*బలి పేరుతో ఊరు*
*బ్రహ్మ ప్రతిష్టించిన శివుడు మహావిష్ణువే క్షేత్రపాలకుడు బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర ఆలయం*
పురాణ పురుషుడు బలి చక్రవర్తి పేరుతో ఒక ఊరు. ఆ ఊరు పేరు బలిఘట్టం, శివుడి ఆయుధం త్రిశూలం. త్రిశూల పర్వత శ్రేణిపై పరమశివుడు. ప్రతిష్ఠించిన వారు బ్రహ్మ. ఈ శివుడి పేరు బ్రహ్మ లింగేశ్వరుడు. శివుడు అభిషేక ప్రియుడు. నిత్యం నీరు అవసరం. బ్రహ్మ లింగేశ్వరుడు ఆలయాన్ని అనుకొని నిత్యం ప్రవహించే వరాహ నది. మహావిష్ణువు ఆది రూపం వరాహం. ఇదే పేరుతో ప్రవహించే నది ఇది. శివుడు కొలువైన కైలాస పర్వతం ఉండేది ఉత్తర దిక్కున, వరాహ నది బ్రహ్మ లింగేశ్వర ఆలయ సమీపం నుంచి ఉత్తర దిక్కు వైపు ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ఉత్తర వాహిని నదిగా పిలుస్తారు. కాశీలో గంగానది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. బలిఘట్టంను కూడా దక్షిణ కాశీగా పిలుస్తారు. శివారాధనలో పచ్చిమాభిముఖంగా ఉన్న శివుడికి విశిష్టత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి శివుడు పచ్చిమాభిముఖంగా కొలువై ఉన్నాడు. చాలాచోట్ల రాతి రూపంలో ఉన్న శివలింగాలు పూజలు అందుకుంటాయి. బ్రహ్మ ప్రతిష్టించిన బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వరుడు మాత్రం స్ఫటిక లింగరూపుడై పూజలు అందుకుంటున్నాడు. శివుడు పచ్చిమాభి ముఖంగా కొలువై ఉన్న పశ్చిమదిశలో వైదూర్యాలు లభించే కరక కొండలు ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. బలి చక్రవర్తి కృతయుగంలో త్రిశూల పర్వత శిఖరంపై తపస్సు చేశాడు. ఇక్కడి వరాహ నది తీరాన యజ్ఞం చేశాడు. ఆయన యజ్ఞం చేశారనడానికి సాక్ష్యంగా ఇక్కడ విభూది గనులు ఉండేవి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కడ తవ్వినా తెల్లని వర్ణంలో మట్టి లభిస్తుంది. 1990 లో వచ్చిన భారీ పరదల్లో ఉత్తర వాహిని దిశ మారిపోయి తూర్పు దిక్కు వైపు ప్రవహించేది. ఆ తర్వాత కాలంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవ తీసుకొని, తూర్పు దిక్కు వైపు ఎత్తైన గట్లు నిర్మించి నది దిశను మళ్లీ ఉత్తర దిక్కు వైపు మళ్ళించారు. ఇక్కడ భక్తుల స్నానానికి వీలుగా నీరు నిలువ ఉండడానికి చెక్ డ్యాం నిర్మించారు. బలి తపస్సుకు మెచ్చి, బలి కోరిక మేరకు శివుడిని ప్రతిష్టించాడు. బ్రహ్మ చేత ప్రతిష్టించబడడంతో బ్రహ్మ లింగేశ్వరుడుగా పిలవబడుతున్నాడు. శివారాధన కోసం నిత్య అభిషేకానికి నీరు కావాలని మహావిష్ణువుని ప్రార్ధించగా వరాహ రూపం ధరించి వరాహనదిని తీసుకొచ్చారని స్థల పురాణం. కృతయుగంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని అనంతర కాలంలో చోళ రాజులు పునర్ నిర్మించారు. రెండు గోపురాలతో ఉండే ఆలయ నిర్మాణంలో 108 ఆకృతులతో ఉన్న స్తంభాలతో బలిఘట్టం బ్రహ్మ
లింగేశ్వర ఆలయాన్ని పునరుద్ధరింపజేశారు. బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర ఆలయంలో ఈ మహాశివరాత్రి వైభవంగా జరపడానికి నిర్వా హకులు ఏర్పాట్లు చేశారు. ఉత్తర వాహిని స్నాన ఘట్టాలవద్ద జల్లు స్నానం కూడా ఏర్పాటు చేశారు. రాత్రి జాగరణ కోసం నదీ తీరానికి వచ్చే భక్తులు ఉత్తర వాహిని నదిలో స్నానమాచరించిన తర్వాత బ్రహ్మ లింగేశ్వరుని దర్శించుకోవడం, ఈ ప్రాంతం లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. వేలా దిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుం డా ఉత్తర వాహిని నదీతీరం వెంబడి లైటింగ్
క్షేత్ర పాలకుడు శ్రీ మహావిష్ణువు
ॐ
అమర్చారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయం గా ఉత్తర వాహిని స్నాన ఘట్టాలను సందర్శిం చారు. అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. భక్తుల స్నానాలకు ఇబ్బంది కలగకుండా రావణపల్లి రిజర్వాయర్ నీటిని మూడు రోజులు పాటు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశిం చారు. పారిశుధ్య పనులను నిరంతరం అమలు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధతోఈ ఏడాది ఉత్తర వాహినినదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాశీలో గంగ హారతి మాదిరిగా ఇక్కడ ఉత్తరవాహిని నదీ హారతి ఇవ్వడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నదీ తీరంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చ కులు పెరవెల్లి భద్రాచలరామంకు హారతి ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. బ్రహ్మ లింగేశ్వర ఆలయం వద్ద ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. జాగరణ కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కళారూపాలను ప్రదర్శించనున్నారు. వివిధ సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీరు, ప్రసాద వితరణ, అన్నదానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment