Sunday, March 23, 2025

 *_ఈ మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిది కాదు._* 

*_ఈ ప్రాణమూ దేహమూ శాశ్వతంగా ఉండిపోవు కూడా. ఇది మాయామయమగు లోకము కనుక ఇక్కడ దొరికే సుఖాలు కూడా మాయతో కూడినవే!_*

*_ఇది స్వార్థపూరితమైన ప్రపంచం కనుక ఇందులో ఉండే బంధాలన్నీ స్వార్థపూరితమైనవే!_*

*_ఇక్కడ మనదంటూ బయట ఏదీ లేదు. మనదంటూ ఏదైనా ఉందంటే అది మన లోపలే ఉంటుంది. అదియే ఆత్మానందము._* 

*_ఈ ఆత్మానందము చిక్కవలెనంటే పరలోకమునందే!_*
*_పరలోకమనగా ఎక్కడో ఆకాశం పైన లేదు! మనలోనే ఉంటున్నది._*

*_కుండలో పాలుపోసి కవ్వముతో బాగుగా చిలికినపుడు వెన్న రావడం జరుగుతుంది. అదే విధముగా మనస్సును భగవన్నామమనే కవ్వంతో బాగా చిలకాలి.అపుడే ఆత్మానందమనే వెన్న లభిస్తుంది._*

*_ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక ఆదర్శంపై అభిరుచి కలిగే తీరుతుంది._*

*_అప్పుడు వారికి ప్రపంచంలో ఏదీ సంతృప్తిని ఇవ్వదు. ఆ ఉన్నత ఆదర్శాన్ని ప్రాప్తించుకునే వరకూ వారికి మనశ్శాంతి లభించదు._*

*_ఈ వ్యాకులత, అంతరంగిక జాగృతి ఇవే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలుకుతాయి. ఆధ్యాత్మిక ఆదర్శం వారిని ప్రబలంగా ఆకర్షించి, జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది._*

*_ఈ విధంగా ప్రాపంచికమైన ఆదర్శాలను వదలి ఆధ్యాత్మికమైన ఆదర్శాలను అనుసరించడమే ఆధ్యాత్మిక పరివర్తన. దీనితోనే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమౌతుంది._*

*_ఈ పరివర్తన కొందరిలో హఠాత్తుగా జరిగితే మరి కొందరిలో క్రమక్రమంగా జరుగుతుంది._*

*_అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా చెబుతాడు...”అనేక వేలమంది మనుజులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేకమందిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను వాస్తవముగా తెలిసికొనగల్గుతున్నాడు.”_*

*_వేలకొద్ది జనులలో చాలా కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులౌతారు. అటువంటి ఆధ్యాత్మిక సాధకులలో బహుకొద్ది మందికి మాత్రమే అత్యున్నతమూ, చైతన్యానికి కూడా అతీతమూ అయిన సాక్షాత్కారం లభిస్తుంది._*

*_కానీ మనం నిరాశ చెందకుండా, ఆ ప్రయత్నించే కొద్దిమందిలో మనం కూడా ఉన్నామని భావించుకుని, ఆ ఆధ్యాత్మిక ఆదర్శం కోసం తీవ్రంగా శ్రమిద్దాం._*

*_┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈_*
       *_ఆధ్యాత్మికం బ్రహ్మానందం_*
🦚🛕🦚 🙏🕉️🙏 🦚🛕🦚

No comments:

Post a Comment