*అన్నిటికీ మూలం*
ప్రతి మనిషిలో సగం మంచి ఉంటుంది, సగం చెడు ఉంటుంది.
చీకటీ లోపలే ఉంటుంది, వెలుగు కూడా లోపలే ఉంటుంది.
సందేహాలు లోపలే ఉంటాయి, స్పష్టతా లోపలే ఉంటుంది.
ఈ ప్రపంచంలో మనం దారి తప్పితే... అది మనలోనే జరుగుతుంది. మనల్ని మనం పొందినట్టయితే అది మనలోనే జరుగుతుంది.
మనల్ని మనం పొందినట్టయితే అది కూడా మనలోనే జరుగుతుంది. అన్నింటికీ మూలం మనలోనే ఉంది. బయటెక్కడో లేదు.
మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదో చేయడం వల్ల, దేన్నో చూడడం వల్ల ఆనందంగా అనిపిస్తుందని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు.
👉ఆనందానికి మూలం మనలోనే ఉంది. అది ఏ వస్తువులోనూ ఉండదు. ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో మార్పు కనిపిస్తుంది.
🌿ఎందుకంటే ఏదైనా అర్థం కావడం లేదంటే, అందుకు మూలం మీలోనే ఉందని గ్రహించాలి.
🌿ఏ దైవాన్ని మీరు అన్వేషిస్తున్నారో ఆ దైవం మీలోనే ఉంది. ఏ భూతం నుంచి మీరు తప్పించుకోవాలని అనుకుంటున్నారో అది కూడా మీలోనే ఉంది. మీరు ఎక్కడికి వెళ్లినా ఆ రెండూ మీలోనే ఉంటాయి.
👉ఎన్నోసార్లు మీరు ఏకాంతంగా గడపాలని గదిలోకి వెళ్ళి, తలుపుకి గొళ్ళెం పెట్టుకుంటారు. అయినప్పటికీ మీరు ఏకాంతంగా ఉండరు. ఇంతకుముందు చెప్పినవన్నీ మీతోనే ఉంటాయి.
🌿ప్రకాశం మీలోనే ఉంటుంది, అంధకారం కూడా మీలోనే ఉంటుంది.
ఈ యావత్ సృష్టిని రచించిన ఆ సృష్టికర్త కూడా మీలోనే ఉన్నాడు. అలాగే యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న పెనుభూతం కూడా మీలోనే ఉంది. ఏం జరుగుతున్నా సరే... రెండూ మీలోనే ఉంటాయి... మంచీ ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఒకవేళ చెడు బయటికి వచ్చినా, దాన్ని అంతమొందించే మంచి కూడా మీలోనే ఉందని తెలుసుకోవడం చాలా అవసరం.
No comments:
Post a Comment