Sunday, March 2, 2025

 *`భార్యదే అసలైన చదువు.!`*

*అవును..*
*భార్యదే నిజమైన చదువు.*

*చిన్నప్పుడు తల్లిదండ్రులను..*

*చదువుకున్నప్పుడు స్నేహితులను..*

*కలిసిమెలిసితిరిగేటప్పుడు ఇరుగుపొరుగు వారిని..*

*చదువుకుంది..*

*పెళ్ళి అయ్యాక భర్తను చదువుతుంది.*
*పిల్లలను చదువుతుంది.*
*తన కుటుంబ సభ్యులను చదువుతుంది.*
*పరిసరాలను చదువుతుంది..*

*అందుకే...*

*భర్తకు.. తన గురించి తనకు*
*తెలియని విషయాలెన్నో*
*భార్యకు తెలుసు!*

*తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు.*
*పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు.*

*అందుకు..*
*ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ!*

*సంసారం ఒక* *గడియారమనుకుంటే..*
*చిన్న ముల్లు భర్త,*
*పెద్ద ముల్లు భార్య*

*గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం!*
*నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం!*

*వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట..*

*కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే*
*చీపురు చిరాకు పడుతుందట..!*

*పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో* *చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా* *అని కంట నీరు తిప్పుతుంది*
*ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది.*

*ఇన్ని చదువుతున్న తనకు ఇంగ్లీషు చదవడం నేర్పుదామంటే నువ్వుండగ నాకేం లోటని.. అమాయకంగా నవ్వుతుంది పిచ్చిదాయి.*

*ఇంకా..లెక్కల్లో కూడా నేనే ఫష్ట్ అంటుంది.. పేపరుమీద రూపాయల లెక్కలు మీరు చెబితే ..ఆ రూపాయలతో ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని అంటుంది.*

*ఎందుకంటే..*

*పుస్తకాల్ని మాత్రమే చదివేది భర్త.*
*భర్తను సైతం చదివేది భార్య.*

*ఇంటిల్లపాదిని*
*తన హస్తరేఖలుగా మలచుకొన్న*
*తన నేర్పంతా*
*తన సంస్కారం ముందు తల వంచుతునేఉంటుంది*

*అందుకే ఆమె చదువే గొప్పది.*
*ఆమె సంస్కారమే ఎనలేనిది.*

*ఓడి గెలుస్తుంటుంది భార్య!*
*గెలిచి ఓడేది భర్త.. !!*

*అందుకే తనే ఓ సిద్ధాంతమైంది.*

*పెసలు నలిగి పిండి కాలాలంటే తిరగలి పాప ఒకటి తిరగుతుండాలి.. ఇంకొకటి కదలకుండా ఉండాలి ..అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది*

*పనిమనిషినైనా పెట్టకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది!*

*ఎలా చూసినా..*
*అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది!*

*అందుకే..*
*శ్రీమతి ఒక అమూల్యమైన బహుమతి*
*ఆమే చదువుల సరస్వతి...*

No comments:

Post a Comment