Sunday, March 2, 2025

 *ధ్యాన 😌మార్గ*       ఏదైనా తప్పు చేస్తే ‘సారీ’ అనేస్తాం. ఎంత పెద్ద తప్పునైనా ఆ చిన్న ఇంగ్లీషు మాటతో సరిపెట్టేస్తాం. ‘ఇక అయిపోయిందిలే’ అని అంతటితో ముగించేస్తాం. 

🌿కానీ పశ్చాత్తాపం అనేది చాలా పెద్ద మాట. లోతైన మాట. ఒక చేయరాని పెద్ద తప్పు చేసినప్పుడు... మానసికంగా మధనపడడం, మళ్ళీ అలాంటి పనికి ఆస్కారం ఇవ్వకుండా మెలగడం... ఇదీ పశ్చాత్తాపంలోని అంతరార్థం. 

👉గతంలోని మంచి చెడులు నెమరువేసుకోవడం సర్వసహజం. చేసిన మంచిపనులకు ఎంతగా ఆనందించి గర్వపడతామో... చేసిన తప్పులకు అంతగానూ బాధపడాలి. ఇకపై అలా చేయకూడదనే నిర్ణయం తీసుకోవాలి. పశ్చాత్తాపానికి అదీ ఫలితం.🍁

☘☘☘☘
🌴🌴🌴🌴

🍁మనకు కఠిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మన సహనానికి పరీక్ష ఎదురవుతుంది. 

చాలా మంది అటువంటి సమయాల్లో సహనాన్ని కోల్పోతుంటారు. 

మీపై విమర్శలు వచ్చినప్పటికీ వాటిని విని ఓర్పు వహిస్తే మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు.

No comments:

Post a Comment