి.
(04:27) ఇది పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తుంది కదా? ఇందాక ఏం చెప్పారు? అనాత్మ వస్తువులన్నీ వదిలేయ్ అప్పుడే ఆత్మ తెలుస్తుంది అన్నారు. ఇప్పుడేమో అసలు అనాత్మ అనే వస్తువే లేదు ఉన్నదంతా ఆత్మ ఒక్కటే అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. నువ్వు కూర్చున్న గదిలో సూర్యకాంతి పడుతుంది అనుకో ఆ వెలుగు నీ టేబుల్ మీద పడుతుంది గోడ మీద పడుతుంది అద్దం మీద కూడా పడుతుంది.
(04:48) ఇప్పుడు నిన్ను ఆ గదిలో ఎన్ని వెలుగులు ఉన్నాయి అని అడిగితే నువ్వు ఏం చెప్తావు? టేబుల్ మీద ఒకటి గోడ మీద రెండు అద్దం వెలుగు మూడు అని మూడు వెలుగులు ఉన్న లిస్ట్ రాస్తావు. ఎందుకు? నీకు మూడు వెలుగులు కనిపించాయి. ఎందుకంటే నువ్వు ఉపాధి అనే ఒక టేబుల్ ని ఆ గోడ ని బేస్ చేసుకొని చూస్తున్నావు కాబట్టి.
(05:05) ఇప్పుడు ఆ టేబుల్ ని గోడ ని పక్కన పెట్టి కేవలం వెలుగు అనే దృష్టితో మాత్రమే చూడు. ఇప్పుడు ఎన్ని వెలుగులు ఉన్నాయి? ఒక్కటే ఆ టేబుల్ మీద ఉన్నది అదే వెలుగు గోడ మీద ఉన్నది అదే వెలుగు అద్దంలో మెరుస్తున్నది కూడా అదే వెలుగు. అదే విధంగా ముందు నువ్వు ఈ శరీరం నేను కాదు ఈ లోకం నేను కాదు అని పక్కన పెట్టేసిన తర్వాత నీకు ఆ ఒక్క చైతన్యం అర్థమయ్యాక మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే నువ్వు దేన్నైతే ఇది కాదు అని విసిరేసావో ఆ టేబుల్ లో ఆ గోడ లో ఆ సూర్యుడి లో ఆ చేతి లో అన్ని చోట్ల ఉన్నది ఆ ఒక్క బ్రహ్మ చైతన్యం మాత్రమే.
(05:36) ఒకవేళ ఆత్మ ఒకటి ఈ ప్రపంచం ఇంకొకటి అని రెండు వస్తువులు నిజంగా ఉంటే అది ద్వైతం అవుతుంది కానీ అద్వైతం ఎలా అవుతుంది? ఉన్నది ఒక్కటే అయినప్పుడు రెండో వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? మరి నా మనసు ఉంది కదా నాకు భయం వేస్తోంది, నాకు బాధ వేస్తోంది, ఈ ప్రపంచం నా కళ్ళకు కనిపిస్తుంది కదా ఇది లేదు అని అనమంటారు ఏంటి? ఇది లేదు అని ఎలా అనుకోవాలి? అని మనకు సందేహం రావచ్చు.
(05:55) దీనికి యోగ వాసిష్ఠం మరియు రివ్వు గీత లో ఒక అద్భుతమైన సమాధానం ఇస్తాయి. ఒక విశాలమైన సముద్రంలో ఒక చిన్న అల లేచింది అనుకో ఆ అల ఏమనుకుంటుంది? నేను వేరు ఈ సముద్రం వేరు నేను చాలా చిన్నదాన్ని నేను కింద పడిపోతే చనిపోతాను e అని భయపడుతుంది. కానీ అల లోపల ఉన్నది ఏంటి? నీరే కదా. అల బయట ఉన్నది ఏంటి? అది కూడా నీరే. అల మళ్ళీ కిందకి పడిపోతే ఏమవుతుంది? నీరు నీలోనే కలిసిపోతుంది.
(06:18) మన చిత్తం కూడా ఆ అల వంటిదే. ఆ పరమ చైతన్యం అనే చిత్ లోనే లేచిన ఈ చిన్న కల్లోలం మాత్రమే మన మనసు. ఇంకా చెప్పాలంటే ఇది గాడిద కథ లాంటిది. ఒక యజమాని తన గాడిదను రోజు ఒక చెట్టుకు కట్టేస్తూ ఉండేవాడు. ఒకరోజు వాడి దగ్గర తాడు లేదు. అయినా సరే వాడు చెట్టు దగ్గరికి వెళ్లి గాడిద కాలికి తాడు కట్టినట్టు యాక్షన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ గాడిద రోజంతా అక్కడే కదలకుండా నిలబడి పోయింది.
(06:41) ఎందుకు? దాని కాలికి తాడు లేదు. కానీ దాని బుర్రలో నన్ను కట్టేసారని భ్రమ ఉంది. మనం కూడా అంతే. నేను లేకపోతే నా ఆఫీస్ నడవదు, నా ఇల్లు నడవదండి అని తెగ ఆయాసపడిపోతూ ఉంటాం. ఈ ప్రపంచం మనల్ని కట్టేసింది అనుకుంటాం. కానీ అసలు అక్కడ తాడే లేదు. నువ్వు ఉంది అని అనుకుంటున్నావు అంతే. ఈ ప్రపంచం నిన్ను భయపెడుతోంది. నువ్వు లేదు ఉన్నదంతా ఒక్క చైతన్యమే అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఏమీ ఉండదు.
(07:06) చివరిగా ఒక ప్రశ్న. ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుంది? ఎన్ని ఏళ్ళు తపస్సు చేయాలి? అని మనం చాలా మదనపడిపోతూ ఉంటాం. రిబు గీత ఇచ్చిన ఈ భరోసా వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎన్నో జన్మలు అక్కర్లేదు, ఎన్నో ఏళ్ల తపస్సు కూడా అక్కర్లేదు. ఒక్క క్షణం చాలు. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును. ఒకే ఒక్క క్షణం చాలు.
(07:25) మరి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఒక చిన్న దృశ్యాన్ని ఊహించుకోండి. అర్ధరాత్రి రెండు గంటల సమయం. మీరు ఒక చిమ్మ చీకటి గదిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ కళ్ళు మెల్లగా కిందకి చూస్తాయి. మూలలో చుట్టుకుని పడుకున్న ఒక పెద్ద పాము మీకు కనిపిస్తుంది. ఆ క్షణం మీ శరీరంలో ఏం జరుగుతుందో గమనించండి. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
(07:45) మీ అరచేతులు చల్లటి చెమటలు పట్టేస్తాయి. మీ గొంతు ఎండిపోతుంది. కాళ్ళు కదలకుండా నిశ్చేష్టులై గడ్డకట్టుకు పోతారు. గంటల తరబడి మీరు ఆ చీకటిలో వణుకుతూ నిలబడి పోయారు. అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి ఆ గదిలో ఒక టార్చ్ లైట్ వేశారు. ఆ వెలుగు సరిగ్గా మూల మీద పడింది. ఆ టార్చ్ వెలుగు పడగానే అక్కడ పాము లేదు అది ఒక పాత తాడు మాత్రమే చుట్టుకుని ఉంది అని కనిపించింది మీకు.
(08:08) ఇప్పుడు ఒక మాట చెప్పండి. మీరు పాము అనుకొని గంటల తరబడి భయపడి పోయారే మరి అది తాడ అని తెలిసిన తర్వాత మీ భయం పోవడానికి గంటల తరబడి సమయం పడుతుందా లేక ఒక్క క్షణం ఆ భయం మాయమై పోతుందా? ఒక్క క్షణంలోనే మాయమై పోతుంది కదా. ఎందుకంటే మీరు కొత్తగా తాడును తయారు చేయలేదు. అది ముందు నుంచి అక్కడ ఉన్న తాడుగానే ఉంది. మీరు చీకటిలో దాన్ని చూసి పాము అని అనుకున్నారు అంతే. మనం కూడా అంతే.
(08:31) మనం ఎప్పుడో భవిష్యత్తులో తపస్సు చేయగా చేయగా మనం భగవంతుడు లేనివాడు ఇప్పుడు మోక్షం పొందడం కాదు. మనం ఇప్పటికే ఆ బ్రహ్మ స్వరూపులమే. అజ్ఞానం అనే చీకటిలో ఈ శరీరం ఈ భయాలు అనే పామును చూసి వణుకుతున్నాం అంతే. ఎప్పుడైతే మన లోపల జ్ఞానం అనే టార్చ్ లైట్ వెలుగుతుందో ఆ ఒక్క క్షణంలో ఈ లోకం అనే భ్రమ తొలగిపోతుంది. అందుకే రిబు మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పకుండా క్షీరసాగరంలో దాచారు.
(08:54) ఎందుకంటే ఈ సత్యం వినగానే మీకు ఇక ఈ లోకం మీద ఎక్కడా లేని భయం ఆశ అన్నీ ఒక్కసారిగా ఆవిరై పోతాయి కాబట్టి. శివోహం.

No comments:

Post a Comment